మెయిన్ ఫీచర్

ప్రథమం కోసం అనే్వషణ ( ఓషో బోధ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి ఆశలు, అవసరాలు లేకుండా, పూర్తి సంతృప్తితో చాలా హాయిగా, సౌకర్యంగా జీవిస్తున్న ప్రపంచంనుంచి మరో ప్రపంచంలోకి గెంటివేయబడిన శిశువుకు అది మృత్యుసమానమైన అనుభవమే. అది వాడికే తెలుస్తుంది. కాబట్టి, వాడిలా ఆలోచిస్తేనే అది సత్యమని మీకు తెలుస్తుంది.
ఎందుకంటే, పూర్తి రక్షణతో కూడిన అత్యంత సౌకర్యవంతమైన ప్రపంచాన్ని వాడు కోల్పోయాడు. చివరికి శాస్తజ్ఞ్రులు కూడా మాతృగర్భం లాంటి మరొక ప్రపంచాన్ని సృష్టించలేమని ఒప్పుకున్నారు. కానీ, మనిషి తాను కోల్పోయిన మాతృగర్భానికి సమానమైన గృహాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేశాడు. నీటి పరుపులు, వేడి నీళ్ళ స్నానపు తొట్టెలు ఆ ప్రయత్నంలో భాగాలే. తెలివైనవాడు ఆ స్నానపుతొట్టెలలో ఉప్పుకూడా కలుపుతాడు. ఎందుకంటే, తల్లిగర్భంలో అలాగే ఉంటుంది. సముద్రపు నీటిలోని ఉప్పు సాంద్రత కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. కానీ, అలా సృష్టించుకున్న ఆ స్నానపు తొట్టెల్లో మీరు ఎంత కాలముండగలరు? తల్లి గర్భంలో ఉన్నట్లుగా మీరు వాటిలో కచ్చితంగా తొమ్మిది నెలలు ఉండలేరు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ జ్ఞానోదయం పొందినవాడు కాదు. కానీ, నిజానికి, అతడు కాస్త కోకిల లాంటివాడు. కోకిలలు అప్పుడప్పుడు చక్కగా కూస్తాయి కదా! అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అప్పుడప్పుడు చక్కని భావాలు చెప్పేవాడు. ‘‘పురుషుడు స్ర్తితో సంగమించడం కేవలం మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించేందుకే’’అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది చాలా లోతైన భావన. పైకి అది పిచ్చిగా అనిపించినా, అందులో సత్యముంది. కేవలం, సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి పిచ్చివాడే దానిని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకుంటాడు. పురుషుడు ఏ మార్గంనుంచి వచ్చాడో ఆ మార్గం నుంచే గర్భానే్వషణ ప్రారంభిస్తాడు. అయినా అతడు గర్భాన్ని చేరుకోలేడన్నది వాస్తవం. అందుకే పురుషుడు గుహలు తవ్వడం, ఇళ్ళు కట్టడం, విమానాలు చెయ్యడం ప్రారంభించాడు. త్వరలో ఏదో ఒకరోజు విమానాలలో కూడా అందరూ ఉప్పుకలిపిన వేడి నీళ్ళ తొట్టెల్లో తేలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, అవి మీకు తల్లి గర్భంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి. మీట నొక్కగానే ‘‘విమాన పరిచారిక (ఎయిర్ హోస్టెస్)’’ వచ్చి మీకు కావలసినవి చేస్తుంది. అయినా మీకు తృప్తి లభించదు.
శిశువుకు తల్లిగర్భంలో సుఖంగా ఉండడంకన్నా ఏమీతెలియదు. బయటపడ్డ శిశువుకు ఎన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటుచేసినా అవి తల్లి గర్భంలో ఉన్న సుఖానుభూతికి సమానం కావు. ఎందుకంటే, మీట నొక్కే అవసరం లేకుండానే తల్లి గర్భంలో మీకు కావలసినవన్నీ లభిస్తాయి. ఆకలి వేసేలోగానే ఆహారం మీకు అందుతుంది. అలాగే ‘గాలి కావాలి’ అనుకునే లోపే అది మీకు లభిస్తుంది. అక్కడ మీకు ఎలాంటి బాధ్యతలు ఉండవు.
అందుకే తల్లి గర్భంనుంచి బయటకు రావడాన్ని శిశువు మరణంగా భావిస్తాడే కానీ, జననంగా ఎప్పుడూ భావించడు, భావించలేడు. బయట నుంచి చూసేవారు మాత్రమే దానిని జననమంటారు. అలా బయటపడ్డ శిశువు పెరిగి పెద్దవాడై భార్య, పిల్లలు, కుటుంబం, స్నేహితులు, సుఖంగా గడిపేందుకు ఒక చిన్న ఇల్లు, హాయిగా తిరిగేందుకు వాహనం లాంటివి సంపాదించేందుకు తన జీవితాన్ని ధారపోస్తాడు. అంతలోనే అకస్మాత్తుగా వాడు జీవితంనుంచి బయటపడే రోజు ముంచుకొస్తుంది. వెంటనే వైద్యుడు వస్తాడు. వాడుకూడా మీరు పుట్టగానే ఊపిరి పీల్చేందుకు మీ పిర్రపై కొట్టిన వైద్యుడు లాంటివాడే. కానీ, ఈసారి వాడు వచ్చినది మీకు ఊపిరిపోసేందుకు కాదని అందరికీ తెలుసు.
- ఇంకాఉంది
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.