మెయిన్ ఫీచర్

ప్రేమ భయాన్ని కలిగిస్తుందా? ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి, ప్రేమానుబంధం మీకు అనేక సమస్యలు సృష్టిస్తుంది. వాటిని ఎదుర్కోవడం మంచిదే. కానీ, అనుబంధాలకు అతీతులమని చెప్పుకునే తూర్పు దేశాలలోని వ్యక్తులు తమ ప్రేమను వ్యతిరేకిస్తూ, నిరాకరిస్తూ, అది సృష్టించే సమస్యలనుంచి తప్పించుకుని, ప్రేమరహితులుగా, నిర్జీవులుగా తయారయ్యారు. ఆ రకంగా తూర్పుదేశాలలో ప్రేమ దాదాపు అదృశ్యమై కేవలం ధ్యానం మాత్రమే మిగిలింది.
ధ్యానమంటే మీరు ఏకాంతంలో మీతో హాయిగా ఉండడమన్నమాట. అలా మీ వృత్తం మీతో పూర్తవుతుంది. అందులోంచి మీరు బయటకువెళ్ళరు. దానివల్ల తొంభైతొమ్మిది శాతం సమస్యలు పరిష్కారమవడంతో మీరు అతి తక్కువ సమస్యలో ఉంటారు. కానీ, దానికోసం మీరు చాలా చెయ్యవలసి ఉంటుంది.
తూర్పు దేశాలలో కళ్ళుమూసుకుని తన అంతరంగ కేంద్రంలో హాయిగా, సురక్షితంగా జీవించే వ్యక్తి తక్కువ ఆందోళన, తక్కువ ఉద్రిక్తతలతో ఉంటాడు. అతడు తన శక్తిని బయటకు ప్రవహించనివ్వకుండా తనలోనే ఇముడ్చుకుంటాడు. అందుకే అతడు ఆనందంగా ఉంటాడు. కానీ, అతని ఆనందం తక్కువ జీవంతో ఉంటుందేకానీ, పరమానంద పరవశంతో ఉండదు.
మహాఅయితే, మీరు చాలా ఆరోగ్యంగా, హాయిగా ఉందని, ఎలాంటి రోగంలేదని చెప్తారు. కేవలం రోగం లేనంతమాత్రాన పూర్తి ఆరోగ్యం ఉన్నట్లు కాదు. అదే నిజమైతే, ఎలాంటి రోగం లేని శవం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా!
కాబట్టి, తూర్పు దేశాలలో ప్రపంచాన్ని పరిత్యజిస్తూ, ప్రేమరాహిత్యంతో జీవించే ప్రయత్నమే జరిగింది. అంటే, స్ర్తిని ద్వేషించడం, పురుషుని ద్వేషించడం, ప్రేమనుకాదనడం- ఇలా ప్రేమ వికసించే అవకాశాలన్నింటినీ పరిత్యజించడం జరిగింది.
నిజానికి, ఒంటరిగా ఉన్న స్ర్తితో మాట్లాడేందుకు, ఆమెను తాకేందుకు, చివరికి ఆమెను చూసేందుకు కూడా జైన, హిందూ, బౌద్ధ సన్యాసులకు అనుమతి లేదు. ఒకవేళ ఏదైనా అడిగేందుకు స్ర్తి వచ్చినప్పుడు వాళ్ళు నేలచూపులు చూస్తూ మాట్లాడాలే కానీ, పొరపాటున కూడా ఆమె ముఖాన్ని చూడకూడదు. ఎవరికి తెలుసు?
ఏదైనా జరగచ్చు. ఎందుకంటే, ప్రేమ చేతిలో అందరూ నిస్సహాయులే. అందుకే వారు ఎవరి ఇళ్ళల్లోను నివసించరు, ఒకేచోట ఎక్కువ కాలం ఉండరు. ఎందుకంటే, ప్రేమానుబంధాలు ఏర్పడే అవకాశముంటుంది. అందుకే వాటిని తప్పించుకునేందుకు వారు ఒకేచోట ఉండకుండా ఊళ్ళుతిరుగుతూ ఉంటారు. అలావారు ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా, తాము ఇబ్బంది పడకుండా ఒక రకమైన నిశ్చలత్వాన్ని సాధించారు. అయినావారు సంతోషంగా లేరు, వేడుక చేసుకోలేరు. పాశ్చాత్య దేశాలలో దీనికి వ్యతిరేకంగా జరిగింది. ప్రేమకలాపాల ద్వారా సంతోషాన్ని సాధించే ప్రయత్నంలో వారు తమకుతాము దూరమై, ఇంటిదారి తప్పి, వెనక్కి ఎలారావాలో తెలియక చాలా ఇబ్బందుల్లోపడ్డారు. దానితో వారు పిచ్చిపిచ్చిగా అన్నిరకాల ప్రేమకలాపాలలో పాల్గొంటూ స్వలింగ, భిన్నలింగ, యాంత్రిక సంపర్కులుగా తయారయ్యారు. అయినా వారిలో శాంతి లేదు. ఎందుకంటే, ప్రేమకలాపాలు కేవలం శారీరక సుఖాన్నిస్తాయే కానీ, అక్కడ ఎలాంటి నిశ్శబ్దము ఉండదు. అందువల్ల కావలసిన శారీరక సుఖాలు లభించినప్పటికీ ఏదో కోల్పోయిన భావన మీలో ఒక జ్వరంలా ఇంకా మిగిలే ఉంటుంది. దాని తీవ్రతవల్ల మీరు చాలా ఉద్రిక్తతకు లోనై అనవసరమైన దానికి అతిగా కంగారుపడుతూ ఉంటారు. అయినా, దానిని వెంటాడుతూ ఆయాసపడడం తప్ప మీకు దక్కేదేముండదు
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.