మెయిన్ ఫీచర్

ఓ నాన్నా.. నీ మనసే వెన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంప్రదాయంలో కుటుంబ వ్యవస్థ అనాది నుండి ప్రాముఖ్యత కలిగి వుంది. తల్లిదండ్రుల ప్రేమకు గుర్తు పిల్లలు. తల్లి ఇల్లు, పిల్లల లాలన చూసుకుంటే తండ్రి కుటుంబం కోసం సంపాదన బాధ్యత తీసుకుంటాడు. అందుకే మాతృదేవోభవ తర్వాత పితృదేవోభవ అన్నవి ఉపనిషత్తులు. అమ్మా అని ఎవరినైనా పిలవొచ్చు కానీ నాన్న అనే పిలుపు మాత్రం నాన్నకే సొంతం. అమ్మ ప్రేమకు మారుపేరైతే నాన్న నిండైన బాధ్యతకు మరో రూపం.
నీకు నేనున్నానని నిండు మనసుతో చెప్పగల, జీవితంలో నిలబెట్టగల ఏకైక వ్యక్తి నాన్న. దైవం తర్వాత అమ్మతో పాటు కన్నతండ్రికి మాత్రమే ప్రాధాన్యం ఉందన్నది వాస్తవం. కుటుంబానికి రక్షకుడు తండ్రే. అందుకే ఉపాధ్యాయాన్ దశాచార్యః ఆచార్యాణాం శతం పితః అని అందుకే అన్నారు. వందమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యులకంటే తండ్రి గౌరవంలో ఎక్కువ అని దానర్థం. కన్నతండ్రి, అన్నదాత, భయం పోగొట్టేవాడు, గురువు, ఉపనయనం చేసేవాడు ఈ ఐదుగురూ తండ్రులేనని శాస్తక్రథనం.
సూత్రధారి నానే్న
ఆత్మావై పుత్ర నామాసి అని వేదం చెబుతోంది. తండ్రి కొడుకుగా జన్మిస్తాడు. తండ్రి రూపం కొడుకులో ప్రతిబింబిస్తుంది. స్వభావాల ప్రతిబింబం. భవితకు భరోసా. జీవితానికి దిక్సూచి. ఓర్పునకు మారుపేరు. అమ్మ లాలించి లాలిపోసి బువ్వపెడితే నాన్న అడుగు వేయించి అక్షరాలు పలికించి అన్నీ తానై తోడు నీడగా ఉంటాడు. నాన్న సముద్రంలా గంభీరంగా వుంటాడు. అయితే మనసు మాత్రం వెన్న. క్రమశిక్షణలో ఉండాలంటాడు. కాలాన్ని వృధా చేయొద్దంటాడు. నాన్న ప్రశాంతత నిండిన నీలాకాశం. అంతటి ప్రాధాన్యం ఉన్న పదం నాన్న. మనం పరీక్షల్లో పాసయితే ఆయన మనసు ఆనందంతో పొంగిపొర్లుతుంది. కుటుంబం కోసం ఎంత కష్టపడినా ఎపుడూ తెరవెనుకే ఉండే కనిపించని సూత్రధారి. అత్యున్నత శిఖరాలను అధిరోహించేది మనమైతే మార్గంలోని మెట్టే నాన్న. అద్భుత విజయాల సారధి మనమైతే, మన అడుగులు మోసే వారధి నాన్న. ఇదీ అక్షరసత్యం.

మారిన నాన్న వైఖరి
కొన్నాళ్ల క్రితం వరకు నాన్న అంటే ఎక్కువ భయమే ఉండేది. కాని ఇపుడు పిల్లల చదువు, వారి ఆరోగ్యం గురించి తండ్రులు ఆందోళన పడుతున్నారు. చిన్నప్పుడు గురువుగా, వారికి వయసు పెరిగే కొద్దీ స్నేహితుడిగా, పెద్దయ్యాక మార్గదర్శిగా మారిపోయాడు నేటి నాన్న. నాన్నంటే నేస్తం, నాన్నంటే, ధైర్యం, నాన్నంటే జీవన మార్గానికి నిదర్శనం. ప్రతిరోజూ పిల్లలను ఏదో సమయంలో దగ్గరకు తీసుకుని వారితో ప్రేమగా సంభాషిస్తున్నారు. పిల్లల జీవితాల్లో తండ్రి పాత్ర గత ఇరవై సంవ్సరాలనుండి క్రమంగా మారుతూ వస్తోంది. రాముడు లేకుండా నా ప్రాణాలుండవు, రాముడితో నేనూ వనవాసానికి వెళతాను అని దశరథుడు కైకతో చెప్పిన మాటల్లోనే తండ్రి ప్రేమ, పుత్ర వాత్సల్యం ఉంది. దీన్నిబట్టి రామాయణం కాలంలో తండ్రి ప్రేమ కుమారుడిపట్ల ఎలా ఉందో తెలుస్తుంది. అందుకే ‘పితాహిదైవతం’ అని వాల్మీకి రామాయణం చెబుతుంది.
నేటి సమాజంలో నాన్న పాత్ర
క్రమశిక్షణ, సమయపాలన నేర్పి బిడ్డల బతుకును పర్యవేక్షించేవాడే తండ్రి. తనకన్నా మిన్నగా బిడ్డ తయారుకావాలన్న కలలు కనేది ఒక్క కన్నతండ్రి మాత్రమే. తల్లి ఒక నిజం అయితే తండ్రి ఒక నమ్మకం. తల్లి భావోద్వేగం అయితే తండ్రి జ్ఞానదీపం. పూర్వకాలంలో ఏది కావాలన్నా అమ్మనే అడిగేవారు. ఇపుడు ఆ ధోరణిలో కొంత మార్పు రావడం కనిపిస్తోంది. పిల్లల జీవితంలో నాన్న పాత్ర పెరిగింది. గంభీర సముద్రంలో ఉండే నాన్న ఆప్యాయతాసంద్రం అయ్యాడు.
తండ్రి పర్యవేక్షణ
ఓటమి ఎదురైన వేళ నేనున్నానంటూ అండగా నిలబడతాడు. జీవితాన్ని, బంగారు భవిష్యత్తును తమకు ప్రసాదించిన నాన్న సేవలను గుర్తుచేసుకోవడానికి ఫాదర్స్ డే అంటూ మొక్కుబడిగా గుర్తుచేసుకోవడానికి, ఆయనకు సేవలు చేయడానికి ఏడాదికి ఎన్ని రోజులున్నా చాలవు. తండ్రిని సేవించడమంటే నూరు యజ్ఞాలు చేసి పొందే ఫలాన్ని మించినంత పుణ్యం. సేవించడమే గాక గతించిన పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు వదిలి వారి ఆత్మకు శాంతి కలుగజేయాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది.
ఫాదర్స్ డే నేపథ్యం
1910లో సోన్‌రాస్మార్ట్‌డాడ్ అనే మహిళ ఫాదర్స్‌డే ఆలోచనకు నాంది పలికింది. ఆమె తల్లి మరణానంతరం తండ్రి తానే తల్లి అయి, ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారట. 1890లో అమెరికాలోని ఆర్కాన్స్‌న్‌లో చర్చికి వెళ్లిన సోన్‌రా అక్కడ మదర్స్ డే జరపడం చూసిందట. తమ కుటుంబ అభ్యున్నతికి పాటుపడిన నాన్నగారికి ఇలాంటి గౌరవం దక్కేలా చూడమని మత పెద్దలను కోరింది. ఆ అమ్మాయి తండ్రి జాక్సన్ పుట్టినరోజు 5న ఫాదర్స్ డే నిర్వహించాలని భావించినా, తగు సమయం లేకపోవడంతో జూన్ నెల మూడవ ఆదివారం ఈ దినాన్ని నిర్వహించారు. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఫాదర్స్‌డేను ఆ దేశ జాతీయ పండుగగా ప్రకటించాడు. అది తర్వాత 52 దేశాలకు వ్యాపించి ప్రపంచ వ్యాప్తమైంది.

-కె.రామ్మోహన్‌రావు 94414 35912