మెయిన్ ఫీచర్

ఆది అంతం లేనిదే అస్తిత్వం ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది అనేక రూపాలనుంచి మరెన్నో రూపాలుగా పరిణమించింది. అయినా అది ‘ఆది’నుంచి- ఒకవేళ ‘ఆది’ అనేది నిజంగా ఉన్నట్లైతే, అంతవరకు అది ‘అంతం’కాదు. ఎందుకంటే, ఆద్యంతాలపై నాకు నమ్మకం లేదు.
ఆద్యంతాలు లేనిదే అస్తిత్వం. దానితోపాటు మీరుకూడా ఎప్పుడూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే, రూపాలు-ఈ జన్మలో కూడా- వేరుకావచ్చు. మీరు తల్లిగర్భంలోకి ప్రవేశించినప్పుడు ప్రశ్నార్థకంలో ఉన్న చిన్న చుక్కకన్నా పెద్దగా లేరు. ఆ ఫొటోను మీకు చూపించినా అది మీరే అని మీరు గుర్తించలేరు. నిజానికి, అంతకుముందు కూడా అంతే.
ఇద్దరు వ్యక్తులు గతాన్ని గుర్తుకుతెచ్చుకునే వాదనలో పడ్డారు. వారిలో ఒకడు ‘‘మూడేళ్ళ వయసులో ఏంచేశానో నాకు గుర్తుంది’’ అన్నాడు. ‘‘ఓస్! అంతేనా. నేను పుట్టకముందే మా నాన్న, అమ్మ హనీమూన్‌కు వెళ్ళడం నాకు తెలుసు. మేము వెళ్ళేటప్పుడు నేను మా నాన్నలో ఉన్నాను, తిరిగి వచ్చేటప్పుడు నేను మా అమ్మలో ఉన్నాను’’ అన్నాడు మరొకడు.
మీరు మీ నాన్నలో ఉన్నప్పటి ఫోటోను పెద్దది చేసి చూపించినా మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేరు. కానీ, అది మీ రూపమే. ఇప్పుడు మీలో ఉన్నది కూడా దాని మూలమే. ప్రతిరోజూ, ప్రతి క్షణం మీరు మారిపోతున్నారు. మీరు పుట్టిన వెంటనే తీసిన ఫొటోను చూపించినా మిమ్మల్నిమీరు గుర్తించలేరు. పైగా, ‘‘నేను ఇలా ఉన్నానా?’’అంటూ ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే, అంతా మారిపోయింది. మీరు పెద్దవారయ్యారు. మీ చిన్నతనం, యవ్వనాలు వెళ్ళిపోయాయి. మృత్యువు ఆసన్నమవుతోంది. అయితే, అది ఒక రూపంలో వస్తుందే కానీ, ఒక సారాంశంగా రాదు. కాబట్టి, మీ జీవిత గమనంలో నిరంతరాయంగా మార్పుచెందుతున్నది కేవలం రూపం మాత్రమే. ప్రతి క్షణం మీ రూపం మారిపోతోంది. మరణం కేవలం జీవానికి సంబంధించి తొందరగా జరిగే ఒక కీలకమైన కాస్త పెద్ద మార్పు మాత్రమే. మీరు పసితనంనుంచి యవ్వనంలోకి, యవ్వనం నుంచి వార్థక్యంలోకి ఏరోజు ఎప్పుడు ప్రవేశించారో మీరు గుర్తించలేరు.
ఎందుకంటే, అది చాలా నిదానంగా క్రమక్రమంగా జరిగే మార్పు. కాబట్టి, ఒక శరీరంనుంచి మరొక శరీరంలోకి, ఒక రూపంనుంచి మరొక రూపంలోకి ఒక్కసారిగా ఎగిరి దూకడమే మరణమంటే. కానీ, మీకు అదే ముగింపు కాదు. ఎందుకంటే, ఎప్పుడూ ఇక్కడే ఉన్న మీరు ఎప్పుడూ మరణించలేదు, తిరిగి జన్మించలేదు. నిరంతరాయంగా ప్రవహించే జీవన వాహినిలో అనేక రూపాలు వస్తూపోతూ ఉంటాయి. ఈ వాస్తవం మీ అనుభవంలోకి రానంతవరకు మృత్యుభయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కేవలం ధ్యానం మాత్రమే దానికి పరిష్కారం చూపగలదు.
ఎందుకంటే, అలా నిర్ణయించడంతో మీరు ఇంతకాలం చాలా చక్కగా పెంచి పోషించుకున్న మీ అహం, మీ గతాలు ముక్కలైపోవడంతో మీరు కూడా చెదిరిపోతారు. అక్కడ ఎవరో ఉంటారు. కానీ, ఆ వ్యక్తి మీరు కాదు. అలా మీలో తెగిపోయనదేదో గతంలో ఏమాత్రం కలుషితం కాకుండా, చాలా తాజాగా ఉదయిస్తుంది.
నేను ఎంత చెప్పినా, ధర్మగ్రంథాలు ఎంతగా ఘోషించినా పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే, ఇంకా ఏదో సందేహం మీలో మిగలవచ్చు. ఎవరికి తెలుసు? అందరూ తమని తాము మోసగించుకుంటూ ఎన్నో అబద్ధాలు చెప్పవచ్చు లేదా ఇతర గ్రంథాలు, బోధనల ద్వారా వారే మోసపోయి ఉండవచ్చు. కాబట్టి, సందేహమున్నట్లుగానే, భయమూ ఉంటుంది.
కేవలం ధ్యానం మాత్రమే మీకు వాస్తవంతో ముఖాముఖీ జరిగేలా చేస్తుంది. ఒకసారి జీవితమంటే ఏమిటో స్వయంగా మీరు తెలుసుకుంటే, మరణం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు. అంతేకాక, దానిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలరు. ఆ శక్తి మీలోనే ఉంది. అది మీ హక్కు. కానీ, అందుకు మీరు మీ మనసునుంచి మనోరహిత స్థితిలోకి చేరే చిన్నప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.
ఒక శిశువు జన్మించిన వెంటనే దాని జీవితం ప్రారంభమైనట్లు, ఒక వృద్ధుడు మరణించిన వెంటనే అతని జీవితం ముగిసిపోయినట్లు మీరు భావిస్తారు. కానీ, అది నిజంకాదు. జనన, మరణాలు జీవితం యొక్క రెండు చివరలు కావు. ఎందుకంటే, వాటికన్నా జీవితం చాలా పెద్దది. జీవితంలో అనేక జనన, మరణాలు జరుగుతూ ఉంటాయి. ఆద్యంతాలు లేనిదే జీవితం జీవిత, శాశ్వతత్వాలు రెండూ సమానమే. కానీ, జీవితం మరణంలోకి ఎలా మళ్ళుతుందో మీరు సులభంగా అర్థం చేసుకోలేరు. అలాగే, అది అసాధ్యమని కూడా మీరు అంగీకరించలేరు.
జీవితంలో అనూహ్యమైనవి కొన్ని ఉంటాయి. జీవితం మరణంలోకి మళ్ళడమనేది వాటిలో ఒకటి. ఎప్పుడు, ఎక్కడ జీవితం ముగిసి మరణంగా మారుతుందో అలాగే ఎప్పుడు, ఎక్కడ జీవితం మళ్ళీ ప్రారంభమవుతుందో మీరు గిరిగీసి చెప్పలేరు.
జీవితం ప్రారంభం శిశువు పుట్టినప్పుడా లేక గర్భధారణ జరిగినప్పుడా? గర్భధారణకు ముందే తల్లిగర్భంలోని బీజం, తండ్రి శరీరంలోని వీర్యకణాలు సజీవంగా ఉన్నాయే కానీ, మరణించలేదు. ఎందుకంటే, రెండు నిర్జీవాల కలయిక ఒక జీవాన్ని ఎప్పటికీ సృష్టించలేదు. మరి శిశువు ఎప్పుడు జన్మించినట్లు? ఈ విషయంలో విజ్ఞానశాస్త్రం కూడా ఒక కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది. అందుకు కారణం దాని దగ్గర ఎలాంటి ఆధారము లేదు. ఎందుకంటే, పుట్టుకనుంచే బీజాలను తల్లి తనలో మోస్తోంది.
ఒక విషయాన్ని మీరు ఇక్కడ అంగీకరించాలి. గర్భధారణకు ముందే మీ ఉనికిలోని సగం మీ తల్లిలో సజీవంగా ఉంది. మిగిలిన సగం మీ తండ్రి ద్వారా సజీవంగానే లభిస్తుంది. ఎందుకంటే, తండ్రి శరీరంనుంచి విడుదలైన వీర్యకణాలన్నీ సజీవంగానే ఉంటాయి. కానీ, వాటి జీవితకాలం కేవలం రెండు గంటలు మాత్రమే.
ఆ సమయంలోనే అవి తల్లి శరీరంలో ఉన్న బీజాన్ని కలుసుకోవాలి. ప్రతి వీర్యకణం కచ్చితంగా తన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. కొన్ని కణాలు బీజం వైపు పరిగెడుతుంటే, మరికొన్ని కణాలు సోమరిపోతుల్లా చాలా నిదానంగా నడుస్తూ ఉంటాయి. అందుకే అవి ఎప్పటికీ బీజాన్ని చేరుకోలేవు. ఇలాంటి లక్షణాలన్నీ పుట్టుకతోటే సంక్రమిస్తాయి. అలాంటి లక్షణాలు సంక్రమించిన వ్యక్తులు మరణించేందుకైనా సిద్ధపడతారే కానీ, పరుగెత్తలేరు. కనీసం ఏం జరుగుతోందో కూడా వారికి తెలియదు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదునుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.
- ఇంకాఉంది