మెయిన్ ఫీచర్

మిమ్మల్ని మీరు తెలుసుకోండి (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో ఒకరోజు మీరు అర్థంలేని పని చేస్తున్నారని మీకు తెలుస్తుంది. ఎందుకంటే, మీరు మిమ్మల్ని తెలుసుకోకుండా ఇతరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రేమలేని ధ్యానంతో తూర్పు దేశాలు, ధ్యానం లేని ప్రేమతో పాశ్చాత్య దేశాలు పూర్తిగా ఓడిపోయాయి. అందుకే నేను మిమ్మల్ని ఈ సర్వస్వంతో సమన్వయం చేసేందుకు ప్రేమ, ధ్యానాలను కలిపే ప్రయత్నం చేస్తున్నాను.
ఒంటరిగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు, అంతరంగం లోపల, అంతరంగం వెలుపల అందరూ సంతోషంగా ఉండగలగాలి. అలాగే అంతరంగం లోపల, బయట కూడా అందరూ చక్కని ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంటి చుట్టూ చక్కని తోట, ఆ ఇంట్లో అందమైన శయ్యామందిరం ఉండాలి. శయ్యామందిరానికి తోట వ్యతిరేకం కాదు, తోటకు శయ్యామందిరం వ్యతిరేకం కాదు. కాబట్టి, ధ్యానం ఒక అంతర్గత నీడలా, ఒక అంతర్గత దేవాలయంలా ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచం అతిగా ఉన్నట్లు మీకెప్పుడనిపించినా వెంటనే మీరు ఆ మందిరంలోకి వెళ్ళి, శక్తిని పుంజుకుని, నూతన జీవంతో నిండిన వ్వనంతో పునర్జన్మిస్తార. అయితే మీరు మనుషులను ప్రేమించగల, దానివల్ల ఎదురయ్యే సమస్యలను కూడా నిశ్శబ్దంగా భరించగల సామర్థ్యం కచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే, సమస్యలను ఎదిరించలేని నిర్వీర్యమైన నిశ్శబ్దం ఏమాత్రం విలువైనది కాదు.
కాబట్టి, ముఖ్యంగా నేను మీకు రెండు విషయాలు చెప్పదలచుకున్నాను. ముందుగా ధ్యానం చెయ్యడం ప్రారంభించండి. అది చాలా మంచిది. ఎందుకంటే, ధ్యానం ఎప్పుడూ మీ ఉనికి కేంద్రానికి అతి సమీపంలో ఉంటుంది. కానీ, ఎప్పుడూ అక్కడే ఆగిపోకుండా, అది వికసించి పరిమళాలు వెదజల్లే ప్రేమగా మారేలా ముందుకెళ్ళండి.
భయం గురించి చింతించకండి. దానిని ఒక సమస్యగా భావించకండి. అది ఏమాత్రం ఒక సమస్య కాదు. ప్రతి మనిషికి అది సహజం. జీవితంలో ఎవరైనా భయపడతారు, భయపడాలి. జీవితం అలాగే ఉంటుంది. కేవలం ధైర్యమున్నంతమాత్రాన మీరు నిర్భయులైనట్లు కాదు. ఎందుకంటే, తన భయాన్ని అణచుకోవడం ద్వారా మనిషి నిర్భయుడుగా కనిపిస్తాడే కానీ, నిజానికి, అతడు నిర్భయుడు కాడు. తన భయాలను అంగీకరించిన వాడే నిర్భయుడవుతాడు. అది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు. అది కేవలం జీవిత వాస్తవాలను గమనిస్తూ, ‘‘్భయాలన్నీ సహజమే’’అని తెలుసుకోవడం. అప్పుడే ఎవరైనా తన భయాలను అంగీకరిస్తారు. మీరు భయాలను తిరస్కరిస్తారు కాబట్టే, సమస్య తలెత్తుతోంది. మహా అహంకారభావాలను మీకు బోధించడం జరిగింది. ధైర్యంగా ఉండండి. ఏమిటి ఈ అర్థంలేని మూర్ఖత్వమంతా? తెలివైన వ్యిక్తి అయినంతమాత్రాన భయాలనుంచి ఎలా తప్పించుకోగలడు? మూర్ఖులకు మాత్రమే ఎలాంటి భయాలు ఉండవు. అందుకే వారు ‘‘కారుడ్రైవరు హార్న్ మోగిస్తున్నా’’ రోడ్డుకు అడ్డంగా ఉంటారు. కానీ, తెలివైన వ్యక్తి వెంటనే పక్కకు తప్పుకుంటాడు.
మీరు పాముకోసం పుట్టల్లో వెతికే వ్యసనపరులుగా మారినా, రోడ్డుపై ఎవరూ లేకపోయినా భయంతో పరిగెత్తేవారైనా మీకు ఏదో సమస్య ఉన్నట్లే. లేకపోతే, అందరికీ భయాలుంటాయి. అది సహజం. కాబట్టి, ‘‘మీరు మీ భయంనుంచి బయటపడాలి’’ అని నేనంటున్నానంటే అర్థం, జీవితంలో భయాలుండవని కాదు, ఉంటాయి. అందుకే మీరు వాటినుంచి బయటపడాలంటున్నాను. అప్పుడే మీరు మీ భయాలలో తొంభై శాతం కేవలం మీరు ఊహించుకున్నవే అని మీరు తెలుసుకుంటారు. మిగిలిన పది శాతం భయాలే అసలైన భయాలు. కాబట్టి, ఎవరైనా వాటిని అంగీకరించక తప్పదు.
నేను ఎవరినీ సాహసవంతులుగా చెయ్యను. కానీ, నేను అందరినీ చాలా సున్నితంగా, బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండేలాచేస్తాను. ఎందుకంటే, ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. అప్పుడే మీరు మీ భయాలను కూడా మీ అభివృద్ధికి సోపానాలుగా మలచుకుంటారు. కాబట్టి, మీ భయాల గురించి మీరు ఏమాత్రం చింతించకుండా వాటిని మీరు అంగీకరించడం ప్రారంభించండి. అప్పుడే మీరు మీ భయాల నుంచి బయటపడతారు.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.