మెయిన్ ఫీచర్

సత్యానికి సదా నిర్భయమే( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుణ్ణి వదలాలంటే చాలా భయంగా ఉందన్నావు. బండరాయి లాంటి ఆ దేవుడి కింద నీ భయాన్ని అణచిపెట్టావు. ఆ బండరాయిని తొలగించిన వెంటనే నీ భయం అదృశ్యమవుతుంది. అప్పుడు దేవుడు కేవలం కల్పన అని తెలుస్తుంది. ఏ ప్రార్థనలు పనిచెయ్యవు. దానితో దేవుడిపై ఉన్న నమ్మకం పోతుంది. ఒకసారి నమ్మకం పోతే అది మళ్ళీ తిరిగిరాదు. కాబట్టి, భయం కలిగినప్పుడు దానిని ఎదుర్కోవాలో కానీ, దానిపై దేవుడి ముసుగు వేసినంత మాత్రాన ఆ భయం పోదు. ఎందుకంటే, అనుమానం వాస్తవం, నమ్మకం కట్టుకథ. సత్యం ముందు ఏ కట్టుకథ నిలబడలేదు. దానితో దేవుడు మీకు కేవలం ఒక కల్పనగానే మిగిలిపోతాడు. దానిని మీరెప్పటికీ మరువలేరు.
తెలిసిన సత్యాన్ని మర్చిపోవడం అసంభవం. అది దాని గుణాలలో ఒకటి. కాబట్టి, దానిని మీరు గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. కానీ, అబద్ధాలను మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేకపోతే, వాటిని మీరు మర్చిపోవచ్చు. సత్యానికి అలవాటుపడ్డ మనిషికన్నా అబద్ధాలకు అలవాటుపడ్డ మనిషికి చాలా జ్ఞాపకశక్తి అవసరం. ఎందుకంటే, సత్యానికి అలవాటుపడ్డ మనిషికి జ్ఞాపకశక్తితో పనిలేదు. మీరు ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే చెప్పే పక్షంలో దానిని గుర్తుంచుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు. కానీ, మీరు అబద్ధాలు మాత్రమే చెప్పే పక్షంలో వాటిని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, మీరు చాలా మందికి చాలా అబద్ధాలు చెప్తారు. ఎవరికి ఏ అబద్ధం చెప్పేరో మీకు గుర్తుండాలి కదా! లేకపోతే, కొంప మునుగుతుంది. పైగా, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అలా అనేక అబద్ధాలు పుట్టుకొస్తూనే ఉంటా యి. సత్యానిది ఎప్పుడూ బ్రహ్మచర్యమే. ఎందుకంటే, అది పెళ్ళిచేసుకోలేదు. అందుకే దానికి పిల్లలు లేరు. కానీ, అబద్ధం బ్రహ్మచారి కాదు. అందుకే అది అనేక అబద్ధాలను పుట్టిస్తుంది. ఎందుకంటే, దానికి కుటుంబ నియంత్రణపై నమ్మకం లేదు.
మతాచార్యులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని మనస్తత్వపరమైన నిరంతర బానిసలుగా చేసేందుకు సృష్టించిన దేవుడు కేవలం ఒక కల్పన అని మీకు అర్థమైన వెంటనే దేవుడంటే మీకున్న భయాలన్నీ పోతాయి. అందుకే మీరెప్పుడూ భయపడుతూ ఉండాలనే వారు కోరుకుంటారు. లేకపోతే, మీరు వారికి చాలా ప్రమాదకారులుగా కనిపిస్తారు. కాబట్టి, మీరు ఆత్మగౌరవం ఏమాత్రం లేనివారుగా, భయపడుతూ లొంగిపోయేందుకు సిద్ధపడే పిరికివారుగా ఉండాలి లేదా నిర్భయులుగా ఉండాలి.
మీరు నిర్భయులైతే దేనికీ తల వంచని తిరుగుబాటు వీరుడవుతారు. దానిని మీరు నివారించలేరు. కాబట్టి, మీరు విశ్వాసమున్న వ్యక్తిగా ఉండాలి లేదా తిరుగుబాటు స్ఫూర్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. మతాచార్యులు, రాజకీయ నాయకులు మీరు తిరుగుబాటు స్ఫూర్తి కలిగిన వ్యక్తిగా ఉండాలనుకోరు.
ఎందుకంటే, మీ తిరుగుబాటు స్ఫూర్తి క్రైస్తవం, జుడాయిజం, మహమ్మదీయం, హిందూత్వాలతో మీ మనసును బలవంతంగా నిబద్ధీకరించే వారి స్వార్థ ప్రయోజనాలను ప్రశ్నిస్తుంది, వ్యతిరేకిస్తుంది. అందుకే వారు మీ అంతర్గతంలో మీరు ఎప్పుడూ వణుకుతూ ఉండేలా చేస్తారు. అదే వారి శక్తి. దానిని కోరుకునే వారికి కాల్పనిక దేవుడు చక్కగా ఉపయోగపడతాడు. ఒకవేళ మీకు దేవుడిపై భయభక్తులుంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తారు, ఆయన పవిత్ర గ్రంథాన్ని చదువుతారు, ఆయన అవతార పురుషులు చెప్పినది చేస్తారు. అలా మీరు ఆయనను, ఆయన ప్రతినిధులను అనుసరించక తప్పదు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.