మెయిన్ ఫీచర్

అనంత ఫలాలనిచ్చే ఆషాఢం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటంవల్ల ఈమాసానికి ఆషాడం అని పేరు వచ్చింది. ఈ మాసానికే శూన్యమాసమని పేరు. శుభకార్యాలకు యోగ్యమైనది కాదు. ఈ నెలలోనే పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష వహిస్తారు. ఆధ్యాత్మికపరంగా చూస్తేఆషాఢం అనంత కోటి పుణ్యఫలితాలు అందించే మాసంగా పేరొందింది. ఈ మాసం అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనది. గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో గురువారం మొదటి బోనాల వేడుకలు ఆరంభవౌతాయి. ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారు. ఈ మాస శుద్ధ విదియనాడు పూరీ జగన్నాథ రథయాత్ర ఆరంభమవుతుంది. శుద్ధషష్ఠినాడు స్కంధవ్రతం ఆచరించాలని స్మృతి కౌస్త్భుం అనే వ్రత గ్రంథం పేర్కొంది. ఆషాఢ శుద్ధ సప్తమిని భాను సప్తమి అంటారు. పురుషార్థ చింతామణిలో ఈనాడు ‘వివస్వన్నమో భాస్కరస్సోత్పత్తిః’ అని పేర్కొన్నారు. ఇది సూర్యారాధనకు ఉద్దీష్టమైన దినం. తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరను ఘనంగా జరుపుతారు. దీనినే ‘బోనాల పండుగ’, ‘ఆషాఢ జాతర’గా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినే ‘తొలి ఏకాదశి’ అనీ, శయనైకాదశి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశినాడు మహావిష్ణువు క్షీరాబ్దిలో శయనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొందడానికే ఏకాదశీ వ్రతం ఎంతగానో తోడ్పడుతుంది. సతీసక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వ్రతం చేసి భగవంతుని అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.
చాంద్రభాగ నదీ తీరాన పండరీపురం (మహారాష్టల్రో ఉంది)లో కొలువైన విఠలుని ప్రభావం తొలి ఏకాదశినాడే చూడాలి. ఎందుకంటే సతీ సక్కుబాయి ముక్తి పొందింది ఈ ఏకాదశినాడే. ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే, కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత ప్రాశస్త్యం గురించి చెప్పాడట. అంతేగాక ద్వారక నగర వాసులు ఏకాదశ వ్రతాన్ని ఆచరించాలని దండోరా వేయించాడట. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశివరకు (నాలుగు నెలలు) మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు. ఈ కాలంలో నియమ నిష్ఠలలో, ఆహార విహారాది నియమాలలో, నియమబద్ధ జీవనం గడిపేవారు శ్రీహరికి ప్రీతిపాత్రులవుతారని శాస్త్ర వచనం. తొలి ఏకాదశినానాడు ఈ వ్రతాన్ని కొందరు ఆచరిస్తారు.
ఆర్ష వాఙ్మయ మూలపురుషులు వ్యాసభగవానుని జన్మదినం ఆషాడ పౌర్ణమి. ఆషాడ బహుళ అష్టమి రౌచ్య మన్వంతరాది. రేచ్చుడు పదమూడవ మనువు. ఆషాఢ బహుళ అమావాస్య దీప పూజకు ప్రత్యేకమైనది కానీ ఆషాఢమాసం అనారోగ్య మాసం. కొత్తనీరు తాగడంవలన వివిధ రకాల జ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే మాసం. స్ర్తిలు గర్భం ధరించడానికి అనుకూలమైన కాలం కాదు. అనారోగ్య దినాలలో, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం ఉంది. పైగా ఈ మాసంలో స్ర్తి గర్భం ధరిస్తే ప్రసవ సమయానికి మంచి ఎండాకాలం అవుతుంది. అది తల్లి, పిల్లకు ఎండ తీవ్రత మంచిది కాదు. ఈ నాలుగు నెలల్లో ముఖ్యంగా ఆషాడ మాసంలో మనిషి శరీరంలోని సప్త్ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. కావున ఆషాఢమాస నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని సూచించారు.
ఈ మాసంలో వర్షపు నీళ్లు భూమిలోనికి ఇంకి భూమిలో వున్న ఉష్ణం అలా పైకి రావడం మూలాన, ఆ ఉష్ణంలో పెరిగిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కూరగాయలలు తినకూడదనే నియమం పెట్టారు. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం వుంటుంది. దక్షిణాయన ప్రారంభమాసం ఈ మాసంలోనే. ఆషాఢమాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు. ములగ కూర బాగా తినాలని అంటారు. అనపపప్పు వాడాలంటారు.
ఈ మాసంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ మార్పువల్ల కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. లేతాకు గోరింటాకు పెట్టుకోవడంవల్ల బయటి వాతవారణానికి అనుగుణంగా అది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా గోరింటాకుకు ఉంది. గోరింటాకు రసంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దేవుడి ఆశీస్సులు అందవని, అందుకే శుభకార్యాలు ఈ మాసంలో చెయ్యరు. పార్వతీదేవి యొక్క అనేక రూపాలకు ఈ మాసంలో వివిధ రూపాల్లో విశేష పూజలు జరుపుతారు. విజయవాడ కనకదుర్గాదేవికి శాకంబరీ అలంకార ఉత్సవాలు ఈ మాసంలోనే జరుగుతాయి. ఈ మాసంలో మూడవ ఆదివారంనాడు ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనాల జాతర వైభవోపేతంగా జరుపుతారు. యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో తిలకించే పూరీ జగన్నాధ రథయాత్ర జరిగేది ఈ మాసంలోనే. దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంతో ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు శాస్త్రప్రకారం శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ. తొలి ఏకాదశి చాతుర్మాస దీక్ష, గురుపూర్ణిమ, దక్షిణాన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఆషాఢమాసం. మనం కూడా ఆచారాలు పాటిద్దాం. పూజాఫలం పొందుదాం.

- కె. రామ్మోహన్‌రావు 9441435912