మెయిన్ ఫీచర్

ముసురు వేళల్లో ఇవి తింటే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసురువేళల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. చికున్ గున్యా, డెంగీ, వైరల్ జ్వరాలు వెన్నంటే వస్తుంటాయి. ఈ కాలంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఇంట్లోనివారిని కాపాడుకోగలం. ఈ కాలంలో లభించే పండ్లను తీసుకోవటానికి చాలా మంది ఇష్టపడరు. అసలు ముసురు వేళల్లోనే పండ్లు చౌకగా లభ్యమవుతాయి. మార్కెట్లో లభించే తాజాపళ్లను తినటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రతిరోజూ ఇంట్లో వండుకునే ఆహారంలో కొన్నింటిని తప్పనిసరిగా చేర్చటం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి బయటపడవచ్చని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.
సూప్స్ :ప్రతిరోజూ ఫ్లూయిడ్స్, సూప్స్ తీసుకుంటే ఎంతో మంచిది. వేడి వేడి సూప్స్ తీసుకోవటం వల్ల జలుబు, ఫ్లూ వంటి వాటిని దరిచేరనీయవు. వీటితో పాటు హెర్బల్ టీ, మసాలా టీ వంటి వేడి పానియాలతో పాటు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ తదితరవాటిని కూడా సేవిస్తే మంచిది.
మరికొన్ని: అలాగే ఒక్కసారైనా కృష్ణ తులసి ఆకులు, కాకరకాయలు తినటం మంచిది. నిమ్మరసం, పాలకూర, మెంతికూర, ఎర్ర మిరియాలు ఆహారపదార్థాల్లో వేసుకుని తింటే వర్షాల వల్ల తలెత్తే ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి బయటపడతాం. గోధుమలను ఆహారంగా తీసుకోవటం మరిచిపోవద్దు.
వర్షాకాలంలో సీజనల్‌గా వచ్చే తాజా పండ్లు తీసుకోవటం వల్ల విటమిన్ సి అందుతుంది. ఆరెంజ్, ఆపిల్, దానిమ్మ, పైనాపిల్, నిమ్మ, ఉసిరి, బేరి పండ్లను తీసుకోవటం ఎంతో మంచిది. సి విటమన్ లభిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరం వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
తేలికగా జీర్ణమయ్యే గోధుమలు, బ్రౌన్ రైస్, బ్రెడ్, ఓట్స్ వంటివి తీసుకోవాలి.
షుగర్, స్థూలకాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం ఉంటే ఇమ్యూన్ వ్యవస్థను బలహీనం చేసే బాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. జలుబు, ఫ్లూ ఉన్నట్లయితే అసలు పంచదార వస్తువులనే తీసుకోకపోవటం మంచిది.
చినుకులు పడుతున్న వేళలో వేడి వేడిగా రోడ్డుపక్కనే ఉన్న పచ్చి మిరపకాయ బజ్జీ వంటి స్నాక్స్‌కు దూరంగా వుంటే మంచిది.
కాల్చిన, ఉడకబెట్టిన ఆహారపదార్థాలనే తీసుకుంటే కడుపునొప్పి వంటి బాధలు ఉండవు.
కాబట్టి రెండు మూడు నెలల పాటు మనం రోజూవారీ తీసుకునే ఆహారపదార్థాల విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం పాలుకాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
వెల్లుల్లి :ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడు ఉంది. దీనికి వంటల్లో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే కూరల్లో వెల్లుల్లి వాడండి. తాజా వెల్లుల్లి పేస్ట్ వాడటం వల్ల ఇది శరీరానికి యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తోంది.
పాలల్లో పసుపుపొడి కలుపుకుని తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్లు తలెత్తవు. జలుబు, జ్వరం దరిచేరవు.