మెయిన్ ఫీచర్

టెన్నిస్ యువ సంచలనం గాఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిక్కిరిసిన స్టేడియం..
ప్రేక్షకుల కేరింతలు..
ఎదురుగా తల్లిదండ్రులు..
ఐదుసార్లు వింబుల్డన్ గెలిచిన టెన్నిస్ రాణి వీనస్ విలియమ్స్ ప్రత్యర్థి..
అయినా ఏమాత్రం బెదరలేదు ఆమె. చేతిలో రాకెట్‌తో మాయాజాలం చేసింది. 6-4, 6-4తో వీనస్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఆమే కోరి కోకో గాఫ్. వీనస్‌నే ఓడించిందంటే ఎవరో గొప్పావిడే అనుకుంటున్నారు కదూ.. కానీ ఈమె వయస్సు కేవలం పదిహేను సంవత్సరాలే.. వింబుల్డన్‌లో అమెరికన్ టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌పై విజయం సాధించిన టెన్నిస్ యువ సంచలనం కోరి కోకో గాఫ్‌కు కెరియర్‌లో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి కావలసిన అన్ని నైపుణ్యాలు ఉన్నాయని గ్రాండ్‌స్లామ్ మాజీ చాంపియన్లు అభిప్రాయపడుతున్నారు. 1968లో ఓపెన్ శకం ప్రారంభమైన తర్వాత వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా 15 సంవత్సరాల 122 రోజుల వయసున్న గాఫ్ రికార్డులకెక్కింది.
అట్లాంటాలో పుట్టిన గాఫ్ ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే టెన్నిస్ ఆడటాన్ని మొదలుపెట్టింది. గాఫ్ టెన్నిస్ నేర్చుకోవడానికి ఫ్లోరిడాకు వెళ్లింది. గాఫ్ కుటుంబ నేపథ్యం కూడా ఆటలతో కూడుకున్నదే.. అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్శిటీలో ఒకప్పుడు బాస్కెట్ బాల్ ఆడిన తండ్రి కోరేనే గాఫ్‌కు శిక్షణ ఇచ్చాడు. తల్లి కాండీ కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోకి మారకముందు ఓ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి. రెండు సంవత్సరాల క్రితం నుంచి వీరి కుమార్తె గాఫ్ ప్రధాన వేదికలపై తమ ప్రతిభ చాటుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతానికి గాఫ్ జీన్-క్రిస్టోఫె పారెల్ దగ్గర శిక్షణ పొందుతోంది. పదమూడు సంవత్సరాలకే యూఎస్ ఓపెన్ గర్ల్స్ సింగిల్స్ ఫైనల్‌కు చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది. గత సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలకే ఫ్రెంచ్ ఓపెన్‌తో సమానమైన టైటిల్ గెలిచింది. ఈ సంవత్సరం ఎలాగైనా వింబుల్డన్‌కు అర్హత సాధించాలనేది గాఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆమె 301వ ర్యాంకులో ఉండటంతో అది సాధ్యం కాలేదు. కానీ తనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. అర్హత పోటీ తుది రౌండ్‌లో గాఫ్ 6-1, 6-1తో బెల్జియంకు చెందిన 129 ర్యాంకు క్రీడాకారిణి గ్రీట్ మినెన్‌పై నెగ్గింది. సైన్స్ పరీక్ష రాయడం కోసం ముందు రోజు రాత్రి పదకొండు వరకూ చదువుతూనే ఉన్న గాఫ్, ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సాధన చేయలేదు కూడా.. చిన్నప్పటి నుంచీ గాఫ్‌కు విలియమ్స్ సిస్టర్స్ అంటే ఎంతో అభిమానం. మొదటి రౌండ్‌లో వీనస్‌తో డ్రా అని తెలియగానే గాఫ్ తన కెరియర్ ఎదుగుదలపై దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌లో గాఫ్ త్వరగానే కుదురుకుంది. తొలిసెట్‌ను బ్రేక్ చేసి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లడం, రెండో సెట్లో 5-4 ఆధిక్యంలో సెట్‌ను బ్రేక్ చేసిన తర్వాత సర్వీస్‌లోనే విజయం సాధించింది. దీంతో గాఫ్ పుట్టకముందే గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన వీనస్‌పై అపురూప విజయం సాధించింది. విజయం సాధించిన తరువాత ఆ విషయాన్ని నమ్మలేని గాఫ్ కాసేపు షాక్‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు గాఫ్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు కూడా ఆమె ఆటతీరుకు ఫిదా అయిపోయారు. ప్రశంసల వర్షం కురిపించారు. ముందుముందు గాఫ్ మరెన్నో విజయాలు సాధిస్తుందని, టెన్నిస్ చరిత్రలో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతుందని వారంతా ప్రశంసిస్తున్నారు. *