మెయిన్ ఫీచర్

ప్రభుభక్తి పరాయణుడు పవమాన సుతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్రామాయణ మహామాలారత్నం అయిన హనుమంతుని ఆవిర్భావ విశేషాలు సకల జగతికీ సంభ్రమాశ్చర్యాలను కలిగించి మనసులను పులకింపజేస్తాయి. అలాంటి హనుమ జనన విషయాలు రామాయణంలో కిష్కంధాకాండలో జ్ఞానియైన వృద్ధ కపీశ్వరుడు జాంబవంతుడు, సముద్ర లంఘన వేళలో వౌనంగా తన బలం, విషయాలు తెలిసికోలేక యున్నప్పుడు ఆంజనేయుని వద్దకు చేరాడు. హనుమను ఉత్సాహపరిచాడు. హనుమను పొగడుతూ అతని జన్మ రహస్యాలనూ, బాల్యలీలనూ, అతని బల పరాక్రమాలనూ తెలిపి సాధకుడివి నీవేనంటూ తెలిపిన విషయాలు జాంబవంతుని జ్ఞాననిష్ఠకు తార్కాణాలు. హనుమ జననం
జాంబవంతుడు హనుమ వద్దకు చేరాడు. హనుమా! నువ్వు వానరశ్రేష్ఠుడివి. సకల శాస్త్రాలు నేర్చినవాడివి. ఈ ఆపద సమయంలో నీవిలా వౌనంగా ఉంటే ఎలా? నీ గురించి నీ జనన విషయాలు చెబుతాను విను.
స్వర్గలోకంలో ఇంద్రుని వద్ద 3పుంజికస్థల2 అనే అప్సరస ఉంది. చంచల స్వభావంగలది. ఒకరోజు ఆమె ఒక మహర్షిని గర్వంతో హేళన చేసింది. మహర్షి శాపం పెట్టాడు. ఆమెనే అంజన అని కూడా అంటారు. నీవు కోతి మాదిరిగా చంచలంగా వ్యవహరిస్తున్నావు గనుక భూలోకంలోకి వెళ్లి కోతిగా జీవించు అని శపించాడు ముని. ఆ శాపంవలన భూలోకంలో వానర స్ర్తిగా జన్మించినది. వానర వీరుడు కేసరి ఆమె భర్త. ఆమెకి వాయుదేవుని అనుగ్రహంవలన నువ్వు పుట్టావు గనుక నీకు వాయుదేవునితో సమానమైన బలం, గమనం ఉన్నాయి. మునిని అంజన వేడుకొన్నది. ప్రసన్నుడైన ముని నా వాక్కు అసత్యం కాదు. కోతి రూపాన్ని ధరించవలసినదే. కానీ అభీష్ట రూపాన్ని ధరిస్తావు. కోరినపుడు మానవ రూపాన్ని ధరించగలవు. వానర రూపాన్ని కూడా ధరించగలవు అన్నాడు.
పుంజికస్థల సుమేరు పర్వత గుహలో ఒక వానరిగా జన్మించినది. ఈ వానర జాతి కింపురుష జాతికి చెందినది. ఆకృతి మానవాకృతి. తోక కూడా వుంటుంది. కేసరి ఒక వానరరాజు. అంజన మిక్కిలి రూపవతి. ఇద్దరికీ వివాహం అయింది. సంతానం లేదు. అంజనాపుత్ర ప్రాప్తికి శూలపాణిని ఆరాధించినది.
శ్రీరాముడు అవతరించనున్నాడు. తను కూడా అవతరించి శ్రీరామునికి సేవ చేద్దామని శంకరునికి కోర్కె కలిగింది. శివకేశవులకు భేదం లేదు గనుక 3శివాయ విష్ణురూపాయ - శివ రూపాయ విష్ణవే2 అని శాస్తవ్రచనం. శంకరుడు ఏకాదశ రుద్రరూపుడు. 11వ అవతారమే హనుమంతుడు. శంకరుని వరప్రసాదం చేత, అంజనా గర్భాన్నుంచి స్వతః శంకరుడు అవతరించినందువలన ఇతనికి శంకరసూనుడంటారు.
శంకర వరప్రసాదాన్ని అనురక్తితో పవనదేవుడు అంజనా గర్భంలో వుండుటవలన నీవు 3పవన కుమారుడవై కీర్తి పొందావు. కేసరీ పత్నికి జన్మించుటచే కేసరీ నందనుడైనావు. నీవు వాయుపుత్రుడుగా వాయునందనుడని పేరు ప్రఖ్యాతి పొందినది.
బాలలీలలు
నీవు పుట్టగనే ఉదయిస్తున్న సూర్యుని చూశావు ఎర్రగా వున్న సూర్యుడు పండు అనుకొని పట్టుకొని తినడానికి పైకి ఎగిరావు. సూర్యుని వేడిని కూడా లెక్కచేయక పైకి వెళుతున్నావు. నీవు సూర్యుని ఆక్రమించకుండా ఆపడానికి ఇంద్రుడు నిన్ను వజ్రాయుధంతో కొట్టాడు. ఆ దెబ్బకు నీవు కొండమీద పడ్డావు. నీ ఎడమ దవడ (హనువు) విరిగిపోయింది. దానివలన నీకు హనుమంతుడను పేరు వచ్చింది. ఇంద్రుడు నిన్ను కొట్టినందుకు వాయుదేవుడు కోపించి ముల్లోకాలలోనూ ప్రసరించడం మానినాడు. లోకాలు గాలి లేక క్షోభించగా, దేవతలందరూ వాయుదేవుని ప్రార్థించారు. నీ తండ్రి సంతోషిస్తాడని నీకు అనేక వరాలిచ్చారు.
వాయుదేవుడు పుత్రశోకంలో తెలివిలేక పడుకొని వున్న హనుమను చూశాడు. ఆ సమయంలో త్రిమూర్తులు వచ్చారు. కారణం అడిగారు. వెంటనే విష్ణువు హనుమంతుని ఒడిలోకి తీసికొని చేతితో నిమిరాడు. హనుమకు తెలివి వచ్చింది. బ్రహ్మ వాయుదేవుని గాంచి, సోదరా! ముల్లోకాల్లో నీ గమనం తగ్గడంవలన వ్యాకులతగా వుంది. తిరిగి నీవు మామూలుగా సంచరించు. సుఖాలను పంచు అని కోరాడు.
వాయుదేవుడు అయితే మీరంతా నా పుత్రుని అజరామరునిగా సర్వత్రా విజయునిగా, బలవంతునిగా వుండునట్లు ఆశీర్వదించండి అని కోరాడు. దేవతలంతా హనుమను ఆశీర్వదించారు. దేవతలందరూ గొప్ప వరాలను ప్రసాదించారు గనుక బలవంతుడైనాడు. వాయుదేవుడు సంతసించి అన్ని లోకాలకు మామూలుగానే వీచాడు. అంజనాదేవి వచ్చి తల్లిపాలు ఇచ్చింది. పెరిగి పెద్దవాడైనాడు. చదువుకు యోగ్యుడై సూర్యుని వద్ద సకల అస్తశ్రస్త్రాలను అభ్యసించాడు. నవవ్యాకరణ పండితుడైనాడు. సర్వగుణ సంపన్నుడైనాడు.
హనుమ బల్య చాపల్యంతో ఋషులనూ, మునులనూ కష్టపెట్టనారంభించాడు. మహర్షులు విసిగిపోయి శపించారు. హనుమను నీ బల పరాక్రమాలను మరచి వుండుగాక అని శపించారు. ఎవరైనా ఇతనికి తన బల పరాక్రమాలను గుర్తుచేస్తే వెంటనే జ్ఞాపకం వస్తుందని శాపవిమోచన మార్గం చెప్పారు మునులు. ఇతని బుద్ధి కౌశలాన్ని చూసి సుగ్రీవుడు తన మంత్రిగా చేసుకున్నాడు. జాంబవంతుడు సముద్ర లంఘన వేళ హనుమకు ఇన్ని విషయాలను తెలిపి రామకార్యానే్వషణలో నీవు తప్ప ఎవరూ విజయాన్ని పొందలేరు అని ప్రశంసించి హనుమను జాగృతం చేసిన మహాజ్ఞాని.
గుణగణాలు
మంత్రిగా స్వామి సుఖాన్ని తన సుఖంగా, స్వామి దుఃఖాన్ని తన దుఃఖంగా భావించడమే నిజమైన స్వామి భక్తుని లక్షణం. ప్రభుభక్తి పరాయణుడు హనుమంతుడు. తన వాక్చాతుర్యంతో శ్రీరామ సుగ్రీవ మైత్రిని నెరపి విజయం సాధించిన బుద్ధిశాలి.
అశోకవనంలో ఆవేదనలో వున్న సీతాదేవికి శ్రీరాముని గుణగణాలనూ, శ్రీరాముని దుఃఖమును తెలిపినాడు. సీతాదేవి విశ్వసించకపోతే విశ్వరూపాన్ని చూపి నమ్మిక కల్గించి రామ ముద్రికనిచ్చి, సీతనుండి చూడామణిని గైకొన్నాడు. శ్రీరామునకు సీతా సమాచారాన్నీ, సీతాదేవి క్షేమ సమాచారాన్ని శ్రీరామునికి నివేదించి వారి ప్రాణాలను రక్షించాడు హనుమ. సేవాధర్మంలో జీవించి రోమ రోమంలో తారక మంత్రమైన రామనామంతో శ్రీరాముని బంధించుకున్న రామభక్తుడు ఆంజనేయుడొక్కడే. రామసేవలో తరించినవాడు హనుమ.
శ్రీరామ సందేశం
స్వధర్మాన్ని విడవకుండా దానే్న ఆచరించాలి. హింస మానుకోవాలి. ఏ ప్రాణినీ కష్టపెట్టరాదు. నిరంతరం సాధు సజ్జనులను సేవించాలి. ఇంద్రియాలను వశపరచుకోవాలి. భక్తిశ్రద్ధలతో శివునిగానీ, విష్ణువునిగానీ పూజిస్తూ వుండాలి. సత్యానే్న పలకాలి, విష చింతనలను వదలాలి, జీవాత్మ పరమాత్మల కలయికను గురించి ఆలోచించాలి.
శ్రీరామాయణంలో సుందరకాండ అతివైభవం పొందినది. పవమానసుతుని ప్రాభవం అంతా ఈ కొండలోనే వివరించబడింది. హనుమను యుగావతారునిగా, అద్భుత దైవంగా గ్రామ గ్రామాన, పల్లె పల్లెల్లో, పట్టణాల్లో వాయుసుతుని దేవాలయాలలో గర్భగుడికి ఎదురుగా హనుమ విగ్రహాన్ని నిలిపి ఆరాధించడం దేశంలో సనాతన సంప్రదాయమై నిలిచింది. హనుమ భగవంతునికి బాహ్యప్రాణం. శ్రీరాముడు దీవిస్తూ, హనుమా! లోకంలో నా కథ వుండువరకూ నీవు జీవించి వుంటావు చిరంజీవిగా. నీ కీర్తి చిరస్థాయిగా వుంటుందన్నాడు. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున హనుమజ్జయంతిని వాడవాడలా జరుపుకుంటూ హనుమంతుని ఆరాధనలూ, అర్చనలూ గావించి ఉత్సవాలు, ఊరేగింపులూ జరిపి మనసారా ఆ మూర్తిని సేవిస్తూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ, చాలీసా పారాయణలు- సుందరకాండ పారాయణలు ఆచరిస్తూ సంప్రదాయ పర్వదినంగా చేసికొనుట ఆనవాయితీగా జరుగుచుండుట స్వామి భక్తిపరాయణులగుట ఎంత అదృష్టమో మరి!
అతులిత బలధామం - స్వర్ణ శైలాభదేహం
దనుజవన కృశానుం - జ్ఞానినామాగ్రగణ్యం
సకలగుణ నిధానం వానరాణ మధీశం
రఘుపతి ప్రియభక్తం - వాతజాతం నమామి!

ఆంజనేయుడు.. తమలపాకులు
ఓసారి సీతారాములు తమలపాకులు సేవిస్తున్నారట. అమ్మ సీతమ్మ చిలుకలు చుట్టి రాముని నోటికి అందిస్తుంటే రాముని నోరు ఎర్రగా అవుతూ చూడడానికి మనోహరంగా కనిపించాడట. అక్కడే ఉన్న ఆంజనేయుడు అమ్మా పచ్చని ఆకులు ఇస్తున్నావు. రాముని నోరు మాత్రం ఎర్రని పండులాగా తయారు అవుతోంది ఏమిటి అని అడిగాడట. రామునికి తమలపాకులంటే ఇష్టం అందుకే రాముని నోట్లో కి వెళ్లగానే అవి అన్నీ పండ్లు అయపోతున్నాయ అందట సీతమ్మ. అంతే రాముల వారికి తమలపాకులంటే అంత ఇష్టమా నేనా తమలపాకులనే చుట్టుకుంటా అని నాగవల్లిని తన శరీరమంతా పేర్చుకుని రామునికి కనిపించాడట పవనపుత్రుడు. అపుడు రాముడే నీకు ఎవరైతే తమలపాకులతో పూజ చేస్తారో వారికి తీరని కోరికలంటూ ఏమీ ఉండవు ఆంజనేయ అన్నాడట. కలియుగంలో నీవే నా భక్తుల కోరికలను తీర్చుము అని కరువలిపట్టికి ఆజ్ఞ ఇచ్చాడట రాముడు. అందుకే హనుమన్నకు తమలపాకులతో పూజ. సంసారంలో ప్రశాంతతను కోరేవారు ఆంజనేయుని తమలపాకు దండ వేస్తే వారికి శాంతి లభ్యమవుతుంది. గౌరవహీనంగా తమ బతుకులున్నాయనుకొనేవారు కూడా నాగవల్లిని అంజన్నకు సమర్పిస్తేచాలు వారికి గౌరవ మర్యాదలు లభ్యమవుతాయ. హనుమంతునికి తమలపాకులను సమర్పించిన వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు లభిస్తాయ. సుందరకాండ పారాయణ చేసి తమలపాకుల దండ హనుమన్నకు వేస్తే అన్నింటా విజయం లభిస్తుంది.

సిందూర ప్రియుడు సంజీవరాయుడు

అలంకరణలో భాగంగా ఓసారి సీతమ్మవారి పాపిట సిందూరాన్ని దిద్దు కుంటుంటే ఇలా ఎందుకు చేసుకొంటు న్నావని సీతమ్మను సంజీవ రాయుడు అడిగాడట.. సీతమ్మ ఇలా పెట్టుకోవడం రాములవారికి ఇష్టమని చెప్పిందట. అంతే ఎకాఎకిన హనుమంతుడు వెళ్లి సిందూరాన్ని తీసుకొని వచ్చి తన ఒళ్లంతా పూసుకొని రాముని ముందు నిల్చున్నాడట. ఇలా ఎందుకు వచ్చావని రాముడు అడిగితే మీకిష్టం కదా అన్నాడా అమాయక ఆంజనేయుడు. అందుకే ఆ ఆంజనేయుని జయంతి రోజున సిందూరాన్ని సమర్పిస్తే ఆంజనేయుడే కాదు సీతారాములు కూడా కోరుకున్న వరాలనిస్తారన్న ఐతి హ్యం వచ్చింది.

-పి.వి.సీతారామమూర్తి 9490386015