మెయిన్ ఫీచర్

ఊరిస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫస్ట్ ఫేజ్
-ఊరడింపుల పర్వం పూర్తయ్యంది.
సెకెండ్ ఫేజ్
-ఊరింపుల ఘట్టం మొదలైంది.
ఫస్ట్‌ఫేజ్‌లో -భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు నష్టాలను మూటగట్టడంతో ‘పోనీలే’ అనే ఊరడింపులు
పూర్తయ్యాయి. సెకెండ్ ఫేజ్‌లో -భారీ బడ్జెట్లతో వస్తోన్న పెద్ద సినిమాలు జాక్‌పాట్లు కొట్టేందుకు
ఊరింపుల ఘట్టానికి తెరలేపుతున్నాయి.
2019 -సగం పూరె్తైంది. సినిమా సీజన్‌గా లెక్కలేసుకునే ఘట్టాల్లో ఫెస్టివల్ సీజన్, సమ్మర్ సీజన్ ముగిసిపోయాయ. తొలి అర్థ్భాగంలో ‘భారీ’ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు తలకిందులైతే -ఆశల్లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం ఆకాశాన్ని అందుకున్నాయి. డిజాస్టర్ సినిమాల నిర్మాతలు నష్టాల వాతలకు మందు పూసుకుంటుంటే -భారీ భారీగా రానున్న సినిమాల నిర్మాతలు మాత్రం ‘గాంభీర్యాన్ని’ ప్రదర్శిస్తున్నారు. మలి అర్థ్భాగంలో వచ్చే పెద్ద సినిమాలకు దాదాపు ఫేజ్ సీజన్లు, విడుదల తేదీలు ఫిక్సయిపోవడంతో -సినిమా ఇండస్ట్రీ మోముమీద
అంతరంగానికి అర్థంకాని చిర్నవ్వులు కనిపిస్తున్నాయి.
*
దేనికైనా ఓ సీజనుంటుంది
-సినిమాకు తప్ప.
అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కు -ఎమోషనల్ ఈక్వేషనే సినిమా అనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలసిన ప్రాణానికి ఒకింత వినోదాన్నిచ్చేది సినిమా మాత్రమేననే మైండ్ బాండింగ్‌కు మనమెప్పుడో ఫిక్సయిపోయాం. సో, వినోదాన్నిచ్చే ఎన్నో అభిరుచులు, అలవాట్లను పక్కనపెట్టేసి -టైం’పాస్‌కు టికెట్లు కొంటుంటాం. ఇన్‌స్టంట్ మేడ్ ఈజీ!
సినిమాకు మించిన వినోదం లేదన్న భావననుంచి పక్కకు జరగడానికి ఏమాత్రం ఇష్టపడని వాళ్లు ఎంతోమంది. ఇది విమర్శ కోణం కాదు, కష్టంగా అనిపించే వాస్తవం. ఎందుకు? అని ప్రశ్నిస్తే.. -ప్రత్యామ్నాయం వెతుక్కునే టైం లేదంటారు కొందరు. స్క్రీన్‌కు అలవాటుపడిపోయాం అంటున్నారు ఇంకొందరు. అందరూ ఇలాగే ఉంటారని గట్టిగా చెప్పలేకపోయినా, చాలామంది అలాగే ఉంటారని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. లేదంటే -చిన్న సినిమాలు కోట్లు వసూలు చేయడాలు, పెద్ద సినిమాలు కోట్లకు కోట్లు వసూలు చేయడాలు సాధ్యంకాదు.
సో -కోట్లకు కోట్లు వసూలు చేయాలన్న కసితో మలి అర్థ్భాగంలో రానున్న కొన్ని ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఆసక్తి కనిపిస్తోంది. చర్చకు తెరలేపుతోన్న ‘పెద్ద’ అనబడే సినిమాలను ప్రస్తావించుకుంటే -జూలై 12న ధిమాక్‌ను చూపించేందుకు వస్తున్నాడు ఇస్మార్ట్ శంకర్. పూరి కనెక్ట్స్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభానటేష్ హీరో హీరోయిన్లు. ఫస్ట్‌లుక్‌లు, లిరికల్ వీడియోలు, అవి సాధించిన ‘మిలియన్ లైక్’లే అస్త్రాలుగా సోషల్ మీడియాలో కొంతకాలంగా ఊరిస్తున్నాడు ఇస్మార్ట్ శంకర్. దర్శకుడు, హీరో ద్వయానికి ‘ఇస్మార్ట్’ సక్సెస్ అనివార్యమే కాదు, సవాల్ కూడా. అందుకే -సినిమా ప్రచార పటాటోపాన్ని పీక్స్‌కి తీసుకెళ్తున్నారు. అదే పంథాలో జూలై 26న థియేటర్లకు వస్తున్నాడు -డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, శృతిరామచంద్రన్ హీరో హీరోయిన్లుగా భరత్‌కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. యూత్ ఫాలోయింగ్‌లో టాప్ పొజిషన్‌లోవున్న విజయ్ దేవరకొండకే కాదు, దర్శకుడు భరత్‌కమ్మకూ ప్రాజెక్టు సవాలే. ఫస్ట్‌లుక్, వీడియో లిరికల్స్‌తో ఊరిస్తోన్న ‘కామ్రేడ్’ -ఎలాంటి యాక్షన్, రొమాన్స్, డ్రామాను చూపించనున్నాడోనన్న ఆసక్తి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆగస్టు 15న రానున్న ‘సాహో’ గురించి. బాహుబలి ప్రాజెక్టు తరువాత -్భరీ గ్యాప్‌తో ప్రభాస్ ‘సాహో’గా వస్తున్నాడు. సుజిత్ దర్శకుడిగా ప్రభాస్, శ్రద్ధాకఫూర్ పెయిర్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. సాహో చాప్టర్ 1, 2 అంటూ ఇప్పటికే ప్రాజెక్టుకి ఓ రేంజ్‌ని సృష్టించారు. రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్‌కు మిలియన్ వ్యూస్ రావడాన్ని చూస్తే -ఈ ప్రాజెక్టుపై ఆడియన్స్ ఎంత ఆసక్తితో ఉన్నారోనంటూ చిత్రబృందం ఉత్సాహం చూపుతోంది. దీంతో సహజంగానే ప్రాజెక్టుపై ఆసక్తి కనిపిస్తోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రంగానే కాదు, భారీ గ్రాఫిక్స్, లోడెడ్ యాక్షన్, బాలీవుడ్ బ్యూటీ, భారీ తారాగణం.. అంటూ ప్రచార ఊరింపులూ భారీగానే ఉన్నాయి. ఇక దసరా ఫేజ్‌ను టార్గెట్ చేస్తూ థియేటర్లకు రానున్న మెగా సినిమా -సైరా. విడుదల తేదీ ఇంకా ఖరారు కాకున్నా -కచ్చితంగా దసరా సీజన్‌ను సైరా టార్గెట్ చేశాడన్నది కాదనిలేని విషయం. చిరంజీవి, నయనతార, సుదీప్, తమన్నాభాటియా, జగపతిబాబు, విజయ్ సేతుపతి.. భారీ తారాగణంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. హిస్టారికల్ వార్ జోనర్‌లో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తోంది. బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన ఉద్యమ నాయకుడు సైరా నరసింహారెడ్డి కథను అధివాస్తవిక కోణంలో తెరకెక్కిస్తుండటంతో -ఇండస్ట్రీలో సినిమాపై ఆసక్తి కనిపిస్తోంది. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరడంతో -ప్రచారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్రబృందం సమాయత్తమవుతోంది.
ఒక్కసారి తొలి అర్థ్భాగంలోని భారీ చిత్రాలను సింపుల్‌గా విశే్లషించుకుంటే -బాలకృష్ణ ‘ఎన్టీఆర్ బయోపిక్’, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఎఫ్-2, మజిలీ, జెర్సీలాంటి చిత్రాలు గొప్ప ఫలితాలు అందుకున్నాయి. మమ్ముట్టి ‘యాత్ర’, కళ్యాణ్‌రామ్ ‘118’, సాయితేజ్ ‘చిత్రలహరి’లాంటి చిత్రాలు ఓకే అనిపించుకుంటే -అఖిల్ ‘మిస్టర్ మజ్ను’, అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోర్లాపడ్డాయి. ఫస్ట్ఫాలో లాస్ట్ భారీ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ మాత్రం -తరువాత వచ్చే భారీ సినిమాలకు కొత్త ఆశలు రేకెత్తించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు 25వ సినిమాగా వచ్చిన ‘మహర్షి’ చెప్పుకున్నంత కాకున్నా మంచి ఫలితాలే రాబట్టాడన్నది కాదనలేని వాస్తవం. ఈసారి అనువాద విభాగంలో భారీ సినిమాలే వచ్చిన రజనీకాంత్ ‘పేట’, కంగనారనౌత్ ‘మణికర్ణిక’, రాఘవ లారెన్స్ ‘కాంచన-3’ చిత్రాలు మంచి వసూళ్లే రాబట్టాయి. కార్తి ‘దేవ్’, సూర్య ‘ఎన్‌జికె’, మోహనలాల్ ‘లూసిఫర్’, అజిత్‌కుమార్ ‘విశ్వాసం’ చిత్రాలు బాక్సాఫీస్‌కు ఎదురీదలేకపోయాయి.
సంక్రాంతికీ అప్పుడే..
2020 సంక్రాంతికీ సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఈసారి రేసులో మహేష్‌బాబు, ప్రభాస్, బాలకృష్ణ, అల్లు అర్జున్, నాగార్జున ఖాయంగా ఉండేలా కనిపిస్తున్నారు. అప్‌కమింగ్ హీరోల చిత్రాలూ చివరి క్షణంలో రేసులోకి దిగొచ్చు. ప్రతి సంక్రాంతి రేసులో బాలకృష్ణ ఉంటాడన్నది తెలిసిందే. ఈసారి దర్శకుడు కెఎస్ రవికుమార్ తెరకెక్కించనున్న ‘రూలర్’తో బాలకృష్ణ సీన్‌లోకి వచ్చే అవకాశముంది. సి కళ్యాణ్ నిర్మాతగా రెండు రోజుల క్రితం కొబ్బరికాయ కొట్టి సినిమా ప్రారంభించటంతో -సంక్రాంతి సినిమా సిద్ధమవుతున్నట్టేనని అంటున్నారు. ఇక పండుగ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ మహేష్‌తో అనిల్ రావిపూడి సైతం రేసులోకి దిగాడు.
సంక్రాంతి సీజన్‌లో వచ్చిన సినిమాలతోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ని చూపిస్తాడు. రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు.
నా పేరు సూర్య..తో భారీ డిజాస్టర్‌ను ఫేస్ చేసిన అల్లు అర్జున్ -ఈసారి త్రివిక్రమ్‌ను నమ్ముకున్నాడు. త్రివిక్రమ్ -బన్నీ కాంబోలో మొదలైన సినిమా సంక్రాంతిని టార్గెట్ చేసేదే. ముందు దసరా బరిలో సినిమాను దింపాలని అనుకున్నా, ఆ సీజన్‌లో ‘సైరా’ సినిమా వస్తుండటంతో -బన్నీ ప్రాజెక్టు సంక్రాంతికి షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. పూజా హెగ్దె, నిదేవా పేతురాజ్ బన్సీ సరసన ఆడిపాడనున్నారు. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మాతలు.
ఇక నాగార్జున సైతం సంక్రాంతి సెంటిమెంట్‌గా ‘బంగార్రాజు’లా కనిపిస్తాడన్న అంచనాలు లేకపోలేదు. సోగ్గాడే చిన్నినాయినా చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించనున్న చిత్రమిది.
మన్మథుడు -2 శరవేగంగా పూర్తిచేసిన నాగార్జున -బంగార్రాజుకు త్వరలోనే కొబ్బరికాయ కొట్టిస్తాడని తెలుస్తోంది. సంక్రాంతికి హిట్టందుకు సోగ్గాడే.. మారిదిగానే, ఈసారి సంక్రాంతికి ‘బంగార్రాజు’తో హిట్టందుకోవాలని చూస్తున్నాడు నాగ్. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విడుదలకు ముందే ‘సాహో’తో ప్రభంజనం రేపుతోన్న ప్రభాస్ -సంక్రాంతి కోసం మరో సినిమాతో సిద్ధమవుతున్నాడు. ప్రభాస్‌ను పూర్తి రొమాంటిక్ హీరోగా చూపిస్తూ, పూజాహెగ్దె హీరోయిన్‌గా దర్శకుడు రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -జాన్. రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న చిత్రాన్ని -సంక్రాంతి రేసులో నిలపొచ్చని వినిపిస్తోంది.
నిజానికి ఆన్-ఆఫ్ స్క్రీన్ కాంబినేషన్లూ, ప్రకటనలూ ఆడియన్స్‌కి ఊరింపుల్లాంటివే.