మెయిన్ ఫీచర్

‘తెనుగులెంక’ దృష్టిలో స్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనకట్టల విశ్వవిద్యాలయముల
మాట కొన్నాళ్ళు మంత్రులు మఱచిపొండు
కఱటి మద్య పిశాచి నీ గడ్డనుండి
పాఱద్రోలుడు పడతుల పరువు నిల్వ
- సందేశ సప్తశతి
*
అభినవ తిక్కన’ అనే అపురూపమైన బిరుదాన్ని సభాముఖంగా విసర్జించి ‘తెనుగులెంక’గా (తెనుగు సేవకుడు)గా స్థిరపడ్డ వినయ సంపన్నులు, పరమ నిరాడంబరులు తుమ్మల సీతారామమూర్తిగారు. తుమ్మల సత్యనారాయణమూర్తిగారు భాషా విషయకంగా పరమ నైష్టికులు. నిర్దోష రచనాదీక్షితులు. ఒక అర సున్న జారడానికి, ఒక శకలు రెఫం (బండి రా) మారడానికి అంగీకరింపనివారు. అంతవరకే చూస్తే వారు చాదస్తులని, ఈ కాలానికి పనికిరానివారని అనిపించే అవకాశముంది. కాని వారి వస్తువులను, భావాలను గమనిస్తే పుష్కలమైన సామాజిక స్పృహ, ప్రస్ఫుటమైన ఆధునిక చైతన్యం అగుపిస్తాయి. ఆ ఆధునిక చైతన్యంలోనే వారు హిందూ ధర్మాన్ని పరిశీలించారు. అలా పరిశీలించినపుడు వారికి అస్పృశ్యత ఉండడం అతివకు గౌరవం లేకపోవడం లోపాలుగా కనిపించాయి. వారీ పద్యం రాశారు.
మనుజునొక్కని దేవతా వౌళి జేసి
ఒకని సస్పృశ్యతా దోష నికృతు జేసి
నారి నవమాన భారా ననతను జేసి
దారి దప్పెను హిందూ మతప్రవక్త.
స్ర్తి శ్రేయస్సును వాంఛించిన వారు గనుక స్ర్తి జనోద్ధరణ కోసం పాటుపడిన కందుకూరి వీరేశలింగం పంతులుగారిని ప్రస్తుతించారు ఇలా.
పొత్తులలోని కూనకును బోనె్త బిగించి యనాధ పెండ్లిదే
రెత్తిన మండు ఛాందసుల యేల్చడిపై నసి దూసి దుర్భరా
పత్తుల కోర్చి నెగ్గిన యపార పరాక్రమము గందుకూరి వీ
రోత్తము నెంచెదన్ నవయుగోదయ కారణు సాహీతరుణున్
వీరేశలింగంగారిని ప్రస్తుతించడం అంటే సంస్కరణ దృష్టికి పట్టం కట్టడమే. ఆ సంస్కరణ దృష్టివలన వారికి వరశుల్కం దురాచారంగా కనిపించింది. దాన్ని నిరసించారు ఇలా.
వేయి తెచ్చునతండిరు వేయి తెచ్చు / బోటి నొల్లఁడు కట్నాల మూట లేక / ఆడుఁదనమున కిది శిక్షయా? కఠోర / ఘోర జాతీయ దురిత మీ కుటిల కాంక్ష
తెలుగువాళ్ల పెండ్లి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఒక పద్యంలో చెప్పారు. దురాచారాల వలన స్ర్తి అనుభవిస్తున్న వేదనకు చలించిపోవడం తుమ్మల వారిలో వన దశ నండే ఉందేమో అనిపిస్తుంది. వారి మిత్రులు మరణించినపుడు ‘రామకృష్ణస్మృతి’ అనే స్మృతికావ్యం రాశారు. మిత్రుడి ఇల్లాలు వితంతువైన సన్నివేశం వారిని కలచివేసింది. ‘రామకృష్ణస్మృతి’ 1923లో రచింపబడింది అంటే వారి వనంలో. ఇలా స్ర్తిని అవవానించే జాతి తృణీకారయోగ్యమైందని వారి తాత్పర్యం.
అచట నుంద్రు వేల్పు లెచట నారీ సము / దాయమలరు నర్చనీయమగుచు / నాతి పరువు చెఱుచు జాతి చుల్కన కదా / గోచి కంటె గడ్డిపోచ కంటె
అనే పద్యం ఈ విషయాన్ని తెలుపుతుంది. ఈ పద్యం మన సంప్రదాయంలోని ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అనే సూక్తిని గుర్తుకుతెస్తోంది. సాంప్రదాయిక సూక్తిని గుర్తుతెచ్చే తుమ్మలవారిది ఆధునిక చైతన్యం ఎలా ఔతుంది? పాతదంతా రోత అని వివేకహీనంగా తోసిపుచ్చేది కాదు తుమ్మలవారి ఆధునిక చైతన్యం. సంప్రదాయంలోని మంచిని స్వీకరించాలనే వివేకవాతమైన చైతన్యం.
ఈ దృష్టిలోనే తుమ్మలవారు స్ర్తి విషయంలో కర్తవ్యా కర్తవ్యాలను బోధించారు. స్ర్తిలు చేసే దైనందిన కృత్యాలను చులకన చేయకుండా ఆదరించాలనడం వాటిలో ఒకటి. ఆత్మబలం లేనివాడు మాత్రమే స్ర్తిని అబల అంటాడని తుమ్మలవారన్నారు. అబల అనడం మన ఆత్మ బలహీనతను తెలియజేస్తుందని, అలా అనడం సముచితం కాదనే కదా దీని ఆంతర్యం.
ఇటువంటి బోధ మంత్రులకు, అధికారులకు కూడా చేశారు. మంత్రులనుద్దేశించి ఇలా అన్నారు.
ఆనకట్టల విశ్వవిద్యాలయముల
మాట కొన్నాళ్ళు మంత్రులు మఱచిపొండు
కఱటి మద్య పిశాచి నీ గడ్డనుండి
పాఱద్రోలుడు పడతుల పరువు నిల్వ
అని మద్య నిషేధం అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇక అధికారుల్ని హెచ్చరించారు ఇలా-
బడికేగిన గుడికేగిన / మడి కేగిన చాన మాన మర్యాదల వ / చ్చెడి ప్రొద్దులు శంకం బడి / కడుఁగుండు గృహస్థు నేడు కనుఁడధికారాల్
స్ర్తికి భద్రత కల్పించవలసిన అవసరాన్ని వక్కాణించారీ పద్యంలో. ఐతే స్ర్తికింత ప్రాధాన్యం ఎందుకివ్వాలి? ఆమెకున్న విశిష్టత ఏమిటి? అనేదానికి కూడా ప్రస్ఫుటమైన సమాధానం చెప్పారు. ఆమె వ్యక్తిత్వం గొప్పదన్నారు. స్ర్తి వ్యక్తిత్వానికి, ఆమెలోని మాతృత్వానికి పట్టం కట్టారు. అంతేకాదు, అసలు మన ధర్మాన్ని కాపాడేది మగువలే అన్నారు. స్ర్తి వ్యక్తిత్వం గొప్పది గనుక స్ర్తి రచన పురుషుడి రచనకంటె గొప్పదన్నారు. రచనకు, రచన చేసిన వ్యక్తి వ్యక్తిత్వానికి గాఢమైన సంబంధముంటుందన్న సాహితీ నియమాన్ని ఇక్కడ అనుసంధించుకోవాలి. స్ర్తి రచన ఇంత మనోహరంగా ఉండడానికి కారణం ఏమిటి? దానికి సమాధానం ఈ పద్యంలో వుంది.
నిక్కమైన కైత దక్కె గీర్వాణంబు / ముదురకుంట నీకు మృదుల మగుచు / ఓసి పల్లెటూరి సోదరీ! నీ పల్కు / సాజయైన తెనుగు సౌరు కుల్కు - అని. ఈ పద్యంలో తుమ్మలవారి తెలుగు పలుకు బులుపు కూడా వ్యక్తవౌతోంది. స్ర్తి రచనలో ‘సాజయైన తెనుగు సౌరు’ ఉండడానికి కారణం నిఘంటువులకందని తెనుగుమాట తీరు. అతివలకు, అరక దునే్న రైతులకు తెలిసి ఉండడమే. అందుకే కవులకిలా సూచించారు.
తెనుఁగు మాట తీర తెలిసికోవలెనన్న / కోర్కి వెడలినపుడు కొమ్మల నడుగుఁ / డరక దున్నువారి నడుగుడు కవులార! / చాల దిచట గోశసముదయంబు
స్ర్తి విషయంలో తుమ్మలవారి ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఈ అంశమే. స్ర్తి గౌరవ వ్యంజకమైన భావాలు ఇతర కవులు కూడా కొందరు చెప్పారు. ఐతే ఈ అంశాన్నింత ప్రస్ఫుటంగా, విపులంగా చెప్పినవారు లేరని చెప్పవచ్చు. తరువాత చెప్పుకోవలసిన అంశం భార్యా సహకారానికి వారిచ్చిన ప్రాధాన్యం. భార్య సహకారమే భర్తకు నిజమైన సంపద. భార్య సహకారం లేనిదే పురుషుడు పురోగమించలేడని తుమ్మలవారి ఆంతర్యం. అందుకే వారు ఏ విశిష్ట వ్యక్తిని ప్రశంసించినా ఆయన భార్యను కూడా ప్రశంసిస్తుంటారు. స్ర్తిని అబల అనడం సమంజసం కాదని ధ్వనింపజేసిన తుమ్మలవారు స్ర్తిల తడాఖా చూపి పురుషులను హెచ్చరించారు. స్ర్తిల సామర్థ్యాన్ని తెనుగు చరిత్ర, భారతదేశ చరిత్ర రెండూ చెబుతాయన్నారు. ఇక చైనా భారతదేశంమీదికి దండెత్తి వచ్చినపుడు భారత స్ర్తి శక్తిని ప్రస్తావించి చైనాకు హెచ్చరిక చేశారు. చరిత్రలో స్ర్తి చూపిన బహుముఖ శక్తి సామర్థ్యాలకు ఉదాహరణలు కూడా చెప్పారు. ఇంకా బాలచంద్రుడి తల్లి ఐతమ్మ మాతృహృదయాన్ని బాలచంద్రుడికి పౌరుషోద్దీపకమైన అన్నమ్మ ఉద్రేక ప్రవృత్తిని రచితాఖండికలలో చిత్రించారు. ‘మహాత్మకథ’లో ‘గాంధిగానము’లో స్వాతం త్య్ర సంగ్రామంలో పాల్గొన్న స్ర్తిలనూ చిత్రించారు. ‘నా కథ -సీత’ అనే ఖండికలో మంచి యింట పుట్టి మంచి యింటికి కోడలుగా వెళ్లిన స్ర్తిగా సీతాదేవిని చిత్రించారు. అంతేకాక మానవేతర ప్రాణి ఐన కపోతిని సైతం ఉదాత్త స్ర్తిగా చిత్రించారు. ‘ఆత్మార్పణము’ కావ్యంలో ఈ ఆత్మార్పణము కావ్యాన్ని తమ సతీమణికి (అన్నపూర్ణగారికి) అంకితం చేశారు. అంటే తుమ్మలవారు తమ రచనల్లో వ్యక్తంచేసిన స్ర్తి గౌరవాన్ని నిజ జీవితంలోనూ ఆచరించారన్నమాట. తుమ్మలపల్లి ప్రకటించిన స్ర్తి గౌరవం స్వీయాచరణ సమేతమైంది. స్ర్తి విషయంలో వారి ఆలోచనా విధానం పాత కొత్తల మేలికలయిక గలది. వివేకవంతమైన ఆధునిక చైతన్యం గలది, ఉదాత్తమైనది.

- చిటిప్రోలు వేంకటరత్నం 7702358616