మెయన్ ఫీచర్

మన దేశంలోనూ ‘మసూద్’లు ఎందరో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మసూద్ అజార్ అనే ఉగ్రవాది ‘జైషే మహమ్మద్’ సంస్థను స్థాపించిన వాడు. ముంబయి పేలుళ్ల వంటి పెను విధ్వంసాలకు సూత్రధారి అయిన అజార్ చాలాకాలంగా పాకిస్తాన్‌లో దాక్కున్నాడు. మన దేశంలో జరిగిన ఎన్నో ఉగ్రదాడులకు జైషే మహమ్మద్ సంస్థయే కారణం. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా వద్ద 45 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చింది ఈ సంస్థకు చెందిన ఆత్మాహుతిదళ సభ్యుడే. ఈ సంఘటన నేపథ్యంలో మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజంలో ఒత్తిడి పెరిగింది. ఐక్యరాజ్యసమితిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు చైనా ‘వీటో’ చేసింది. ఇప్పటికి మూడుసార్లు చైనా ఇలా ‘వీటో’ చేసి, చైనా తమ ఏకపక్ష ధోరణిని ప్రదర్శించింది. పాకిస్తాన్ చైనాకు వలస దేశం. ఈ కారణంగా పాక్‌ను రక్షించాలని చైనా ప్రయత్నిస్తోందన్న సంగతి బహిరంగ రహస్యం.
కాగా, దౌత్యపరంగా భారత్ ఒక విజయం సాధించింది. రష్యా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌ల సహాయంతో ఐక్యరాజ్యసమితిలోని ‘అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబి తా’లో జైషే మహమ్మద్ సంస్థను చేర్పించడంలో భారత్ తన పట్టును నిరూపించుకుంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా చైనా చేత ఒప్పించింది. ఈ పరిణామంతో దశాబ్దాలుగా భారత్ చేస్తున్న వాదానికి బలం చేకూర్చినట్లయింది.
శ్రీలంకలో ఇటీవల క్రైస్తవులపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు 300 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని సిరియాకు చెందిన ఉగ్రసంస్థ ‘ఐసిస్’ ప్రకటించింది. ఉగ్రవాద సంస్థల జెండాలు కశ్మీరు లోయలో ఎగురుతూ ఉంటా యి. ఐసిస్, జైషే మహమ్మద్ ముఠాలకు కేరళ, తమిళనాడుల్లో కరడుకట్టిన కార్యకర్తలు ఉన్నారనే విషయాన్ని మన నిఘా వర్గాలు ఇదివరకే నిర్ధారించాయి. కొలంబోలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ సహానీ మాట్లాడుతూ ‘మా హెచ్చరికలను శ్రీలంక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు’ అన్నారు. ఎల్‌టీటీఈ తీవ్రవాద సంస్థ మూలాలు కూడా తమిళనాడులోనే ఉండటం గమనార్హం. ఎల్‌టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ తమిళ జాతీయుడు. శ్రీలంకను రెండుగా విభజించి, తమిళులకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలని అతను పోరాడాడు. శ్రీలంక ప్రభుత్వంతో ఈయన చేపట్టిన సంగ్రామానికి ఆయుధాలను సరఫరా చేసింది సాక్షాత్తూ చైనాయే.
ఈనెలలో ‘కార్మిక దినోత్సవం’ రోజున మహారాష్టల్రోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు పేల్చగా 16 మంది జవాన్లు హతులైనారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో భాజపా శాసనసభ్యుడు భీం మాండవీ సహా నలుగురు పోలీసులు మావోల విధ్వంసానికి ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల పంజా మన దేశంలో ఆగటం లేదు. ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, పల్నాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్, కేరళలోని మల్లపురం, వైనాడ్ ప్రాంతాలు, శ్రీలంకలోను మావోయిస్టులు బలంగా పనిచేస్తున్నారు. వారికి ఆయుధాలను,నిధులను చైనా పంపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తన తాజా ఎన్నికల మేనిఫెస్టోలో కశ్మీరు నుండి సైనిక బలగాలను తొలగిస్తామని, కశ్మీరు స్వయంప్రతిపత్తికి మద్దత్తునిస్తామని ప్రకటించింది. సారాంశం ఏమిటంటే మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చినంత మాత్రాన సంబరపడిపోవలసింది ఏమీ లేదు. మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది వామపక్ష మేధావులు, రచయితలు, అర్బన్ మావోయిస్టులు బహిరంగంగా ఉగ్రవాదులను సమర్ధిస్తూ టీవీ చానళ్లలో ఇంటర్వ్యూలు ఇవ్వటం గమనార్హం. జంగిల్ మావోయిస్టులకు మద్దతుగా అర్బన్ మావోయిస్టుల వలయం మరింత విస్తృతం అవుతోంది. విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనూ వీరు పాగా వేస్తున్నారు. జాతీయవాదం అంటే దేశద్రోహం అని వీరు విద్యార్థులకు నూరిపోస్తున్నారు. దీంతో ప్రముఖ విద్యాసంస్థలు తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు అడ్డాలుగా మారిపోతున్నాయి.
కాగా, అసలు సిసలు అంతర్జాతీయ ఉగ్రవాది జిన్‌పింగ్. ఇతడు చైనా ప్రస్తుత అధ్యక్షుడు. మరో ప్రముఖ ఉగ్రవాది ఇమ్రాన్‌ఖాన్. ఇతడు పాకిస్తాన్ ప్రధాని హోదా లో భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతున్నాడు. ఇలాంటి వారిని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చకుండా మసూద్ అజార్‌ను మాత్రమే చేర్చినందువల్ల తాత్కాలిక ప్రయోజనం మాత్రమే లభిస్తుంది. కేరళలో సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ వంటి ప్రముఖులు బహిరంగంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. వీరిని కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం నియంత్రించలేకపోతున్నది.
తీవ్రవాదాన్ని నిరోధించేందుకు కేంద్రం ఇకనైనా కొన్ని నిర్దిష్టమైన చర్యలను తీసుకోవాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎమర్జెన్సీ విధించి, అక్కడి ప్రభుత్వాన్ని రద్దుచేయాలి. దండకారణ్యంలోని ఉగ్రవాద స్థావరాలను కేంద్రం గుర్తిం చి వాటిపై ఆకస్మికంగా సైనిక చర్య తీసుకోవాలి. లేకుంటే దేశ ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింతగా సన్నగిల్లుతున్నది. ఇక- సినిమాల్లో, రాజకీయాల్లో చేరడానికి యువత ఉత్సాహం చూపుతుందే తప్ప సైన్యంలో చేరడానికి ముందుకు రాదు. ఎన్‌టిఆర్, కేసీఆర్, చంద్రబాబు, కరుణానిధి, దేవెగౌడ, రాజీవ్‌గాంధీల సంతా నం రాజకీయాల్లో చేరారే కాని సైన్యంలో చైరడానికి ఇష్టపడలేదు. ప్రహ్లాద్ కులశ్రేష్ట సుప్రసిద్ధ నాయకుడు. వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన కుమార్తెను ఎవరో అపహరించారు. ‘ఈ పని చేసింది మేమే.. మా ఉగ్రవాద ముఠాకు చెందిన నాయకులను కశ్మీరులో వదిలిపెడితే- మేము ఈ అమ్మాయిని విడిచిపెడతాం..’ అని ఉగ్రవాదులు లేఖ పంపారు. వెంటనే ఉగ్రవాదులను వదిలిపెట్టారు. ఆ తర్వాత కులశ్రేష్ట కుమార్తెకు విముక్తి లభించింది. ఇంతకూ జరిగిందేమిటంటే ఆ అమ్మాయిని కాంగ్రెస్ వారు ఒకచోట దాచిపెట్టి, ఓ నకిలీ లేఖను సృష్టించారు. ఈ వివరాలు గతంలో మీడియాలో ప్రముఖంగా ప్రచారమయ్యాయి. రోనా విల్సన్ అనే తీవ్రవాద సానుభూతిపరుడి నుంచి మన నిఘా వర్గం అధికారులు స్వాధీనం చేసుకున్న లేఖల్లో పలు ఆందోళనకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులకు మందుగుండు సామాగ్రి, తుపాకులు, డబ్బును కాంగ్రెస్ వారు అందిస్తున్నారట! ఈ పనికి అర్బన్ మావోయిస్టులు వరవరరావు, జిగ్నేష్ మెమానీ వంటి నాయకులు సహాయపడుతున్నారని ఆ లేఖలో ఉంది. అంటే ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ల హత్యకు మావోయిస్టు మేధావులు, మన రాజకీయ నాయకులే నైతిక బాధ్యత వహించాలి.
***
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ చేస్తున్న ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ‘ఉత్తరప్రదేశ్‌లో తాము బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టడానికి కారణం ఏమిటంటే- ప్రతిపక్షాల ఓటు చీలకూడదని, అంటే భాజపాను ఓడించటం కోసం ఇలా చేశాం..’ అని ఆమె ప్రకటించారు. భాజపా పట్ల ఈమెకు ఎందుకింత కక్ష? ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆర్థిక నేరాలకు సంబంధించి తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటూ ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నారు. ఇన్ని విషయాలు తెలిసినా, బిజెపి-విహెచ్‌పి-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఎం దుకు అసమర్ధంగా చోద్యం చిత్తగిస్తున్నారు!

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్