మెయిన్ ఫీచర్

ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే (ఓషో బోధ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవహించే నదిలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా జీవిస్తారు. అలా జీవించే క్షణంలో భార్య, భర్త, కుటుంబం సమాజం, చర్చి, భద్రత, గౌరవ మర్యాదలు- ఇలా అన్నీ క్రమక్రమంగా కనుమరుగవుతూ, చివరికి పూర్తిగా క్షీణించి అదృశ్యమవుతాయి. అపుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారు.
అందుకే అందరికీ ఫార్ములా- 1 కార్ల పోటీ, గ్లైడింగ్ (గాలిపటంలా ఆకాశంలో ఎగరడం), సర్ఫింగ్ (సముద్ర కెరటాలపై విహరించడం) లాంటి ప్రమాదంతో కూడుకున్న ఆటలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ ప్రమాదాలనుంచి తప్పించుకునే మార్గాలను మీరు చక్కగా నేర్చుకుంటారు. అలా వాటిలో మీ నైపుణ్యం పెరుగుతుంది. అపుడు అవి మీకు అంత ప్రమాదకరమైనవిగా కనిపించవు. అందువల్ల మీరు ఆ ప్రమాదాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతారు. చూసేవారికి మాత్రమే అవి ప్రమాదకరంగా కనిపిస్తాయి. ఒకవేళ వాటిలో ప్రమాదమున్నప్పటికీ అది చాలా స్వల్పంగా, కేవలం శరీరానికి సంబంధించినంత వరకే వుంటుంది. అందుకే అవి అందరూ అనుకుంటున్నంత ప్రమాదకరమైనవి కావని నేనంటాను.
ధార్మికతలో జీవించడం ఆధ్యాత్మికపరమైన ప్రమాదం. ఎందుకంటే ధార్మికతలో మీరు వెనక్కి రాలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికపరమైన ప్రమాదం.
‘‘ప్రమాదకరంగా జీవించండి’’ అని నేనంటున్నానంటే అర్థం శారీరకపరమైన ప్రమాదాలలో మాత్రమే కాకుండా, మానసికపరమైన, చివరికి ఆధ్యాత్మికమైన ప్రమాదాలలో కూడా జీవించండి అని.
ధార్మికతలో జీవించడం ఆధ్యాత్మికపరమైన ప్రమాదం. అది మిమ్మల్ని చాలా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కానీ, మీరు అక్కడినుంచి వెనక్కి రాలేకపోవచ్చు. దాని బుద్ధుడు ‘అనగమి’ (వెనక్కి రాలేనివాడు) అంటాడు. ఎందుకంటే, ధార్మికతలో మీరు వెనక్కి రాలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికపరమైన ప్రమాదం.
మామూలు మేయర్‌గానో, కార్పొరేషన్ సభ్యునిగానో లేదా ఒక మంత్రిగానో జీవించకండి. పేరు, ప్రతిష్ఠ, గౌరవ మర్యాదలు, చాలా డబ్బు, అనేక సౌకర్యాలతో అది పరిపూర్ణంగానే ఉండవచ్చు. అంతమాత్రాన అదే జీవితం కాదు. మహాఅయితే మీరు చనిపోగానే పెద్ద ఊరేగింపు జరగవచ్చు, వార్తాపత్రికలలో మీ ఫొటోలు ప్రచురించవచ్చు. మీ గురించి సంపాదకీయాలు రాయవచ్చు. తరువాత అందరూ మిమ్మల్ని మర్చిపోవచ్చు. ఇలాంటి అతి సాధారణ లౌకిక విషయాలకోసమా మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టారు. అవి అర్థంలేనివని నేను చెప్పట్లేదు. అవి అర్థవంతమైనవే. కానీ, అవి మీరనుకున్నంత అర్థవంతమైనవి కావని నేనంటాను. అలాంటి స్వల్ప విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే ఆధ్యాత్మికత అంటే. డబ్బు, ఇల్లు, వాహనం-ఇలాంటి వసతులు, సౌకర్యాలు జీవితానికి అవసరమే. కానీ, అవి అవసరానికి తగినంత ఉంటే సరిపోతుంది. అంతేకానీ, అవే జీవిత పరమార్థం కాకూడదు. దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి.
ఉదాహరణకు, ఇల్లు మనకు అవసరం కానీ, ఇంటికి మనం అవసరం కాకూడదు. కానీ, కొందరు ‘‘వారే ఇంటికి అవసరం’’అన్నట్లుగా దాని కోసమే కష్టపడుతూ బతుకుతారు. అలాగే కొందరు ‘‘తాము లేకపోతే బ్యాంకుల్లో డబ్బే ఉండదు’’అన్నట్లుగా చాలా కష్టపడి సంపాదించడం కోసమే బతుకుతూ, చివరికి మరణిస్తారే కానీ, ఒక్క క్షణమైనా హాయిగా ఎప్పుడూ జీవించరు.
ఇలాంటివన్నీ చెప్పే నేను, మీ కొంపలుకూల్చి హిమాలయాలకు పారిపోవాలని కోరుకునే సన్యాసిని కాను. కాబట్టి, మనుషుల్ని గమనిస్తే అంతా తలకిందులుగా ఉన్నట్లనిపిస్తుంది.
డబ్బు, ఇళ్ళు, భూములు, పదవులు, కీర్తి, ప్రతిష్ఠ, అధికారాలు- ఇలా కేవలం లౌకిక సుఖాలు, అవసరాల బంధనాలలో అందరూ భద్రంగా బతుకుతూ మరణిస్తున్నారే తప్ప, జీవన వాహినిలో ఒక్క క్షణమైనా ఎవరూ హాయిగా జీవించట్లేదు.
- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.