మెయిన్ ఫీచర్

ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా పెరుగుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలం, చలికాలం రాబోతుంది. అంటే ఆస్తమా బాధితులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. వివరాల్లోకి వెళితే.. భారతదేశంలో పదకొండు ఏళ్లలోపు చిన్నారుల్లో నూటికి ఐదు నుంచి పదిహేను మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్లమంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో ఒక్క భారతదేశంలో 1.5 నుంచి రెండు కోట్ల మంది ఉన్నట్లు అంచనా.. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసంతో ఒక్క 2015లోనే 3, 83, 000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ప్రపంచాన్ని ఇంతగా కలవరపెడుతున్న ఆస్తమా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? అని ఆలోచిస్తే..
కారణాలు
* దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఉబ్బసం ఒకటి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయునాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది.
* గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పనిచేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది.
* గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఈ రుగ్మత ఏ వయసువారికైనా వస్తుంది. అయితే, చిన్న పిల్లలు, యుక్తవయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
* భారతదేశంలో ఐదు నుంచి పదకొండు ఏళ్ల వయసు పిల్లల్లో ఐదు శాతం నుంచి పదిహేను శాతం మంది ఉబ్బసంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కెరోలిన్ దీవుల్లో యాభై శాతం మందికి పైగా చిన్నారులు ఆస్తమా బాధితులే.. బ్రెజిల్, కోస్టారికా, పనామా, పెరూ, ఉరుగ్వే దేశాల్లో ఇరవై శాతం నుంచి ముప్ఫై శాతం , కెన్యాలో ఇరవై శాతం మంది చిన్నారులు బాధితులే.. ఆస్ట్రేలియాలో పదహారు ఏళ్లలోపు ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు ఆస్తమా బారిన పడుతున్నారు.
* వాయుగొట్టాలు ఉబ్బడం వల్ల ఆస్తమా వ్యాధి వస్తుంది. అయితే ఆ గొట్టాల్లో వాపు రావడానికి కారణమేంటన్న విషయం మాత్రం శాస్తవ్రేత్తలకు కూడా స్పష్టంగా తెలియదు. కానీ ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యమైన విషయాలు కూడా ఆస్తమా రావడానికి కారణమని భావిస్తున్నారు.
* చర్మవ్యాధులు ఉన్న చిన్నారులకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువ.
* తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
* ధూమపానం, మద్యపానం, వాయుకాలుష్యం, రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఉబ్బసం వస్తుంది.
* తల్లికి పొగతాగే అలవాటు ఉన్నా దాని ప్రభావం కడుపులో బిడ్డపై పడి, అది ఆస్తమాకు దారితీసే అవకాశముంది.
* దుమ్ము, ధూళి, జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, పువ్వుల్లోని పుప్పొడి రేణువులు, గడ్డిపోచలు, బూజు వంటివి అలర్జీకి కారణమవుతాయి. ఇది ఆస్తమాకు దారితీస్తుంది. జలుబు వంటి వైరల్ ఇనె్ఫక్షన్లు వల్ల కూడా రావచ్చు.
* జర్మనీలో నలభై లక్షల మంది, జపాన్‌లో ముప్ఫై లక్షల మంది దాకా ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. వారంలో మూడుసార్లు ఫాస్ట్ ఫుడ్ తినే చిన్నారులకు ఆస్తమాతో పాటు చర్మవ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశముందని ఓ అధ్యయనంలో తేలింది. అరవై దేశాలకు చెందిన ఐదు లక్షలమందికి పైగా చిన్నారులపై ఆ అధ్యయనం నిర్వహించారు. తీసుకునే ఆహారం వల్లనే ఎక్కువ మంది పిల్లలు ఆస్తమా లాంటి రుగ్మతల బారిన పడుతున్నారని తేలింది. బర్గర్ల వంటి ఫాస్ట్ఫుడ్ పదార్థాలు తీవ్రమైన ఆస్తమా, చర్మవ్యాధులకు కారణమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
నివారణ
* విటమిన్ ‘డి’ ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చు.
* ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఇవి వాయునాళం కండరాలను వదులు అయ్యేలా చేస్తాయి. ఈ మందులను వేసుకునేందుకు ఇన్‌హేలర్ పరికరాన్ని వెంటే ఉంచుకోవాలి.
* ప్రివెంటర్లు వాయునాళాల కండరాల వాపును తగ్గించి, శ్వాసకు ఇబ్బంది లేకుండా చేస్తాయి.
* ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుని సలహా మేరకు కొన్నిసార్లు స్టెరాయిడ్లు కూడా వాడాల్సి రావచ్చు.