మెయన్ ఫీచర్

ఇక.. ప్రభుత్వ పనితీరుపై మోదీ దృష్టి సారిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలలో విజయం సాధించడం ఒక ఎత్తు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరును మెరుగు పరచడం, ప్రజల వౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం మరోఎత్తు. అయితే, నేడు అధికారం చేపట్టిన మొదటి రో జు నుండే- అయదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలపైనే నేతలంతా దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్ర జలను ఏ విధంగా ఆకట్టుకోవాలని ఆకర్షణీయ పథకాలను అనే్వషిస్తున్నారు. అంతేగాని పరిపాలనను గాడిలో పెట్టడం పట్ల, ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచడం పట్ల అంతగా ఆసక్తి కనబరచడం లేదు. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ఎన్నికైన సొంత పార్టీ సభ్యులతో జరిగిన మొదటి సమావేశంలోనే 2024 ఎన్నికలను ప్రస్తావించడం గమనార్హం. అంతేగాని ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన సవాళ్లు ఏమిటో ప్రస్తావించే సాహసం చేయనే లేదు. వాటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో సంకేతం ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.
నరేంద్ర మోదీ ఏర్పర్చిన మంత్రివర్గం తీరుతెన్నులు చూస్తుంటే కొద్దిమందికి మినహా వారి పనితీరును బట్టి వారికి మంత్రిపదవులు లభించిన దాఖలాలు కనిపించడం లేదు. నిత్యం మీడియాలో ప్రధానికి మద్దతుగా ప్ర త్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రంలో మంత్రి పదవులు కోల్పోయిన అనేకమంది సమర్ధవంతంగా పనిచేసిన వారు కావడం గమనార్హం. పైగా నిజాయతీపరులుగా పేరున్నవారే. అటువంటి వారికి పదవులు తిరిగి లభించక పోవడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయ. కానీ ప్రభుత్వ పనితీరును పెరుగుపరచే ఆలోచనలు కనిపించడం లేదు. మోదీ మంత్రివర్గంలో అత్యంత సమర్ధవంతంగా విధులను నిర్వహించిన స్ష్ము స్వరాజ్ మంత్రివర్గంలో కొనసాగలేక పోవడం గమనార్హం. అట్లాగే సురేష్ ప్రభు, జయంత్ సిన్హా, రాజవర్ధన్ రాధోడ్, మహేష్ శర్మ, మేనకా గాంధీ వంటి వార్లను ఈ సందర్భంగా ప్రస్తావించవచ్చు. అవినీతి పట్ల రాజీలేని ధోరణి ఆవలంబిస్తారని చెప్పుకొంటున్న మోదీ మంత్రివర్గంలో వివాదాస్పద ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు చేరడం గమనార్హం.
మోదీ ప్రభుత్వం మొదటి నుండి సమర్థులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేక పోతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన మంత్రి కార్యాలయమే ప్రత్యామ్నాయ సచివాలయంగా మారింది. దాదాపు అందరు మంత్రుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నది. అరుణ్ జైట్లీ ప్రధాన మంత్రికి చాలా సన్నిహితుడు, ప్రభుత్వంలో, పార్టీలో కీలక నేత అని అందరికి తెలిసినా బడ్జెట్ రూపొం దించడంలో చాలావరకు ఆయన ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన బడ్జెట్ లో 60 శాతం వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మార్చివేయడం జరుగుతూ వస్తున్నది.
సమర్థులైన రాజకీయ నేతలకు కీలక మంత్రిత్వ బాధ్యతలు అప్పచెప్పలేక మాజీ ప్రభుత్వ అధికారులను ఎంచుకోవాల్సి వస్తున్నది. గతంలో పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు ప్రచార ఆర్భా టం మినహా ఆ శాఖలో సాధించిన ప్రగతి శూన్యం. ముఖ్యంగా ప్రధానమంత్రికి ఎంతో ఇష్టమైన స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో వెంకయ్య విఫలమయ్యారు. కానీ ఆ తర్వాత ఆ మంత్రిత్వ శాఖ చేపట్టిన మాజీ ప్రభుత్వ అధికారి హర్‌దీప్ సింగ్ పూరీ విశేష ప్రతిభను కనబరచారు. మరో ప్రభుత్వ మాజీ అధికారి ఆర్‌కె సింగ్ విద్యుత్ రంగంలో అసాధారణ ప్రతిభ చూపారు. అటువంటి ప్రతిభ రాజకీయ నాయకులలో ముగ్గురు, నలుగురు కన్నా చూపలేక పో యారు. మాజీ విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకు రావడం కీలక పరిణామం. ఇప్పటి వరకు ప్రధాని మోదీ విదేశ వ్యవహారాలు, రక్షణ అంశాలలో ఎక్కువగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పైననే ఆధారపడుతున్నారు. వాస్తవానికి చైనా, అమెరికాలతో భారత్ సంబంధాలను తీర్చు దిద్దడంలో జైశంకర్ కీలక ప్రభావం చూపారు. పాకిస్తాన్ విషయంలో, జమ్మూ కశ్మీర్‌లో మనం తీవ్రమైన సవాళలు ఎదుర్కోవడానికి అజిత్ దోవల్ అనుసరిస్తున్న ధోరణులు కారణమని పలువురు భావిస్తున్నారు. ఈ విషయానే్న ముందుగానే గ్రహించిన ప్రధాని జైశంకర్‌ను అదనపు జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాలని రెండేళ్ల క్రితమే ఆలోచన చేశారు. అయితే దోవల్ పడనీయలేదు. ఇప్పుడు ఈ వ్యవహారాలలో జైశంకర్ స్వతంత్ర వైఖరి అవలంబించే అవకాశం కనిపిస్తున్నది.
ప్రధానమంత్రి కార్యాలయంలోని అధికారుల ఆదే శాలకు భిన్నంగా, స్వతంత్రంగా పనిచేస్తున్న మంత్రులు ఇద్దరే ఉన్నారు. వారు నితిన్ గడ్కరీ, రామ్ విలాస్ పాశ్వాన్. గడ్కరీ నిర్వహించిన మంత్రిత్వ శాఖలో ప్రభుత్వ పెట్టుబడుల ప్రసక్తి లేకుకండా ప్రైవేట్ పెట్టుబడులే కీలక ప్రాధాన్యత సంతరింపచేసుకోవడంలో ఆయన విజయం సాధించారు. ఎక్కడైతే ప్రభుత్వ పెట్టుబడులు అవసరంలో అటువంటి శాఖల పనితీరు సంతృప్తికరంగా ఉండటం లేదు. అది రైల్వేలు కానీయండి, గంగానది ప్రక్షాళన కానీయండి.
సురేష్ ప్రభును మంత్రివర్గంలోకి తీసుకోనకపోవడం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది. శివసేనతో పాత వైరుధ్యాలు పునరావృతం కాకుండా ఉండాలని ఆ విధంగా చేశారా? లేదా ముక్కు సూటిగా, వాస్తవాల ఆధారంగా ఆయన పనిచేస్తున్న తీరు ప్రధానికి నచ్చడం లేదా? అన్నది ప్రశ్నార్ధకరంగా మారింది. ప్రధానమంత్రి ఎంతో ముచ్చటపడిన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లాభదాయకం కాబోదని, ఆర్ధికంగా పెను భారం అవుతుందనే కాకుండా పలు ఇతర సమస్యలు రాగలవని సురేష్ ప్రభు ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఎవ్వరికీ రుచించ లేదు. పైగా రైల్వేలను ఆధునీకరించడం, రక్షణ వ్యవస్థను మెరుగు పరచడం మొదటి ప్రాధాన్యత కావాలని కూడా సూచించారు. ప్రైవేట్ పెట్టుబడులతో రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం సాధ్యం కాదని భావించారు. ఇప్పుడు సమర్ధతతో పనిచేయడం కాకుండా రాజకీయంగా అధికార పక్షాన్ని ఆదుకోవడం ప్రాధాన్యతగా కనిపిస్తున్నది. రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ పలు సందర్భాలలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేశారు. ప్రతిపక్షాల దాడి నుండి ప్రధాన మంత్రిని కాపాడటంలో చూపే సామర్ధ్యాన్ని మంత్రిత్వ శాఖ పనితీరుపట్ల ఆమె చూపిన దాఖలాలు లేవు. ప్రస్తుత వ్యవస్థలో అందుకు చెప్పుకోదగిన అవకాశాలు కూడా లేవు.
భాజపా అధ్యక్షుడు అమిత్ షాను మంత్రివర్గంలో తీసుకోవడం కీలక పరిణామం. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవస్థలతో సంబంధాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉన్నవారుగా పేరొందారు. భాజపా అధ్యక్షుడిగా ఆ అంశాన్ని ఆయన నిరూపించారు. ఐదేళ్ల మోదీ ప్రభుత్వంలో ఎక్కువగా నష్టపోయినది సంప్రదాయంగా బిజేపికి గట్టి మద్దతుదారులుగా ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు, ఎస్ ఎంఇ రంగం, గ్రామీణ ఆర్ధిక పరిస్థితులు, వ్యవసాయ రంగం. ఈ అంశాలపై తగు అవగాహన అరుణ్ జైట్లీకి లేవు. అందుకనే ఇటువంటి రంగాలకు పరిపుష్టి కలిగించడంలో ఘోరంగా విఫలం చెందారు.
వ్యవసాయం, ఉద్యోగాల కల్పనకు తగు ప్రాధాన్యతను కల్పించడం ద్వారా మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల ఆయన మద్దతుదారులతో కూడా నెలకొన్న అసంతృప్తిని తొలగించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని ఎన్నికల ముందే గుర్తించారు. తాత్కాలిక బడ్జెట్‌లో ఆ దిశలో పలు ప్రతిపాదనలు ఉంచారు కూడా. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే దిశలో చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగం వంటి వాటిపై కసరత్తు చేపట్టారు. ఏయే రంగాలకు ప్రాధాన్యతను ఇస్తే అనుబంధంగా ఉద్యోగాల సృష్టికి వీలేర్పడుతుందనేది విశే్లషించుకుని తగు విధంగా బడ్జెట్ కేటాయింపులు జరుపవలసి ఉంది. ఎస్‌ఎంఇ, పన్నుల రంగం, ప్రధాని కీలక నినాదం మేకిన్ ఇండియాలకు కూడా ప్రాధాన్యతను కల్పించవలసి ఉంది. వౌలిక వృద్ధి వేగవంతానికి ఎఫ్‌డిఐలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి పలు సంస్కరణల చర్యలు చేపట్టవలసి ఉంది.
గతంలో వాజపేయి మంత్రివర్గంలో మంత్రులకు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉండేది. మంత్రివర్గ సమావేశాలలో తమ శాఖలకు సంబంధించిన అంశాలనే కాకుండా అన్ని అంశాలపై నిర్మోహాటంగా చర్చించే అవకాశాలు ఉండేవి. కానీ యుపిఎ ప్రభుత్వంలో గాని, మోదీ ప్రభుత్వంలో గాని అటువంటి అవకాశాలు ఉండటం లేదు. పారదర్శకంగా పాలనా వ్యవస్థ లేని పక్షంలో ప్రభుత్వ పనితీరును మెరుగు పరచడం కష్టం కాగలదు. మంత్రివర్గంపై సమష్టి బాధ్యత ప్రజా స్వామ్యంలో ప్రాథమిక అంశం. అటువంటి బాధ్యతను మంత్రులు భావించేలా వారికి తమ పనితీరులో స్వతంత్రత అవసరం. మోదీ ప్రభుత్వం మొదట్లో మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి విశేషమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కానీ కాలక్రమంలో ఆయా కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత సన్నగిల్లింది. వాటిని సమర్ధవంతంగా అమలు పరచడంలో ప్రభుత్వం ఒక విధంగా విఫలమైనదని చెప్పక తప్పదు. ఉదాహరణకు స్కిల్ ఇండియా పేరుతో బిజెపిలోనే పలువురు ఛోటా నాయకులు ప్రభుత్వ నిధులను కైవసం చేసుకున్నారు. బినామీ సంస్థలతో శిక్షణ ఇప్పుస్తున్నట్లు రికార్డులు సృష్టించారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రధానమంత్రి ఆశించిన విధంగా ప్రయోజనం కలగనే లేదు.
కోట్లాది మంత్రి పేదలకు వంటగ్యాస్ కనెక్షన్లు కల్పించడం ప్రధానమంత్రి సాధించిన ఘన విజయమే. అందుకు ప్రధాని సహితం ఎంతో గర్వ పడుతున్నారు. అయితే, ఇచ్చిన గ్యాస్ పొయ్యలను ఎంతమంది ఉపయోగించుకొంటున్నారు? తద్వారా వారి జీవితాలలో ఎటువంటి గుణాత్మక మార్పులు వచ్చాయనే సామజిక ఆడిట్ జరపడం లేదు. చాలామంది గ్యాస్ పొయ్యలను ఇళ్లలోనే ఉంచుకొని కట్టె పొయ్యలతో కాపురాలు చేస్తున్నట్లు పలు ప్రైవేట్ సంస్థల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి అంశాల పట్ల ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించవలసి ఉంది.

-చలసాని నరేంద్ర