మెయిన్ ఫీచర్

ముద్దు ప్రేమకు సరిహద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దు మనిషి జీవితంలో ఓ మధుర స్పర్శ.. మమతల శ్వాస. ఓసారి ఆప్యాయంగా, ఓపరి ఓదార్పుగా, ఓ పర్యాయం ఆనందంగా.. లాలనగా, కాంక్షగా, తమకంగా, తృప్తిగా.. ఇన్ని మధుర భావాల వ్యక్తీకరణకు సాధనమైన మరి ముద్దైన పద్ధతులేంటో తెలుసా మీకు? అయతే తెలుసుకోండి.

బటర్‌ఫ్లై కిస్
సీతాకోకచిలుక మొహంమీద కదలాడితే ఎలా ఉంటుంది? ఈ ముద్దు అంత సుతారంగా ఉంటుంది. ప్రియురాలునురెప్ప వాల్చిన వెంటనే తటాలున ముద్దుపెడితే ఆమెను ఎంత ఉద్వేగంతో ప్రియుడు ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది.

స్నేహానికి సూచిక
‘మనస్ఫూర్తిగా నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను’ అని చెప్పడానికి బుగ్గమీద ముద్దుతో ఎక్స్‌ప్రెస్ చెయ్యవచ్చు. గర్ల్‌ఫ్రెండ్ భుజాలు రెండూ పట్టుకుని కళ్లల్లో స్వేచ్ఛ్భావాన్ని ప్రతిఫలింపజేస్తూ బుగ్గమీద ముద్దుపెడితే ఆ బంధం మరింత బలపడుతుంది.

భరోసానిచ్చే ముద్దు
భాగస్వామి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఓదార్చే సమయంలో చేతిపై పెట్టే ముద్దును ఫింగర్ కిస్ అంటారు. ఈ తరహా ముద్దు భార్యాభర్తలిద్దరికీ భరోసా ఇస్తుంది.

భాగస్వామిపై ప్రేమను తెలియజేసే నయన చుంబనం. నిత్యం ఈ విధంగా ముద్దాడుకోవడంవల్ల ఒకరికి ఒకరు కలకాలం నిత్యనూతనంగా అనిపిస్తారు. గువ్వా గోరింకల్లా కువకువలాడతారు. చేరువైన తరుణంలో తన్మయంతో మీ ఇష్టసఖి కనురెప్పలు మూసుకున్నపుడు నెమ్మదిగా వెన్నదొంగిలించిన కృష్ణుడిలా ముద్దాడాలి.
ఎస్కిమోల తరహాలో..
ఎస్కిమోలు ధ్రువ ప్రాంతాల్లో ఉంటారన్నది తెలిసిందే. వారు తమ భాగస్వామికి పెట్టే ముద్దును ఎస్కిమో కిస్సంటారు. ముక్కుకు ముక్కు రాసుకుంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ నెమ్మదిగా కిస్ చేయడం చల్లగా.. కూల్‌గా ఉంటుంది.
పాదసేవనం
శృంగార రసాస్వాదనలో కీలకమైన ఈ ముద్దు అలనాడు సత్యభామకు శ్రీకృష్ణుడు పెట్టిందే. శృంగారం తొలిమెట్టెక్కాక భాగస్వామి పాదాలను పెదాలతో మృదువుగా స్పృశిస్తే.. ఆ సంతోషం స్వర్గం అంచుల వరకు తీసుకువెళ్తుంది. మొహంలో కనిపించే ఆ ఫీలింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గిలిగింతలతో మొదలై.. అలా ఎటో సాగిపోయేందుకు ఈ ముద్దు ప్రేరణగా నిలుస్తుంది.
హాట్‌గా..
ఏ ముద్దయినా హాట్‌గానే ఉంటుంది కానీ ఇది చల్లగా షాకిస్తుంది. నాలుకతో నాలుక టచ్ చేసే దీనినే ఫ్రెంచ్ కిస్ అని కూడా అంటారు.
ఫ్రూట్ కిస్
భాగస్వామి నోటికి ఒక్కో పండ్ల ముక్కను అందిస్తూ వాటిని మునిపంట నొక్కి ముక్కలు చేస్తూ ఇవ్వటం. ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తే శృంగారోద్దీపన బాగా జరుగుతుంది.
ము.. ము..ముద్దు
ఒకరి పెదాలతో ఒకరు మాటాడుకుంటున్నట్లు.. ఆగి ఆగి ముద్దాడే ఈ పద్ధతిలో బోలెడంత రిలీఫ్ దొరుకుతుందని మానసిక శాస్తవ్రేత్తల ఉవాచ. ముద్దాడే వ్యక్తిని సున్నితంగా పట్టుకుని కళ్ళల్లో కళ్లు పెట్టి చూస్తూ, మనసులోని భావనలను వ్యక్తంచేస్తూ.. చిరుముద్దులు పెట్టుకునే విధానమిది. ఈ రకం కిస్ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ముద్దువల్ల ఆవేశం.. కోపం చాలామట్టుకు తగ్గుతుందంటున్నారు.
హాట్ అండ్ కూల్
ఇది పడక గదిలో పెట్టుకునే కిస్. భాగస్వామి దిగువ పెదవి రెండు పెదాలతో అందుకుని మునిపంట నొక్కి పెట్టుకునే ముద్దు ఇది. ఇది చాలా ఉద్రేకపరిచే ముద్దు.
చిరు ఆభరణం
భాగస్వామి మెడపై ఎన్ని ఆభరణాలున్నా.. మృదువుగా పెట్టుకునే ముద్దు ఇచ్చే అందం ఇంకేదిస్తుంది చెప్పండి? కంఠానికి ఇరువైపులా పెట్టే ఈ ముద్దు చల్లని ఒక శ్వాసలా అలరిస్తుంది. ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలు స్తుంది. ఇందులో ఏ మాత్రం కామవాంఛ, మోహం ఉండవు. సంతోషం అతిశయిస్తే ఈ ముద్దు పెదాలపై ఓ ప్రభాత దరహాసంలా ఉదయిస్తుంది.
రివర్స్ లిప్ కిస్
ఇది ప్రేమికుల ముద్దు. ప్రియురాలి అలక తీర్చడానికి ప్రియుడు ఈ రివర్స్ లిప్ కిస్‌ను ఉపయోగించుకుంటాడు. ప్రేయసి కుర్చీలో తల వెనుకకు వాల్చి రిలాక్స్ అవుతున్న తరుణంలో.. ప్రియుడు ఆమె వెనుక నుంచి వచ్చి వదనంపై పెదాలు ఆన్చి.. రెండు చేతులతో ఆమె మెడను పట్టుకుని దిగువ పెదవిపై తడి పెదాలతో ముద్దాడితే ఇక అలక తుర్రుమంటుంది.
తుమ్మెద ముద్దు
తమకం ఎక్కువై.. ప్రేయసిని ముద్దులతో ముంచెత్తే పద్ధతిది. మెడకు ఎడమవైపున లేదా, కుడివైపు కింద భాగంలో ముద్దు పెట్టుకుంటే అది తుమ్మెద ముద్దవుతుంది. పూవులో మకరందాన్ని తుమ్మెద జుర్రుకునే విధంగా సాగే ఈ ముద్దు మత్తెక్కిస్తుంది. బుగ్గపై నెమ్మదిగా చేతితో నిమురుతూ పెదాలతో పెదాలను స్పశిస్తే.. నువ్వంటే నాకు చాలాచాలా ఇష్టమని చెప్పకనే తెలిసిపోతుంది.
గుడ్‌మార్నింగ్ చెప్పండిలా..
చెంతనే వున్న సహచరి నిద్రలో ఊయలలూగుతున్న వేళ.. ఉదయానే్న.. మృదువుగా గుడ్‌మార్నింగ్ చెబుతున్నట్లు.. కనురెప్పలపై ముద్దుపెడుతూ నిద్రలేపితే ఇక ఆ రోజంతా ఉల్లాసమే. మదిలో ఉత్సాహమే. అయినా భాషకందనిది.. భావాలకు అతీతమైనది ముద్దు.. దానికి డెఫినిషన్లు ఏమిటంటారా? మీ ముద్దు.. మీ ఇష్టం!

ముద్దు ముద్రలు

చేతిమీద ముద్దుపెడితే.. నీకోసమే నే జీవిస్తున్నాను అని చెప్పడానికి
బుగ్గమీద ముద్దు పెడితే.. మేం స్నేహితులం
అని చెప్పేందుకు
నుదిటపై ముద్దుపెడితే.. ఆత్మీయతానురాగాలకు ప్రతీక
మెడపై ముద్దుపెడితే.. నువ్వు నాక్కావాలి అని చెప్పడానికి
పెదాలపై ముద్దుపెడితే.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను
అని చెప్పడానికి
చెవిపై ముద్దాడితే.. ఆనందంగా ఉన్నాను అని చెప్పడానికి.

- పక్కి వేణుగోపాల్