మెయిన్ ఫీచర్

చాక్లెట్‌కి ఎన్ని రూపాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్‌ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్‌ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఆలుమగలైనా, అత్తాకోడళ్ళైనా, ఆఫీసులో బాస్ కొలీగైనా చాక్లెట్లవైపు మొగ్గు చూపిస్తే రోజంతా ఆరోగ్యం, ఆనందమే. అజ్టెక్ మూలం ఆధారంగా చాక్లెట్ అంటే చేదు నీరు అని అర్థం. ఐరోపాలో చాక్లెట్ పానీయం గురించి 1520 సంవత్సరం నుండి తెలుసు. యూరోపియన్లకు చాక్లెట్లంటే తెగ ఇష్టం. ప్రపంచం మొత్తంలో సగం చాక్లెట్ల వినియోగం ఐరోపాలోనే జరుగుతుంది. జర్మనీలో ఏటా ఒక్కో మనిషి 11 కిలోల చాక్లెట్లు తింటారట. ప్రపంచ వ్యాప్తంగా క్యాడ్‌బరీ, మార్స్, నెస్లే, ఫెరోరీ, హేర్‌షేస్, లిండిట్, ఎజిస్టాక్స్, ఆర్కార్, మెర్జీ, ఇడ్జీజీ కంపెనీలు టాప్ టెన్‌గా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల విలువైన చాక్లెట్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ‘అసోచామ్’ సంస్థ గణాంకాల ప్రకారం మన గ్రామీణప్రాంతాల్లో చాక్లెట్ వ్యాపారం విలువ 750కోట్ల రూపాయలట సంవత్సరానికి. ఎందుకంటే చాక్లెట్ల రుచుల్లో సుమారు 600 రకాలు ఉంటాయట. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. దీని అర్థం ‘దేవతల ఆహారం’. చాక్లెట్లు మొదటిసారిగా పరిచయం ఐరోపాలో 1550 జూలై 7న జరిగింది. అందుకే ఈ రోజును ‘చాక్లెట్ డే’గా కేటాయించారు. 2009 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నారు. చాక్లెట్ అంటే చాలు ముఖంపై చిరునవ్వు రావాల్సిందే. చాక్లెట్‌కున్న ఆరోగ్య ప్రయోజనాలు గుర్తించి కాబోలు జూలై 7ను ప్రపంచ చాక్లెట్ డేగా పాటిస్తున్నారు. రోజూ ఓ చిన్న చాక్లెట్ తింటే ఎలాంటి హాని ఉండదు సరికదా ఆరోగ్యానికి మంచిదే అంటూ అనేక పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కకోవాలోని టానిన్లు దంతాలమీద పాచిని తొలగిస్తాయి. కకోవాలో ప్రొటీన్లు, కాల్షియం, కాపర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, బి1, బి2, డి, ఇ విటమిన్లు పుష్కలంగా వుంటాయట. చాక్లెట్లలోని ఓలియాన్ ఆమ్లం గుండె జబ్బుల్ని రానివ్వదు. మెదడులో న్యూరోట్రాన్స్‌మీటర్లుగా పనిచేసే సెరిటోనిన్, డోపమైన్ వంటి రసాయనాల విడుదలకు సహకరించడం వల్ల మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. అయితే బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు మాత్రం క్యాలరీలను లెక్కించుకుని తినాల్సిందే. ‘్ఛంపియన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్’గాను దీనికి పేరుంది. చాక్లెట్లు తినడానికి ముందు ఎంపికలో జాగ్రత్తపడాలి. చాక్లెట్లు తింటే సంతోషం కలుగుతుంది. 1840 సంవత్సరంలో క్యాడ్‌బరీ చాక్లెట్ కంపెనీ ప్రారంభమైంది. 1947లోమొదటి చాక్లెట్ బార్‌ని జోసెఫ్ ఫ్రై కనిపెట్టారు. మిల్క్ చాక్లెటంటే ప్రపంచ వ్యాప్తంగా మోజుపడతారు. కానీ మగవారు మాత్రం డార్క్ చాక్లెట్ అంటే ఇష్టపడతారని తేలింది.
నిన్నమొన్నటివరకూ చాక్లెట్ అంటే అందరికీ దీర్ఘచతురస్రాకారంలోనే గుండ్రంగానూ, హృదయాకారంలోనూ, త్రికాణాకారంలోనూ ఉన్నవి మాత్రమే తెలుసు. కానీ ఇపుడు చాక్లెట్లలో దొరకని రూపం లేదు. శుభకాంక్షలు చెప్పే ఏ సందర్భానికైనా చాక్లెట్‌కన్నా తీయని కానుక లేదన్న భావనతో కార్పొరేట్ కంపెనీలు సైతం తమదైన ప్రత్యేకత కనిపించేలా చాక్లెట్ బొమ్మల్ని తయారుచేయించి పంచుతున్నారు.
డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వయసు మీదపడుతున్న సమయంలో కనిపించే లక్షణాలను ఇవి నియంత్రించి యవ్వనంగా కనిపించేలా చేయగలవు. కానీ రోజంతా నచ్చినపుడల్లా డార్క్ చాక్లెట్‌ను తీసుకుంటే బరువు పెరగడానికి కారణం అవుతుంది. చాలా పరిమితంగా ఒకటి రెండు చాక్లెట్లను అదీ ఉదయం మాత్రమే తీసుకునేలా నియంత్రించాలి. సాధారణంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా లాగిస్తారు చాక్లెట్లని.
నిజానికి చాక్లెట్ అంటే మనం షాపుల్లో పిల్లలకి కొనిచ్చే ప్రతిదీ కాదు. కొకొవా గింజల పొడితో చేసిందే అసలైన చాకొలెట్. మిగతావి కేండీలు, టాఫీలు ఇతరత్రా. ఆజ్‌టెక్ నాగరికతకు చెందిన ‘జాకోటల్’అనే పదం నుంచి చాక్లెట్ అనే పదం ఏర్పడింది. వివిధ దేశాల్లో ఇష్టంగా తినే వైట్ చాక్లెట్ నిజానికి చాక్లెట్ కాదు. తీపి పాళ్లు ఎక్కువగా వుండే ఈ వైట్ చాక్లెట్ ఒక చాక్లెట్ రకం మాత్రమే. ప్రపంచం మొత్తంమీద చాక్లెట్స్‌ని అధిక సంఖ్యలో విక్రయించే ప్రదేశం బ్రసెల్స్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ఏడాదికి 800 టన్నుల చాక్లెట్స్‌ని విక్రయిస్తారు.
నలుపు రంగు చాక్లెట్ తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందట. చాక్లెట్ తింటే కోపం, ఒత్తిడి మాయం. మెదడు చురుకుగా ఉంటుందట. ఆలోచనా ప్రక్రియ మెరుగుపడుతుందని అమెరికన్ విశ్వవిద్యాలయం, దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం, లగ్జెంబర్గ్ ఆరోగ్య సంస్థవారు సంయుక్త పరిశోధనలో వెల్లడించింది. చాక్లెట్స్ తరుచుగా అధికంగా తీసుకునే వారి జ్ఞాపకశక్తి, పరిశీలన, విశే్లషణ సామర్థ్యం, సమన్వయం తదితర అంశాల్లో మంచి ప్రతిభ చూపారని తెలిపింది. పొట్ట తగ్గడానికి రోజుకో డార్క్ చాక్లెట్ తినాలట. కోకో శరీరంలో కొవ్వును ఖర్చు చేస్తుంది. రోజుకో చాక్లెట్ తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్లలో వుండే కాల్షియం, మెగ్నీషియం, ఎముకల దృఢత్వాన్ని కల్గిస్తాయి. రక్తంలో షుగర్ శాతం తగ్గినట్లయితే చాక్లెట్ తినడం మంచిది. దంతాలు చెడిపోతాయని భయంతో చాక్లెట్లు తినరు. చిన్నపిల్లలను కూడా తిననివ్వరు. ఏదైనా పరిమితంగా తింటే మంచిది. కాబట్టి శుభాకాంక్షలను తెలిపే సమయంలో పిల్లలకు చాక్లెట్లను వివిధ రూపాల్లో లభించేవి ఇవ్వాలి. అందుకే అందరికీ చాక్లెట్ డే గురించి వివరించాలి.

- కె. రామ్మోహన్‌రావు 9441435912