మెయిన్ ఫీచర్

శాస్త్రాలకు అందనిది ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ, కొన్ని వీర్యకణాలు ఒలింపిక్ పోటీలలో పాల్గొంటున్నట్లుగా పరిగెడతాయి. వాటిమధ్య గట్టి పోటీ కూడా ఉంటుంది. ఎందుకంటే, తల్లి గర్భంలో నిరీక్షిస్తున్న బీజమే వాటి గమ్యం.
తల్లి గర్భంలోని ‘బీజాశయం’ నెలకు ఒకసారి ఒక బీజాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. అందుకే స్ర్తికి రుతుక్రమం నెలకు ఒకసారి మాత్రమే వస్తుంది. వీర్యకణాల పరుగుపందెంలో కేవలం ఒక వీర్యకణం మాత్రమే అన్నింటిని అధిగమించి బీజాన్ని కలుసుకుంటుంది. ఇది నిజంగా జీవశాస్తప్రరమైన ఒక గొప్ప తాత్విక సమస్య. ఎందుకంటే, కొన్ని లక్షల వీర్యకణాలలో ఒక్కటే తల్లి గర్భంలోని బీజాన్ని కలుసుకుని జన్మిస్తుంది. అయితే మిగిలిన వీర్యకణాలలో ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నను భారతదేశంలోని హిందూ పండితులు, శంకరాచార్య పరంపర జనన నియంత్రణను వ్యతిరేకించే వాదనలలో ఒకటిగా వాడుకున్నారు.
వాదన విషయంలో భారతదేశం చాలా తెలివైనది. కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా పోప్ ‘ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలు. అంతకుమించి వద్దు. ఒకడు చనిపోయినా మిగిలిన ఇద్దరూ తల్లి, తండ్రి స్థానాలను భర్తీచేస్తారు. దానివల్ల జనాభా పెరుగుదల ఉండదు’’ అంటూ చాలా మాట్లాడతాడే కానీ, ఒక్క వాదన కూడా చెయ్యడు. ఈ విషయంపై భారతదేశ మతాధికారులు అర్థవంతమైన వాదనలే చేశారు.
‘‘పిల్లలను పుట్టించడం- ఇద్దరా లేదా ముగ్గురా, లేదా- ఎక్కడ ఆపాలి? ‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’ తల్లిదండ్రులు పనె్నండు మంది పిల్లలు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణను పాటిస్తే ఆయన పుట్టేవాడే కాదు. కుటుంబ నియంత్రణను పాటిస్తే మనం ఎంతమంది ‘రబీంద్రనాథ్ ఠాగూర్’లాంటి గొప్ప వ్యక్తులను కోల్పోతామో తెలుసా?’’ అనేది వారి వాదన.
అందుకే నేను ఒకసారి శంకరాచార్యతో ‘‘కేవలం వాదించేందుకు మాత్రమే అయితే మీ వాదనలో అర్థముంది కాబట్టి, దానితో నేను ఏకీభవిస్తాను. కానీ, కుటుంబ నియంత్రణవల్ల దేశంలోని ప్రజలందరూ కూడు, గుడ్డ లాంటి వౌలిక అవసరాలకు ఎలాంటి లోటులేకుండా హాయిగా జీవిస్తారు. దానికోసం ‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’లాంటి గొప్ప వ్యక్తులను వదులుకునేందుకు కూడా నేను సిద్ధమే. ఎందుకంటే, ‘‘రబీంద్రనాథ్ ఠాగూర్’’ పదమూడవ సంతానం. మీ లెక్కప్రకారం అందరూ పదమూడు మంది పిల్లలను పుట్టించాలా? మరి పధ్నాలుగు, పదిహేనవ సంతానం సంగతేమిటి? లైంగిక సంయోగంలో పురుషుడు విడుదల చేసిన అనేక లక్షల వీర్యకణాలలో ఎంతమంది మహానుభావులున్నారో మీరు చెప్పగలరా? కేవలం కొంతమంది గొప్ప వ్యక్తులు పుట్టడంకోసం అందరూ జనాభాను పెంచడంవల్ల ఎన్ని కోట్ల మంది ఆకలి చావులు చస్తున్నారో మీకు కనిపించట్లేదా?’’ అంటూ వాదించాను.
నా లెక్కప్రకారం లైంగికపరంగా అంతా సవ్యంగా ఉన్న ఒక పురుషుడు తన యుక్తవయసు నుంచి నలభై రెండేళ్ళ వయసు వచ్చేవరకు ఈ భూమి నిండి పొర్లిపోయే జనాభాకు సరిపోయే వీర్యకణాలను విడుదల చెయ్యగలడు. ఇప్పటికే మన భూమి అధిక జనాభాతో అల్లాడిపోతోంది. అందరిలో సహజంగా ఉండేది మానవత్వమే అయినా, ఎవరి వ్యక్తిత్వం వారిదే. కాబట్టి, పుట్టినప్పటినుంచే జీవితం ప్రారంభమవట్లేదు. అది ఇంకా ముందునుంచే ప్రారంభమవుతోంది. అది మీకు కేవలం ఒక ఊహ మాత్రమే అయినా, నాకు మాత్రం అది ఒక అనుభవం.
గత జన్మ ముగిసినచోటునుంచే పునర్జన్మ ప్రారంభమవుతుంది. మీరు మరణించినప్పుడు అందరూ మీ జీవితం ముగిసిందని భావిస్తారు. కానీ, అది అనంత అధ్యాయాలతో కూడుకున్న జీవిత పుస్తకంలోని ఒక అధ్యాయం మాత్రమే ముగిసినట్లు. అంతమాత్రాన మీ జీవిత పుస్తకం పూర్తిగా ముగిసినట్లు కాదు. పేజీ తిప్పిచూస్తే మరొక అధ్యాయం ప్రారంభమవుతుంది.
మరణిస్తున్న వ్యక్తి తదుపరి జన్మను దర్శించడం ప్రారంభిస్తాడు. అధ్యాయం ముగిసేముందు జరిగేది అదే. ఇది అందరికీ తెలిసిన సత్యమే.

- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.