మెయన్ ఫీచర్

వామపక్షాల శకం ముగుస్తోందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దం క్రితం వరకు భారత రాజకీయాలలో వామపక్షాలు నిర్ణయాత్మక పాత్ర వహిస్తూ వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర వహించాయి. జాతీయ స్థాయిలో వా మపక్షాలు లేకుండా ఎటువంటి రాజకీయ కూటమి ఏర్పాటైనా ప్రయోజనం ఉండబోదనే అభిప్రాయం ఉండేది. భాజపాతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవగాహనకు వస్తే వామపక్షాలకు కోపం వస్తుందనే భయంతో చాలా రాజకీయ పక్షాలు భాజపాను దాదాపు అంటరాని రాజకీయ పక్షంగా చూస్తూ వచ్చాయి. 1989లో కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వానికి వామపక్షాలు ఒక వైపు, మరోవైపు భాజపా బయటనుండి మద్దతు ఇచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగాయ. 2004లో అయితే కేంద్రంలో వామపక్షాల మద్దతుతోనే కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు అయంది. అటువంటి చారిత్రాత్మక పాత్ర వహించిన వామపక్షాలు నేడు జాతీయ రాజకీయాలలో కనుమ రుగవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుత 17వ లోక్‌సభలో వామపక్షాలకు చెందిన సభ్యులు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. వారిలో రెండు ప్రధాన వామపక్షాలకు చెందిన సభ్యులు ఇద్దరేసి చొప్పున తమిళనాడు నుండి డీఎంకే పొత్తుతో ఎన్నిక కాగా, సొంతబలంతో కేవలం ఒక్క స్థానమే కేరళ నుండి సీపీఎం గెలుచుకుంది. ఒకప్పుడు వామపక్షాలకు కంచు కోటగా సుదీర్ఘకాలం రాజ్యమేలిన పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వాటి పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. 2015లో సిపిఎం, సిపిఐల జాతీయ నాయకత్వంలో మార్పు వచ్చిన తర్వాత, రెండు పార్టీలకూ ఇద్దరు తెలుగు వారే నేతృత్వం వహిస్తున్న సమయంలో- వారిద్దరూ నేడు దేశ రాజకీయాలను ఏమాత్రం ప్రభావితం చేయలేక పోవడం ఆసక్తి కలిగిస్తున్నది. ఈ పరిస్థితిని 1991లోనే అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి కెఎన్ గోవిందాచార్య గుర్తించారు. రెండు వామపక్షాలకు భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు. అందుకు ఆయన చెప్పిన ప్రధాన కారణం రెండు పార్టీలకు ప్రజా ఉద్యమాలలో ఆరితేరిన రెండో తరం నాయకత్వం లేకపోవడమే అని చెప్పుకొచ్చారు. ఇప్పుడది నిజమవుతున్నది. చారిత్రక తప్పిదాలు చేస్తూ అవకాశాలు చేజారిపోయిన తర్వాత చెంపలు వేసుకోవడం మన దేశంలోని వామపక్షాలకు అలవాటు. ఈ మధ్య కాలంలో ఆ విధంగా రెండు పొరపాట్లు చేశారని చెప్పవచ్చు. 1996లో యునైటెడ్ ఫ్రంట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం చిక్కినప్పుడు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరును అన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించాయి. అయితే నాడు సిపిఎంలో అత్యధిక సభ్యులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ విధంగా తిరస్కరించడాన్ని చారిత్రక తప్పిదం... అంటూ ఆ తర్వాత జ్యోతిబసు స్వయంగా అభివర్ణించారు. నిజంగా ఆనాడు జ్యోతిబసు ప్రధాన మంత్రి పదవి చేపట్టిఉండే కనీసం ఒక దశాబ్దకాలం పాటు ఆ ప్రభుత్వం మనుగడ సాగించే అవకాశం ఉండేది. బీజేపీ బలోపేతం కావడానికి ఆస్కారం ఏర్పడేది కాదేమో. ఆ తర్వాత చేసిన రెండో ఘోర తప్పిదం- అణు ఒప్పందం కుదుర్చుకున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని బిజెపితో చేతులు కలిపి మరీ ప్రతిపా దించడం. అప్పటి నుండే జాతీయ రాజకీయాలలో వామపక్షాల ప్రాధాన్యత తగ్గుతూ రావడం గమనార్హం.
ఆనాటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ నుండి అనేకమంది మార్క్సిస్టు మేధావుల వరకూ- ‘ప్రజలకు నే రుగా సంబంధం లేని అంశంతో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా అప్రదిష్టపాలు కావలసి వస్తుంద’ని హెచ్చరించినా సీపీఎం నేత ప్రకాష్ కారత్ లెక్కచేయలేదు. చివరకు అదే జరిగింది. అధిక ధరలు, రైతాంగ సంక్షోభం వంటి... ప్రజలను నేరుగా ప్రభావితం చేసే అంశాలపై గొంతెత్తి ఉంటే వామపక్షాలు ఇంతగా బలహీనమై ఉండేవి కావేమో!
ఇప్పుడు సిపిఎం, సిపిఐల ఉమ్మడి ఓట్లు 2.3 శాతానికి పడిపోయాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఇంతటి దుస్థితిలో వామపక్షాలు చిక్కుకున్నట్లు లేదు. 2014లో వామపక్షాలకు చెందిన వారు 12 మంది లోక్‌సభకు ఎన్నిక కాగా, ఇపుడు వారి సంఖ్య 5కు పడి పోయింది. త్రిపుర, బెంగాల్‌లలో వామపక్షాలు మూడో స్థానానికి పడిపోయాయి. బెంగాల్‌లో అయితే 40 మంది పోటీ చేస్తే, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు సహా చాలామంది అభ్యర్థులు మూడు లేదా నాలుగో స్థానానికి పరి మితమయ్యరు. ఒక్కరు తప్ప అందరూ డిపాజిట్ కో ల్పోయారు. ఇది దారుణమైన పరిణామమని చెప్పవచ్చు. 2014లో 31 శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్షాలు పశ్చిమబెంగాల్‌లో 2016 అసెంబ్లీ ఎన్నికలలో 26 శాతానికి పడిపోగా, ఇప్పుడు 7.4 శాతానికి దిగజారాయ. గత ఆరు దశాబ్దాలలో ఏనాడూ ఇంత దారుణంగా ఓట్లు వచ్చి ఉండవు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 32 నుండి 22కు పడిపోయినా ఓట్ల శాతం మాత్రం పెరిగింది. బీజేపీ వోటుతం 2014లో 17 శాతం ఉండగా, 2016లో 10 శాతానికి పడిపోగా, ఇప్పుడు ఒకేసారి 40 శాతానికి పెరిగింది. అంటే సిపిఎం, కాంగ్రెస్ ఓట్లు భాజపాకు మారినట్లు స్పష్టం అవుతోంది.
నేడు వామపక్షాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రజలను ముఖ్యంగా కార్మికులు, కూలీలు, అణగారిన వర్గాల ప్రజలను సమీకరించి, వారి సమస్యలపై పోరాడే నాయకత్వం కనిపించడం లేదు. గత ఐదేళ్లల్లో వారు దేశంలో చెప్పుకోదగిన ఉద్యమాలు చేయనే లేదు. మీడియా కార్యక్రమాలకు పరిమితం అవుతున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి చోట్ల కొన్ని రైతాంగ పోరాటాలలో కీలక పాత్ర వహించినా పరిమిత ప్రభావమే చూపాయి. వామపక్షాలతో నూతన నాయ కత్వం కనిపించడం లేదు. ఒకనాడు కార్మిక సభలలో వారిదే పట్టుగా ఉండేది. అనేకమంది ప్రముఖ వామపక్ష నేతలు కార్మిక నేతలుగా వెలుగులోకి వచ్చినవారే. కానీ ఇప్పుడు బ్యాంకులు వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో తప్ప వారికి కార్మిక సంఘాలలో చెప్పుకోదగిన బలం లేకుండా పోయింది. కార్మికులలో వారి పలుకుబడి తగ్గిపోయింది. అట్లాగే విశ్వవిద్యాలయాలలో వామపక్షాల ప్రభావం తగ్గిపోతున్నది. ఇప్పుడు డిజిటల్ యుగంలో ప్రచార, సమాచార వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. నూతన సాంకేతికత చోటు చేసుకొంటున్నది. అందుకు తగిన ఎత్తుగడలను రూపొందించు కోవడంలో వా మపక్షాలు బాగా వెనుకబడుతున్నాయి. ముఖ్యంగా బిజెపి వ్యతిరేక ధోరణిలో కాంగ్రెస్‌తో అనుసరించ వలసిన వైఖరి పట్ల ఈ పార్టీలు గందరగోళ పరిస్థితులను ఎదు ర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయినందున వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, బెంగాల్ ఒక అవగాహనకు వచ్చి ఉంటే బిజెపికి ఇంతటి భారీ విజయం ఆ రాష్ట్రంలో లభించే అవకాశం ఉండేది కాదు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో అవగాహన ఏర్ప రచుకోవడం ద్వారా బిజెపిని కొంతమేరకు కట్టడి చేయగలగడం తెలిసిందే.
గతంలో ఒక వంక కాంగ్రెస్, మరో వంక తెలుగు దేశం, మధ్యలో వచ్చిన ప్రజారాజ్యం వంటి పార్టీలు వా మపక్షాలతో పొత్తుల కోసం పోటీ పడగా, ఇప్పుడు ప్రధాన పార్టీలు ఏవీ ఆసక్తి చూపక పోవడంతో వామపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. బిహార్ లోని బెగుసరాయ్ నుండి విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌ను అభ్యర్థిగా నిలబెట్టి సిపిఐ ఒక ప్రయోగం చేసింది. వినూత్నంగా ప్రచారం చేపట్టి ఒక నూతన నాయకత్వం వామపక్షాలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. వివిధ వర్గాల ప్రజలను సమీకరించి వినూత్నంగా ప్రచారం జరిపారు. ముఖ్యంగా కుల, మ తాలకు అతీతంగా యువతరం ప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. వామపక్ష రాజకీయాలలో ఒక తాజాదనం తీసుకు వచ్చారు. ఎన్నికలలో గెలుపొందలేక పోయినా ఒక నూతన ఆశను వామపక్షాలకు కలిగించారు.
వామపక్షాలను సిద్ధాంతరీత్యా తీవ్రంగా వ్యతిరేకించే వారు కూడా- పేద ప్రజల పక్షాన, నిస్సహాయంగా ఉన్న కర్షకులు, కార్మికుల పక్షాన వారు జరిపిన పోరాటాలను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. కానీ నేడు ఆ విధంగా పోరాటం చేయగల సామర్థ్యం వారిలో కనబడటం లేదు. మరోవంక బీజేపీ ప్రభుత్వాలు అం త్యోదయ పేరుతో అట్టడుగు ఉన్న వర్గాలకు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకొని పలు కార్యక్రమాలు చేబడుతూ ఉండడంతో తాను పేదల పక్షపాతినని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకో గలు గుతున్నారు. అందరికీ విద్యుత్, పేద మహిళలకు గ్యాస్ పొయ్యలు, పేద ప్రజలందరికీ ఆరోగ్య బీమా, రైతులకు నగదు బదిలీ... ఈ విధమైన అనేక పథకాల ద్వారా పేద ప్రజలకు మోదీ చేరువకాగలుగుతున్నారు. పైగా నగదు బదిలీ ద్వారా పాలనా యంత్రాంగంలో జరిగే అవినీతి నుండి ఒక విధంగా విముక్తి లభిస్తున్నది. ఈ విధంగా పేద ప్రజలను బిజెపి ఆకట్టుకో గలగడం, వారికి వామపక్షాలు దూరం కావడం జరుగుతున్నది.
1975 ప్రాంతంలోనే చండ్ర రాజేశ్వరరావు వంటి వామపక్ష యోధులు చీలికలు కారణంగా తాము రాజ కీయంగా ప్రాధాన్యత కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. రెండు ప్రధాన వామపక్షాల విలీనం ద్వారానే దేశంలో తిరిగి వామపక్షాలు కీలక పాత్ర వహించగలవని స్పష్టం చేశారు. అప్పటి నుండి రెండు వామపక్షాల విలీనం కోసం సిపిఐ నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నది. కానీ సిపిఎం ఈ విషయంలో విముఖంగా ఉండడంతో విలీనం సాధ్యం కా వడం లేదు. కనీసం ఉమ్మడిగా కూడా ప్రజా పోరాటాలు చేపట్టలేక పోతున్నాయి. వామపక్ష నేతలు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా ఊహలతో కోటలు కట్టడం ప్రారంభించినప్పటీ నుండి రాజకీయంగా ఆ పార్టీల తిరోగమనం ప్రారంభమైనదని చెప్పవచ్చు.

-చలసాని నరేంద్ర 98495 69050