మెయిన్ ఫీచర్

‘పడతుల పంచాయతీలు’ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హింసను నిశ్శబ్దంగా భరించాలి.. వివక్షను వౌనంగా ఆమోదించాలి.. నోరెత్తితే తప్పు.. ఇదీ దిల్లీలోని మురికివాడ మహిళల పరిస్థితి.. వారి జీవనం, జీవితం చాలా దుర్భరం. కష్టాల్లో ఉన్న సమయంలో ఒంటరి స్ర్తిలకు ఆసరా కావాలి. ఆ ఆసరానే అందిస్తున్నాయి దిల్లీ నగరానికి చెందిన మహిళా పంచాయితీలు.

దిల్లీ మహానగరంలోని మురికివాడల్లో మహిళా పంచాయితీలు.. వివరాల్లోకి వెళితే..
పురుషాధిక్యానికి వ్యతిరేకంగా పోరాడే మహిళ ఎప్పుడూ ఒంటరే. సమాజమంతా ఒకవైపు, ఆమె మాత్రం మరోవైపు.. ఇరుగుపొరుగువారు వెలేసినట్లు చూస్తారు. బంధువులు రాబందులవుతారు.. గుండె లోతుల్లోని భావాల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.. భయం, బాధ, కష్టం, అవమానం, హింస, అనుమానం.. ఇలా అన్నీ.. అన్నీ.. ఆ మహిళను చుట్టుముడతాయి. ఇలాంటి సమయంలో చట్టమంటే నమ్మకం ఉండదు. చట్టం సంపన్నుల చుట్టమనో, పోలీసుల బెత్తమనో భయపడే మహిళకు.. నువ్వూ మనిషివే.. నీకంటూ కొన్ని హక్కులున్నాయి అని చెప్పగలిగే వాళ్లు ఎందరుంటారు? ఇలాంటి ఒంటరి మహిళకు 3మేమున్నాం..2 అనే ధైర్యం చెప్పాలి. దిల్లీ నగరానికి సంబంధించినంత వరకూ ఆ బాధ్యతను మహిళా పంచాయితీలు తీసుకున్నాయి.
సంపన్న మహిళలకు కోర్టు దాకా వెళ్లే స్తోమత ఉంటుంది. విద్యాధికులైన యువతులకు పోరాట మార్గాలు తెలిసి ఉంటాయి. దిగువ మధ్యతరగతి జీవితాలకు ఆ రెండూ ఉండవు. తప్పెవరిదైనా చూపుడు వేళ్లు మాత్రం ఆమెనే చూపిస్తాయి. హింసను నిశ్శబ్దంగా భరించాలి.. వివక్షను వౌనంగా ఆమోదించాలి.. నోరెత్తితే తప్పు.. ఇదీ దిల్లీలోని మురికివాడ మహిళల పరిస్థితి.. వారి జీవనం, జీవితం చాలా దుర్భరం. కష్టాల్లో ఉన్న సమయంలో ఇలాంటి ఒంటరి స్ర్తిలకు ఎవరో ఒకరి ఆసరా కావాలి. ఆ ఆసరానే అందిస్తున్నాయి దిల్లీ నగరానికి చెందిన మహిళా పంచాయితీలు. ఆ ప్రయత్నంలోనే సామాజిక ఒత్తిడిని మార్గంగా ఎంచుకున్నాయి. స్ర్తిల సమస్యలపై ఎంత అవగాహన ఉన్నా ఒక సంపన్న యువతో, మధ్యతరగతి యువతో మురికివాడ యువతిని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వారు పెరిగిన వాతావరణం, సమస్యలు వేరు. అందుకనే ఒక మురికివాడ మహిళ సమస్యకు మరో మురికివాడ మహిళ నుంచే సరైన మద్దతు లభిస్తుంది. ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ మూలసూత్రంపైనే ఇక్కడి పంచాయితీలు పనిచేస్తాయి.
దిల్లీలో అరవైదాకా మహిళా పంచాయితీలు చురుగ్గా పనిచేస్తాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వ్యవస్థను మహానగరంలోని అన్ని నియోజకవర్గాలకూ విస్తరించాలని దిల్లీ మహిళా కమిషన్ నిర్ణయించింది. దీంతో పంచాయితీలకు కొత్త చైతన్యం వచ్చింది. 3యాక్షన్ ఇండియా2 సహా దాదాపు ముప్ఫైనాలుగు ప్రభుత్వేతర సంస్థలు వీటిని సమర్థంగా నిర్వహిస్తున్నాయి. మహిళా పంచాయితీలకు ఓ నిర్మాణం అంటూ ఉంటుంది. ప్రతి పంచాయితీలో ఇరవైమంది వరకూ సభ్యులు ఉంటారు. వీళ్లంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నేపథ్యాల నుంచి వచ్చినవారే.. పదోతరగతి వీరి కనీస విద్యార్హత. ఇక్కడ చేరాలంటే సమస్యలకు అనుగుణంగా స్పందించే హృదయం తప్పనిసరి. ఈ స్వచ్ఛంద కార్యకర్తలకు చట్టపరమైన విషయాల్లో, వివాద పరిష్కారాల్లో, మహిళా హక్కుల్లో ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. కౌనె్సలింగ్ నిర్వహణలో మెలకువలు నేర్పుతారు. కష్టాల్లో ఉన్న మహిళకు ధైర్యం చెప్పడానికైనా, దిశానిర్దేశం చేయడానికైనా ఆ మాత్రం పరిజ్ఞానం సరిపోతుంది కదా.. అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయస్థానాల్లో కనిపించే గంభీర వాతావరణం ఉండదు. ఆ గది నిండా చాపలు పరిచి ఉంటాయి. మధ్యలో పంచాయితీ సభ్యులు కూర్చుని ఉంటారు. చుట్టూ బాధితులు కూర్చుంటారు. తరువాత అక్కడ పంచాయితీ ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఏ మహిళ నుంచి ఫిర్యాదు అందినా పంచాయితీ వెంటనే నమోదు చేసుకుంటుంది. విచారణ తేదీని నిర్ణయిస్తుంది. ఫలానా రోజున, ఫలానా సమయానికి పంచాయితీ ముందు హాజరు కావాలి అని ఇరుపక్షాలకు వర్తమానం పంపుతుంది. ఎవరికివారు మద్దతుగా బంధుమిత్రుల్ని తీసుకొస్తారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఎవరి కోణంలోంచి వాళ్లు సమస్యను వివరిస్తారు. ఇరుపక్షాల వాదనల్ని విన్నాక పంచాయితీ ఒక తీర్మానానికి వస్తుంది. నూటికి తొంభై తొమ్మిది వివాదాల్లో పురుషుడిదే తప్పు ఉంటుంది. పంచాయితీ నిందితుల్ని అందరి ముందూ నిలబెడుతుంది. ఎందుకలా ప్రవర్తిస్తున్నారని నిలదీస్తుంది. ఇంకా పరిస్థితులు ఇలాగే ఉంటే చట్టం జోక్యం చేస్తుందని హెచ్చరిస్తుంది. ఫలితంగా పురుషుడు తన తప్పులను ఒప్పుకుని కాళ్లబేరానికి వచ్చేస్తాడు. పంచాయితీ పెట్టిన మహిళలకు ఉద్వేగపరమైన ఆసరా, సామాజిక మద్దతు, న్యాయ సహాయం అందుతుంది.
పంచాయితీ తీర్పులకు చట్టబద్ధత లేకపోయినా నైతిక బద్ధత ఉంటుంది. తీర్మానానికి కట్టుబడని వ్యక్తుల్ని బస్తీ మహిళలు సామాజిక బహిష్కరణకు గురిచేసినంత పనిచేస్తారు. పంచాయితీ సమావేశంలో వాదనలు వినిపించడానికి ఇరువర్గాల పెద్దలు వస్తారు కాబట్టి వారి ఆమోదం తర్వాత తీర్పు వెలువడుతుంది కాబట్టి అమలు బాధ్యత బంధుమిత్రుల మీద ఉంటుంది. తీర్పు ఇరు కాగితాలపై ఇరువర్గాల సంతకాలు తీసుకుంటారు. అంతటితో పంచాయితీ వదిలిపెట్టదు. తీర్పు అమలును తరచూ సమీక్షిస్తుంది. అవసరం అనుకుంటే బాధితురాలిని, దోషుల్ని మరొక్కసారి పంచాయితీ పిలిపిస్తుంది. ఇదే మహిళా పంచాయితీల ప్రత్యేకత. నవోదయ మహిళా పంచాయితీ, జాగృతి మహిళా పంచాయితీ.. వంటి తదితర సంస్థలు గణనీయమైన ఫలితాల్ని సాధిస్తున్నాయి. ఎన్నో జీవితాల్ని మారుస్తున్నాయి. చాలా సందర్భాల్లో చట్టం చేయలేని పనిని సామాజిక ఒత్తిడి చేయగలదు. ఈ పంచాయితీల పుణ్యంతో మహిళలకూ చట్టాలపట్ల అవగాహన పెరుగుతోంది. ఒకర్ని చూసి ఒకరు గృహహింసను నిలదీస్తున్నారు.
దిల్లీ ప్రభుత్వం మహిళా హెల్ప్‌లైన్‌ను పంచాయితీలతో అనుసంధానం చేసింది. గతంలో ఈ నెంబరుకు గృహహింసకు సంబంధించో, వరకట్న వేధింపులకు సంబంధించో ఏ ఫిర్యాదు వచ్చినా దాన్ని నేరుగా పోలీసుశాఖకు బదిలీ చేసేవారు. ఇప్పుడు అలా కాదు.. ఫిర్యాదు అందగానో ఆ ప్రాంతంలోని పంచాయితీ సభ్యులు రంగంలోకి దిగేస్తారు. అవసరమైతే గృహనిర్బంధం నుంచి విడిపిస్తారు. తక్షణం వైద్య సహాయం అందిస్తారు. మహిళలకు మనోధైర్యాన్ని పెంచుతారు. దిల్లీ మహిళా కమిషన్ నేతృత్వంలోని మొబైల్ హెల్ప్‌లైన్‌కు రెండు వాహనాలు ఉన్నాయి. వాటిని కూడా పంచాయితీలకు అనుసంధానించారు. ఫోన్‌కాల్ అందిన కొద్దిగంటల్లోనే ఆ వాహనం బాధితురాలి దగ్గర ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లోని మహిళా కమిషన్లు కూడా దిల్లీ తరహా మహిళా పంచాయితీలను అధ్యయనం చేస్తున్నాయి. వీటిని ప్రవేశపెడితే మహిళలు న్యాయం గురించి సంవత్సరాలకు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. న్యాయం జరుగుతుందా? అన్న సందేహం కూడా అవసరం లేదు. అందుకే మహిళా కమిషన్లు మహిళా పంచాయతీలను వారి వారి ప్రాంతాల్లో ఎలా అన్వయించుకోవచ్చో ఆలోచిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా మహిళా సమస్యలు మహిళవే.. కాబట్టి త్వరలో దేశవ్యాప్తంగా ఇలాంటివి మొదలైతే మహిళకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందేమో!?

- సన్నిధి