మెయిన్ ఫీచర్

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయం, అపరాధం ఒకటి కాదు. అంగీకరించిన భయం స్వేచ్ఛగా మారుతుంది. ఖండించిన, తిరస్కరించిన, నిరాకరించిన భయం అపరాధంగా మారుతుంది.
నిజానికి, భయం పరిస్థితిలో ఒక భాగం మాత్రమే. అలాగే, ఈ సువిశాల సర్వస్వంలో మనిషి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అంటే, ఈ సర్వస్వమంతా సముద్రమైతే మనిషి అందులో ఒక చిన్న నీటి బొట్టన్నమాట. అందుకే ‘‘నేను నా గుర్తింపును కోల్పోయి ఈ సర్వస్వంలో లీనమై నాశనమవుతానేమో’’అనే భయం మీలో కలుగుతుంది. అదే మృత్యుభయం. అందుకే మీలో వణుకుపుడుతుంది. కాబట్టి, అన్ని భయాలు మృత్యుభయాలే.
మనిషి అలా భయంతో వణికిపోవడం సహజమే. ఆ సహజత్వాన్ని మీరు సంపూర్ణంగా అంగీకరించినట్లైతే వెంటనే మీ వణుకు తగ్గిపోతుంది, మీ భయం స్వేచ్ఛగామారుతుంది. అప్పుడు నీటిబొట్టు సముద్రంలో కలిసినా ‘‘అది అక్కడే ఉంది’’అనే భావన మీలో కలుగుతుంది. నిజానికి, ఆ నీటి బొట్టే సముద్రమయింది. అలా మృత్యువు నిర్వాణమవుతుంది. అప్పుడు నాశనమయేందుకు మీరు ఏమాత్రం భయపడరు.
‘‘జీవితాన్ని కాపాడుకుంటే మీరు దానిని కోల్పోతారు. జీవితాన్ని కోల్పోతే మీరు దానిని కాపాడుకుంటారు’’అని చెప్పిన జీసస్ మాటలు అప్పుడు మీకు అర్థమవుతాయి. కాబట్టి, మృత్యువును అధిగమించేందుకున్న ఏకైక మార్గం దానిని అంగీకరించడమే. అప్పుడే అది అదృశ్యమవుతుంది. అలాగే, భయాన్ని అధిగమించేందుకున్న ఏకైక మార్గం దానిని అంగీకరించడమే. అప్పుడే మీలో ఉన్న భయం అదృశ్యమవుతుంది. అప్పుడు మీలో ఉన్న శక్తి విడుదలై స్వేచ్ఛగా మారుతుంది. కానీ, మీరు మీలోని భయాన్ని ఖండిస్తూ, అణిచేస్తూ, మీరు భయపడుతున్న నిజాన్ని దాచేస్తూ, మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నప్పుడు మీలో ‘‘అపరాధం’’ పుడుతుంది.
మీరు అంగీకరించనిది, ప్రకృతికి విరుద్ధంగా అణచివేయబడ్డదేదైనా మీలో అపరాధాన్ని సృష్టిస్తుంది. అప్పుడు మీరు ‘‘మీకు, ఇతరులకు’’ అబద్ధాలు చెప్తున్నట్లు తెలియడంతో మీరు అపరాధ భావనకు గురిఅవుతారు. మీలోని ఆ అప్రమాణికతే అపరాధం.
‘‘్భయం, అపరాధం ఒకటేనా?’’అని మీరు అడుగుతున్నారు. అవి రెండూ ఒకటికాదు. ఒకవేళ భయం అపరాధంగా కనిపించినా అది అలాంటిది కాకపోవచ్చు. అది మీరు భయపడుతూ చేసే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు భయపడుతూ ఏదైనాతప్పుచేస్తే అది అపరాధంగా మారుతుంది. కానీ, మీరు మీ భయాన్ని అంగీకరిస్తూ ఏ తప్పుచెయ్యకుండా ఉన్నట్లైతే- నిజానికి చేసేందుకేమీ ఉండదు-అది స్వేచ్ఛగా, నిర్భయత్వంగా మారుతుంది.
మీరు చాలా వికారంగా ఉన్నారని, తప్పులుచేసిన పాపాత్ములని భావిస్తూ మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిందించుకోకండి. మీరెలాంటివారైనా మీరు మీరే. కాబట్టి, మీరు ఎప్పుడూ అపరాధిగా భావించకండి. ఆ భావనలో ఉండకండి. ఒకవేళ మీరు తప్పుచేసినా అది మీ తప్పుకాదు. బహుశా, మీరు అలా నటించి ఉండవచ్చు. అంతమాత్రాన, మీరు తప్పుచేసినట్లు కాదు. కొన్ని చర్యలు తప్పుకావచ్చు. కానీ, మీ ఉనికి ఎప్పుడూ ఒప్పుగానే ఉంటుంది.
‘‘నాకు చాలా శక్తి ఉందని, నేను చాలా ముఖ్యమైన వాడినని’’ ఇతరులను ఒప్పించేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తున్నట్లుగా నా గురించి నేను తెలుసుకున్నాను. అందుకుగల కారణాలపై నేను ధ్యానం చేశాను. అది భయమని నేననుకుంటున్నాను.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.