మెయిన్ ఫీచర్

బంధాలు వదిలితేనే స్వేచ్ఛ ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే, గుర్రాల దేవుడు గుర్రంలా, ఏ జంతువు దేవుడు ఆ జంతువులా ఉంటాడే కానీ, కచ్చితంగా మనిషిలా ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే, గుర్రాల పట్ల మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి, వాటికి మనిషి దయ్యంలాగే కనిపిస్తాడు. అందువల్ల, దేవుడి విషయంలో మనిషి భావాలు మనిషికి ఉన్నట్లే జంతువు భావాలు జంతువులకుంటాయి.
మార్మికమైన జీవితంలో నిజాలతో నింపలేని ఖాళీలు మీకు చాలా కనిపిస్తాయి. మీలోని భావాలే వాటికి ప్రత్యామ్నాయాలు. అందువల్ల ఆ ఖాళీలను మీరు మీ భావాలతో నింపి, జీవితం మీకు పూర్తిగా అర్థమైనట్లు తృప్తి పడడం ప్రారంభిస్తారు.
‘‘అండర్‌స్టాండ్’’ అనే పదానికి ఉన్న అసలైన అర్థం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? దాని అసలైన అర్థం ‘‘మీకింద నిలబడి ఉండేది’’అని. ఇది మీకు వింతగానే ఉంటుంది. ఎందుకంటే, దాని అసలైన అర్థం ఎప్పుడో దానికి దూరమై కాలగర్భంలో కలిసిపోయింది.
మీ చేతి కింద, మీ పాదాల కింద, మీ అధికారం కింద- ఇలా ఏదైనా మీ కింద ఉండేలా చేసుకున్నవాటన్నింటికీ మీరే గురువు. అందుకే అందరూ అదే మార్గంలో జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పుడే వారు తమ జీవితాన్ని కూడా కాళ్ళకింద తొక్కి పట్టి ‘మేమే గురువులం. మాకు అన్నీ తెలుసు, తెలియనిది ఏదీ లేదు’ అనగలరు. కానీ, అది అసంభవం. ఎందుకంటే, మీరు ఎన్ని చెప్పినా, ఏమి చేసినా, జీవితం ఎప్పుడూ మార్మికంగానే ఉంటుంది.
అలౌకిక ఆవలి తీరం అన్నిచోట్ల ఉంది. అందుకే అది మన చుట్టూ కూడా ఉంది. అదే దేవుడు. మనం అందులోకి చొచ్చుకుపోవాలి. అది ఎప్పుడూ మన లోపలా ఉంటుంది. బయటా ఉంటుంది. అందువల్ల సహజంగానే మనం దాని గురించి పూర్తిగా మర్చిపోతాం. ఎందుకంటే, అలౌకిక ఆవలి తీరాలలోకి చూడాలంటే చాలా అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది.
అది అగాధంలోకి చూడడం లాంటిది. అందుకే దానిని చూడాలంటే మీరు చాలా భయంతో వణికిపోతారు. ఆ పని చేసేందుకు ఎవరూ సాహసించరు. ఎందుకంటే, అసలైన వాస్తవాన్ని ఎవరూ భరించలేరు. అది ఎప్పుడూ మహా శూన్యంతో కూడుకున్న అగాధంలా, ఎలాంటి హద్దులులేని సువిశాల ఆకాశంలా ఉంటుంది. అందుకే దానినుంచి తప్పించుకునే మార్గాలను మనం వెతుకుతూనే ఉంటాం.
అందుకే బుద్ధుడు ‘దురంగము’’ అంటాడు. అంటే ‘అలౌకిక ఆవలి తీరాలకు అందుబాటులో ఉండు’ అని అర్థం. ఎప్పుడూ సరిహద్దులకే పరిమితమైపోకుండా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళండి. ఒకవేళ మీకు సరిహద్దులు అవసరమైతే పెట్టుకోండి. కానీ, వాటిని అధిగమించి బయటపడాలని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
ఎప్పుడూ ఎలాంటి నిర్బంధాలను సృష్టించుకోకండి. మతాలు, నమ్మకాలు, అనుబంధాలు- ఇలా మనం అనేక రకాల నిర్బంధాలను సృష్టించుకుంటాం. అవి అందరికీ చాలా సౌకర్యంగానే ఉంటాయి. ఎందుకంటే, అక్కడ ఎలాంటి ఈదురుగాలులు వీచవు. అందుకే అందరికీ అక్కడ ఏదో రక్షణ- అది నిజమైన రక్షణ కానప్పటికీ- ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే, మిమ్మల్ని అలౌకిక తీరాలలోకి ఈడ్చుకెళ్ళేది మృత్యువే. అది రాకముందే మీరు అక్కడికి చేరుకోండి.
కొంచెం సేపట్లో మరణించబోతున్న ఒక జెన్ సన్యాసి నా చెప్పులెక్కడ అన్నాడు. మీకేమైనా మతి పోయందా మీరు కొంచెం సేపట్లో మరణించబోతున్నారు అన్నాడు వైద్యుడు.
- ఇంకాఉంది
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.