మెయిన్ ఫీచర్

విజయానికి సంకేతం నిర్భయం (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేవుడు కేవలం ఒక కల్పన’’అని మీరు తెలుసుకున్న వెంటనే వాడిని మీరు వదిలేస్తారు. మీరు భయపడినా, భయపడకపోయినా వాడిని మీరు మళ్ళీ వెనక్కి తీసుకోరు, తీసుకోలేరు. ఎందుకంటే, వాడితో పనిముగిసింది.
ఇప్పుడు భయపడడమొక్కటే మీ ముందున్న మార్గం. కాబట్టి, నిశ్శబ్దంగా అందులోకి ప్రవేశించండి. అప్పుడే మీరు దాని లోతును తెలుసుకోగలరు. అప్పుడు అది అంత లోతుగా ఉండదు.
ఒక కథ చెప్తాను:
‘ఒకడు కొండ అంచున ఉన్న కనుమ దారిలో నడుస్తున్నాడు. మెల్లమెల్లగా చీకటిపడుతోంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అతను కాలుజారి లోయలో పడిపోతూ చేతికి దొరికిన కొండ అంచునే ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడుతూ కిందకు చూడగా ఎక్కడో పాతాళంలో ఉన్న అగాధం అతనికి లీలగా కనిపించింది కానీ, అతని కాళ్ళకిందనే ఉన్న పెద్ద బండరాయి మాత్రం అతనికి కనిపించలేదు. వెంటనే అతను భయంతో ఆ చెట్టుకొమ్మను ఇంకా గట్టిగా పట్టుకుని ఎవరైనా సహాయం చేస్తారేమో అనే ఆశతో ‘‘రక్షించండి, రక్షించండి’’అని గట్టిగా అరిచాడు. కానీ, అతనిని రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరు. అతని మాటలు మాత్రం ఆ లోయనుంచి ప్రతిధ్వనించాయి.అతని చేతులు మండిపోతుండడంతో పట్టు జారిపోతోంది. వేరే దారిలేక, లేని శక్తిని కూడగట్టుకుని అనుక్షణం నరకయాతన పడుతూ ఆ రాత్రంతా అతను అలా ఆ చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు. మొత్తానికి తెల్లారింది. ఆ వెలుగులో అతను మళ్ళీ కిందకు చూడగా అతని కాళ్ళకు ఆరు అంగుళాల కిందనే ఉన్న పెద్ద బండరాయి అతనికి కనిపించింది. వెంటనే అతను దానిపై దిగి ఊపిరి పీల్చకున్నాడు.’’
కాబట్టి, నాకున్న అనుభవంమేరకు భయం లోతు కేవలం ఆరు అంగుళాలు మించి ఉండదని నేను మీకు స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు చెట్టుకొమ్మనే పట్టుకుని రాత్రంతా అవస్థపడుతూ వేలాడాలా లేక దాన్ని వదిలేసి మీ కాళ్ళపై మీరు నిలబడాలా అనేది మీ ఇష్టం. అది మీ చేతుల్లోనే ఉంది. నిజానికి భయపడేందుకు ఏమీలేదు. కాబట్టి, దేనికీ భయపడకండి.
***
నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా తెలిసినది వదులుకుని, తెలియని దానిలోకి ప్రవేశించినపుడే భయం బయలుదేరుతుంది. అట్లా భయపడకుండా కొత్తదాన్ని కూడా ఆహ్వానించడమే అంటే అందులో ప్రవేశించడమే ధైర్యం. కనుక తెలిసిన దాన్ని వదులుకునేందుకు, తెలియని దానిలోనికి వెళ్లేందుకు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారే నిర్భయస్తులు, దైర్యవంతులు ఇట్లా వారిని ఏవిధంగా నైనా పిలుచుకోవచ్చు.
కాని అందరూ అంటే చాలామంది తెలిసిన దానిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పూర్తిగా తెలిసిన దానిలో భద్రత కనిపిస్తుంది ఇదిగో ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఇది నిశ్చయంగా తెలుస్తుంది. కనుక దీన్ని చేయడానికే ఇష్టపడుతారు కానీ ఫలితమేమి వస్తుందో తెలియక పోతే దాన్ని నిర్భయంగా చేయడానికి చాలామంది జంకుతారు. ఈ జంకడమే భయం.
జీవన్మరణాల మధ్య వేలాడే స్థితి ఏర్పడినపుడు గతం ఏమాత్రం గుర్తుకురాదు. భవిష్యత్తుపైన ఏలాంటి కోరికా ఉండదు. దీనినేవర్తమానం అంటారు. ఈ వర్తమానాన్ని జాగ్రత్త ఆలోచించి మెలిగితే గతం గురించి బాధ ఉండదు. భవిష్యత్తు గురించీ బెంగ ఉండదు. ధైర్యంగా నిశ్చయంగా ముందుకు అడుగువేయలా వద్దా అనే సంశయాన్ని వీడండి. ధైర్యమెప్పుడూ విజయాన్ని కలుగుచేస్తుంది. కనుక ధైర్యంగా ముందుకు వెళ్లండి. దేనికీ భయపడకండి.
అయపోయంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.