మెయిన్ ఫీచర్

స్వేచ్ఛతోనే నైపుణ్యం( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందువల్ల వారికి సహజంగానే జీవితం విసుగనిపిస్తుంది.
నాదగ్గరకు వచ్చిన వారిలో చాలామంది ‘‘జీవితం విసుగనిపిస్తోంది’’ అన్నవారే. ఎందుకంటే, వారు ఎక్కడో ఇరుక్కుపోయి చాలా విసిగిపోయారు. చేసేదేముంది? ‘‘మంత్ర జపం’’చేస్తే మళ్ళీ జీవమొస్తుందని వారనుకుంటారు. కానీ, అది అంత సులభం కాదు. అందువల్ల వారు తమ జీవన సరళిని పూర్తిగా మార్చుకోక తప్పదు.
ప్రేమించండి. కానీ, రేపు మీ ప్రియుడు లేదా మీ ప్రియురాలు మీ దగ్గరే ఉంటారనుకోకండి, ఉండాలని ఆశించకండి. అలాగే ప్రియుడికి ‘‘్భర్త’’స్థాయికి, ప్రియురాలిని ‘‘్భర్య’’ స్థాయికి తగ్గించకండి. ఎందుకంటే, ‘‘్భర్త, భార్య’’అనే పదాలు చాలా అసహ్యకరమైన పదాలు. అందువల్ల మీ ప్రియుడిని ప్రియుడిగానే ఉండనివ్వండి. అలాగే మీ ప్రియురాలిని ప్రియురాలిగానే ఉండనివ్వండి. రేపు మీరేం చెయ్యాలో ముందుగా ఊహించకండి. ఏదీ ఆశించకుండా అన్నింటికీ సిద్ధంగా ఉండండి. అప్పుడే మీరు ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవిస్తున్నట్లు లెక్క.
కానీ, మనమేం చేస్తున్నాం? ప్రేమలోపడిన వెంటనే పెళ్ళి చేసుకునేందుకు న్యాయస్థానానికో, రిజిస్టార్ ఆఫీసుకో, చర్చికో, మసీదుకో, దేవాలయానికో మనం వెళ్తున్నాం. పెళ్ళిచేసుకోవద్దని నేను చెప్పట్లేదు. సమాజాన్ని తృప్తిపరచేందుకు అది మంచి సంప్రదాయమే. కానీ, మీ మనసులో ఎప్పుడూ ‘‘నువ్వు నా దానివి, మీరు నావారు’’అని చెప్పే స్వాధీనతాభావాన్ని చేరనివ్వకండి. దానివల్ల మీ ప్రేమ కుంగి, కృశించి, నలిగి నాశనమవుతుంది. అప్పుడు మీరు ఏమాత్రం ప్రేమించుకోలేరు.
ప్రేమించండి. కానీ, ఆ ప్రేమను పెళ్ళిస్థాయికి దిగజార్చకండి. అలాగే, పనిచెయ్యండి. అది అవసరమే. కానీ, ఆ పనే మీ జీవితంగా మారనివ్వకండి. ఆట మీ జీవిత కేంద్రమవాలి. అలాగే మీ జీవితం ఆ ఆటలా సాగాలి. సరదాగా ఆడుతూ, పాడుతూ పని చెయ్యాలి. కార్యాలయంలో, కర్మాగారంలో- ఇలా ఎక్కడ ఎంత పనిచేసినా, అక్కడ ఆటపాటలకు అవకాశముండాలి. అంతేకానీ, ఎంతో విలువైన మీ జీవితాన్ని కేవలం రోజూ చేసే పని స్థాయికి దిగజార్చకండి. ఎందుకంటే, ఆటే జీవిత పరమావధి.
ఆట అంటే, దానికోసమే అన్నట్లుగా ఏదో ఒకటి చెయ్యడం. అలా దాని కోసమే అన్నట్లుగా అనేక విషయాలను ఆస్వాదిస్తూ ఆనందించినప్పుడు మీరు మరింత సజీవంగా ఉంటారు. అయితే అక్కడ మీ జీవితం ప్రమాదం కోరల్లో, అపాయం అంచుల్లో ఉంటుంది. అయినా జీవితం ఎప్పుడూ అలాగే ఉండాలి.
ప్రతి క్షణం చాలా ఆకర్షణీయంగా కనిపించే అపాయం జీవితంలో ఒక అత్యుత్తమమైన భాగం. మీకు తెలియకపోవచ్చు... మీ ఉఛ్వాస నిస్వాసలలో కూడా ప్రమాదముంది. ఊపిరి వదిలిన తరువాత కచ్చితంగా అది మళ్ళీ వెనక్కి వస్తుందోరాదో ఎవరికి తెలుసు? అందుకు ఎలాంటి హామీలేదు కదా!
మతాన్ని కూడా భద్రతకోసం ఉపయోగించుకునే మనుషులున్నారు. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు కూడా వారు దేవుణ్ణి ‘‘సర్వోన్నత రక్షకుడు’’అంటూ సంబోధిస్తారు. కేవలం భయం కారణంగా వారు దేవుడి గురించి ఆలోచిస్తారు.
అలాగే దేవుడి దృష్టిలో మంచివారుగా కనిపించేందుకు, ‘‘చిత్రగుప్తుడి చిట్టాలో’’ మంచి వ్యక్తిగా నమోదయ్యేందుకు అనేకరకాల ప్రార్థనలు చేస్తారు. అందుకే వారు ‘‘ఒకవేళ దేవుడనేవాడే ఉంటే, నేను రోజూ చర్చికి వెళ్తున్నట్లు, ప్రార్థనలు, జపాలు చేస్తున్నట్లు వాడికి తెలుస్తుంది. అది నిజమో, అబద్ధమో తేల్చేందుకు నేనున్నాను’’ అంటారు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.