మెయిన్ ఫీచర్

ధైర్యాన్నిచ్చేది ధ్యానమే!( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయాలు - ధ్యాన పద్ధతులు
శూన్య భయాన్ని పొగొట్టే ధ్యానం
ప్రతిరాత్రి నిద్రపోయే ముందు ఇరవై నిముషాల పాటు కళ్లు మూకొని మీ శూన్యంలోకి ప్రవేశించండి. ఆ శూన్యాన్ని అంగీకరించండి. దానిని అక్కడే ఉండనివ్వండి. అపుడు మీలో భయం కలుగుతుంది. దానిని కూడా అక్కడే ఉండనివ్వండి. భయంతో వణకండి. అంతేకానీ, ఆవిర్భవిస్తున్న శూన్యాన్ని తిరస్కరించకండి. ఇలా చేస్తే రెండు, మూడు వారాలలో మీరు దాని సౌందర్యానుభూతిని పొందగలుగుతారు. ఒకసారి ఆ ఆశీర్వాదం మిమ్మల్ని తాకగానే భయం దానంతటదే అదృశ్యమవుతుంది. అంతేకానీ, మీరు దానితో పోరాడకూడదు.
హాయిగా నేలపై కూర్చుని 34గర్భాసనం22 వెయ్యండి. ఎలాంటి మంత్రాలు చదవకండి. ఎలాంటి కిటుకులను జోడించే ప్రయత్నం చెయ్యకుండా అలాగే ఉండండి.
ఆ ఆసనాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఇంతకు ముందెప్పుడూ మీరు అలా చెయ్యకపోవడం వల్ల మీ మనసుకు అంతా కొత్తగా భరించలేనంత గందర గోళంగా ఉంటుంది. అది దానిని వర్గీకరించి చీటీలు తగిలించాలని కోరుకుంటుంది. కాబట్టి గర్తుంచుకోండి.
తెలిసినది మనసు, తెలియనది 3దేవుడు2 ఎపుడు తెలిసినా దానిలో భాగమవదు. అదే జరిగితే అది తెలియని దేవుడవడు. తెలియనిది ఎప్పటికీ తెలియ బడదు. ఒకవేళ మీరు దానిని తెలుసుకొన్నా అది తెలియనిదిగానే ఉండిపోతుంది. ఆ మర్మాన్ని ఎవరూ ఛేదించలేరు. ఎందుకంటే ఆ మర్మం అంతర్గతంగా పరిష్కరించలేని స్వభావాన్ని కలిగి ఉంటుంది.
కాబట్టి, ప్రతి రాత్రి మీరు మీ శూన్యంలోకి ప్రవేశించకండి. అక్కడ భయంగానే ఉంటుంది. మీరో వణుకు పుడుతుంది. అయినా ఫరవాలేదు. మెల్లమెల్లగా ఆ భయం తగ్గి దాని స్థానంలో ఆనందం చోటు చేసుకొంటుంది. ఇలా చేస్తూ ఉంటే మూడు వారాల్లో ఏదో ఒకరోజు ఆకస్మాత్తుగా చీకటి రాత్రి ముగిసి ఉషోదయం ఉదయించినట్లు మీలో పెల్లుబికే శక్తి మిమ్ముల్ని ఆశీర్వదిస్తూ మీలో పరమానందాన్ని నింపినట్లుగా మీకు తెలుస్తుంది.
పాత భయాలను పోగొట్టే ధ్యానం:
చిన్నప్పుడు వేరే అతి లేక ఒప్పుకొన్న పాత విధానాలనే నేను ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలుసుకొన్నాను. 34నువ్వు ఎందుకూ పనికిరావు22 అని నా తల్లిదండ్రులు నన్ను తిట్టినపుడు నోరెత్తకుండా పారిపోయి 3ఎవరి అవసరం లేకుండా నేను ఒంటరిగా ఏదైనా చెయ్యగలను.2 అనే భావనతో నన్ను నేను ఓదార్చుకున్నాను. ఇపుడు నేను నా స్నేహితుల పట్ల అదేవిధంగా స్పందిస్తున్నాను.
అది కేవలం మీలో చాలా గట్టిగా పాతుకుపోయిన ఒక పాత అలవాటు. దానికి వ్యతిరేకంగా చెయ్యడం ప్రయత్నించండి. ఏదైనా చెప్పాలనుకొంటే చెప్పకండి. ఎక్కడికైనా వెళ్లాలనుకొంటే వెళ్లకండి. మాట్లాడకూడదు. అనుకొంటే మరింత గట్టిగా మాట్లాడండి. వాదించకూడదు. అనుకొంటే మరింత గట్టిగా వాదించండి. దాచాలనుకున్న దానిని బయట పెట్టండి.
ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడూ చాలా భయాన్ని కలిగిస్తుంది. అపుడు మీ ముందు కేవలం రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటాయి. పోరాడడం, లేదా పారిపోవడం, సంప్రదాయ దేశాలలో ప్రత్యేకించి ప్రాచీన ఛాందస సంప్రదాయాల హద్దులకు పరిమితమైన దేశాలలో, కుటుంబాలలో పసివాడు ఏమాత్రం పోరాడలేదు.
అందువల్ల వాడు ఏమాత్రం నోరెత్తకుండా తనని తాను రక్షించుకుంటాడు. అదే అమెరికాలో ఐతే , చివరికి తల్లిదండ్రులు కూడా పారిపోయేస్థాయిలో ఆ పసివాడు పోరాడ గలడు.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.