మెయిన్ ఫీచర్

వాహ్.. కఫ్తాన్ స్టైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటో కుట్టు.., ఇటో కుట్టు.., సింపుల్‌గా కట్టు.. అంటోంది కఫ్తాన్. ఇది స్టైల్‌కి, నిండుతనానికి నిలువెత్తు నిదర్శనం(అందం). అందుకే కఫ్తాన్ స్టైల్‌ను టీనేజర్లు ఎక్కువగా ఇష్టపడతారు. కొనే్నళ్ల క్రితం టర్కీలో మొదలైన ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఇప్పుడు మన దగ్గర కొత్త కొత్త రకాలుగా రూపొందుతోంది. వేసుకునే డ్రెస్ స్టైలిష్‌గా ఉండటంతో పాటు సౌకర్యంగానూ, ట్రెండ్‌గానూ, అందంగానూ ఉండాలి. ఇవన్నీ కఫ్తాన్ సొంతం. అందుకే యువతరం అమ్మాయిలు ఫ్యాషన్‌గానే కాదు, సౌకర్యవంతమైన డ్రెస్‌గా కూడా కఫ్తాన్ పేరొందింది. క్యాజువల్ వేర్ నుంచి కలర్‌ఫుల్ పార్టీ వేర్ వరకు కఫ్తాన్ రాణిస్తోంది. పొడవైన కఫ్తాన్‌ను కుట్టేస్తే పగలే కాదు రాత్రిపూట కూడా ధరించడానికి వీలుగా నైటీలా మారుతుంది.
* కఫ్తాన్ ధరించడంలోనే కాదు నచ్చిన వస్త్రంతో ఎవరికి వారు డిజైన్ చేసుకోవడం చాలా సులువు. దీనికి పెద్ద పెద్ద ప్రణాళికలు, డ్రాఫ్టింగ్‌లు అవసరం లేదు.
* కఫ్తాన్‌కు రేయాన్, కాటన్ సిల్క్ మిక్స్‌డ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. సిల్క్, క్రాప్ కాటన్స్, జార్జెట్స్, షిఫాన్స్.. కఫ్తాన్స్‌కి బాగా సూటవుతాయి. స్ట్ఫిగా ఉండే ఫ్యాబ్రిక్ కఫ్తాన్‌కు అస్సలు సూటవ్వదు.
* నడుము, ఛాతీ, హిప్ దగ్గర కొలతలు తీసుకుని మార్క్ చేసుకోవాలి. చతురస్త్రం లేదా దీర్ఘచతురస్త్రం కొలతతో ఎంచుకున్న ఫ్యాబ్రిక్‌ని రెండు మడతలుగా వేసి చేతుల వద్ద తగినంత వదిలేసి, రెండువైపులా కుట్టేస్తారు. ఈ కుట్టు వల్ల సల్వార్ కమీజ్ లుక్ వస్తుంది. అంతే కఫ్తాన్ రెడీ అయిపోయినట్లే..
* కఫ్తాన్ ఎప్పుడూ టైట్ ఫిట్ ఉండదు. ఫ్రీగా, రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. కాబట్టి ఇండోవెస్ట్రన్ కాక్‌టెయిల్ పార్టీలకు బాగా నప్పుతుంది.
* దూరప్రయాణాలు చేసేటప్పుడు కూడా కఫ్తాన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకించి దుపట్టా, స్కార్ఫ్ వంటి అదనంగా వాడాల్సిన అవసరం లేదు. దీనికి బాటమ్‌గా పలాజో సరైన ఎంపిక.
* ధోతీపైకి కూడా కఫ్తాన్ ధరిస్తే వెస్ట్రన్ స్టైల్‌గా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా కనిపించవచ్చు.
* గర్భవతులకు కూడా ఇది సరైన ఎంపిక. వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
* కఫ్తాన్ చుట్టూ అంచు, మెడ చుట్టూ కూడా చిన్న చిన్న బుటీ వచ్చేలా డిజిటల్ ప్రింట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు. మగ్గం వర్క్‌తో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. పార్టీకి వెళుతున్నప్పుడు కఫ్తాన్‌కి బాటమ్‌గా స్లిమ్ సూట్ ట్రౌజర్ ధరిస్తే అందంగా కనిపించవచ్చు.
* నలుచదరంగా ఉండే వస్త్రంపై డిజిటల్ ప్రింట్ కూడా వేయించుకోవచ్చు. ఈ ప్రింట్ లేదంటే లైట్ బార్డర్ వేసుకుని కూడా డిజైన్ చేసుకోవచ్చు.
* కఫ్తాన్ పై ఎలాంటి ఆభరణమైనా బాగుంటుంది. సల్వార్ కమీజ్ వంటి కఫ్తాన్ వేసుకుంటే సంప్రదాయ నగలను కూడా పెట్టుకోవచ్చు.
* క్యాజువల్ వేర్ లుక్ రావాలంటే మోకాలి వరకు ఉన్న కఫ్తాన్ ధరించాలి. దీనికి బాటమ్‌గా చుడీ వేసుకుంటే సల్వార్ కమీజ్ డ్రెస్‌లా ఉంటుంది. మోకాలి కంటే కిందకు వేసుకుంటే మాత్రం చుడీని వేసుకుంటే బాగుంటుంది.