మెయిన్ ఫీచర్

పిల్లల్లో చంచల స్వభావమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో చంచల స్వభావం ఎక్కువ. ఒకరోజు సంగీతంపై ఉత్సాహం చూపిస్తే.. మరోరోజు కరాటేపై ఉత్సాహం చూపిస్తారు. అంతలోనే ఏమవుతుందో తెలియదు.. దాన్ని మధ్యలో వదిలేసి డ్యాన్స్ వెంట పడతారు. అది కూడా కొద్దిరోజుల ముచ్చటే.. ఇది చిన్నపిల్లల్లో తరచూ జరిగేదే.. వీటిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తుంటారు. అయితే పిల్లలు పెరుగుతున్నకొద్దీ అదే ధోరణి కొనసాగిస్తుంటే? దేనిపైనా పట్టుమని పదిరోజులైనా దృష్టి నిలవలేకపోతుంటే? తల్లిదండ్రులకు ఆందోళన మొదలవుతుంది. మరి వీరి చంచలస్వభావాన్ని దారిలో పెట్టడమోలాగో చూద్దాం..
పిల్లలు సహజంగా వారికున్న ఉత్సుకతతోటి కొత్త విషయాలను తెలుసుకోవాలని, వాటిని నేర్చుకోవాలనే కుతూహలంలో ఉంటారు. చూసిన ప్రతిదానికీ ఆకర్షితులవుతుంటారు. ఈ క్రమంలోనే పక్కింటి పిల్లల్ని చూసో, బడిలోని స్నేహితులను చూసో రకరకాల కళలను నేర్చుకోవాలనుకుంటారు. అయితే నచ్చిన ఒకదాన్ని నేర్చుకోవాలనుకునే బదులు.. ఒకే సమయంలో రెండు, మూడు అంశాలపై పట్టు చూపించాలని అనుకుంటారు. పెద్దలు వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహించడమూ అవసరమే.. ఇవి నేర్చుకోవడం వల్ల చిన్నారులకు ఎన్నో విషయాలు కూడా తెలుస్తాయి. కొత్త విద్యలు అబ్బుతాయి. ఫలితంగా పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, దృఢంగా కూడా తయారవుతారు. ఇక్కడివరకు ఇది బాగానే ఉంది కానీ.. దేనిమీదా ఎక్కువ రోజులు దృష్టి పెట్టకుండా పదేపదే వారి ఆసక్తులు, ఇష్టాలు మార్చేసుకుంటుంటే మాత్రం దేనిపైనా పట్టు సాధించలేరు. అందుకని పిల్లలు ఏది నేర్చుకుంటానమన్నా కూడా.. దానిలో ప్రావీణ్యం సాధించడం ఎంత అవసరమో వారి అర్థమయ్యేలా చెప్పాలి. దాన్ని కొనసాగించేలా ఉత్సాహం కలిగించాలి. అలాగని ఇదే నేర్చుకో.. ఇదైతేనే బాగుంటుంది.. పెద్దయ్యాక బాగా ఉపయోగపడుతుంది.. డబ్బులు బాగా సంపాదించవచ్చు.. అంటూ బలవంత పెట్టకూడదు. దీనివల్ల వారికి దానిపై ఆసక్తి మరింత తగ్గుతుంది. మనో నిబ్బరం దెబ్బతింటుంది. కాబట్టి త్వరత్వగా నిర్ణయాలు మార్చుకుంటున్నట్టు గమనిస్తే కారణాలను ఆరా తీయాలి. అవి సరైనవనిపిస్తే ఫర్వాలేదు.. అలాకాకుండా తెలిసో, తెలియకో, అనుచిత కారణాలతో మధ్యలోనే మానేస్తున్నట్లు గుర్తిస్తే మాత్రం అవెందుకు అవస
రమో, నేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు వారి సొంతం అవుతాయో వారికి చెప్పాలి.
ఆసక్తి
పిల్లలపై చుట్టుపక్కల వ్యక్తులు, పరిసరాల ప్రభావం చాలా ఎక్కువ. చాలాసార్లు వీటి మూలంగానే ఆసక్తులను ఏర్పరచుకుంటారు. అలా అనుకరించడానికి, అనుసరించడానికి ప్రయత్నిస్తుంటారు. బయటి ఆకర్షణలకు, తమ సొంత అభిప్రాయాలకు మధ్య తేడాను పిల్లలు పోల్చుకోలేరు. అందువల్ల తమకేది ఇష్టమో దాన్ని గుర్తించేలా చేయటానికి పెద్దవాళ్లు పిల్లలకు తోడ్పడడం ఎంతైనా అవసరం. ఆసక్తికి అనుగుణమైన అంశాలను ఎంచుకుంటేనే బాగా రాణించే అవకాశముంటోందన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. అభిరుచి కావొచ్చు, ఇష్టపడి నేర్చుకుంటున్నది కావొచ్చు. ఏదైనా గానీ కష్టపడితే తప్ప విజయం సాధించంలేం. దీనికి ఎంతో ఓపిక, కష్టపడే తత్త్వం అవసరం. ఈ విషయం పిల్లలకు అవగతమయ్యేలా విజయం సాధించిన వారి జీవితకథలను చెప్పాలి. ఇందుకోసం వారు మానసికంగా సిద్ధమయ్యేలా చూడాలి. పిల్లలు ఎప్పడూ పెద్దవాళ్ల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటారు. తమను మెచ్చుకుని ఏదైనా ఇస్తే బాగుండునని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు చిన్న చిన్న కానుకలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి. అలాగని ఖరీదైన బహుమతులు, నగదు ఇవ్వాలని కాదు. ఒక మెచ్చుకోలు, ప్రశంస ఏదైనా సరే.. పిల్లలకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
కరాటే, పర్వతారోహణ వంటి క్లిష్టమైన పనులకే ఏకాగ్రత అవసరమని పిల్లలు భావిస్తుంటారు. నిజానికి చిన్న చిన్న హాబీలకైనా ఏకాగ్రత అవసరం. తేలికైన కుట్లు, అల్లికలు కూడా మనస్ఫూర్తిగా దృష్టి పెడితేనే నైపుణ్యం దక్కుతుంది. అందువల్ల ఏది నేర్చుకోవాలనుకున్నా ఏకాగ్రతతో, కుదురుగా సాధన చేయడం తప్పనిసరి అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఏదైనా నేర్చుకునేటప్పుడు పిల్లలందరూ ఒకేలా ఉండరు. కొందరు త్వరగా నేర్చుకుంటే ఇంకొందరు నెమ్మదిగా ఒంటపట్టించుకుంటారు. కాబట్టి వారిని తొందరపెట్టడం మంచిదికాదు. అనుకున్నట్టుగా చేయకపోతే తిట్టడం, ఒత్తిడి చేయడం సబబు కాదు. అలా చేస్తే వారి మనో నిబ్బరం తగ్గిపోతుంది. నైపుణ్యం, ప్రావీణ్యం అనేవి పెద్దవాళ్లకు కూడా ఒక పట్టాన అబ్బవని గుర్తుంచుకోవాలి. అందువల్ల బాల్యంలోనే అన్ని పనులూ సరిగ్గా చేసేయాలని, నిష్ణాతులైపోవాలని అనుకోవద్దు. కొన్నింటిని మధ్యలో అపేసినా, వీలున్నప్పుడు వాటిని తిరిగి కొనసాగించేలా ప్రోత్సహించాలి. నెమ్మదిగా వాటిల్లోనూ ప్రావీణ్యం సాధిస్తారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.