మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఆహ్వానాన్ని అందుకొన్న భూపతులందరూ దమయంతిపై కోరికతో మదనపీడితులయ్యారు.
అతివేగంగా స్వయంవర ప్రదేశానికి చేరారు. సువర్ణమణిమయ స్తంభాలతో మనోహరంగా ప్రకాశిస్తూ కాంతివంతమైన తోరణాలుగల ముఖ ద్వారాలతో విరాజిల్లే స్వయంవర సభారంగాన్ని రాజులందరూ ప్రవేశించారు. ఆ స్వయంవర సభలో రకరకాల ఆసనాలు ఏర్పాటుచేయబడ్డాయి. సువాసనగల పూల దండలు, సకలాభరణాలు ధరించి వచ్చిన రాజులందరూ సభాస్థలంలోని ఆసనాలపై ఆశీనులయ్యారు. ముంగురులు, చక్కని నాసికలు, విశాలమైన నేత్రాలు తీర్చిదిద్దిన కనుబొమలు కలిగిన రాజుల ముఖాలు ఆకాశంలోని నక్షత్రాలవలె ప్రకాశిస్తున్నాయి.
అంత అతిలోక సౌందర్యరాశి అయిన దమయంతి తన శరీర లావణ్యంతో అచ్చట చేరిన రాజుల కన్నులనూ, మనస్సులనూ చూరగొంటూ స్వయంవర మంటపంలోనికి హంస నడకతో ప్రవేశించింది. తన చేతులలో తెల్లని పూదండ నొకదానిని పట్టుకొని వచ్చింది. రాజులందరూ ఆ దమయంతి సౌందర్యాతిశయాన్ని చూచి నిశే్చష్టులయ్యారు. శిల్పాలను తలపించారు.
అంత ఆ సభాస్థలిలో ఆశీనులైన రాజుల పేర్లు ఒక్కొక్కటిగా వివరించబడ్డాయి.
పెండ్లి కూతురుకు వచ్చిన రాజులలో ఎవరెవ్వరో చెప్పవలయును. మానవ లోకమునందు గల సర్వరాజుల గురించి చెప్పుటయే కష్టము. అందును పాతాళ లోకమునుండి, స్వర్గమునుండి వరులు వచ్చినచో వారెవ్వరెవ్వరో యెవ్వరికి తెలియును. అట్లు తెలియజెప్పుట యెవరికి సాధ్యం. ఒక్క ‘వాగ్ధేవి’అయిన సరస్వతీదేవికి తప్ప మరెవ్వరికి వీరి వృత్తాంతములు తెలియనగును.
అందుచేత దమయంతి తండ్రి అయిన ‘్భమమహారాజు’ మూడు లోకములకు తల్లియైన సరస్వతీదేవిని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమైంది. ఆమె సరస్వతీదేవియని గుర్తించి అందరూ వంగి నమస్కరించారు. తదుపరి ఆ వాగ్దేవి అయిన సరస్వతీదేవి స్వయంవరానికి వచ్చిన వారినందరిని దమయంతికి ఈ విధంగా పరిచయం చేసింది.
సరస్వతీదేవి దమయంతిని వెంటనిడుకొని స్వయంవరానికి వచ్చిన దేవతల రాజుల వివరాలను తెలుపుతుంది.
దేవతలు
ఓ లలనా! దమయంతీ! వీరు వేలుపులు. ముప్పది మూడు కోట్ల దేవతలు. వీరందరి గురించి పొగడుటకు వేల కొలది సంవత్సరాలు పట్టును. అందువలన అంతటి గొప్పవారిని వరించు బుద్ధిగలదేని వీరిలో ఒకరిని వరించదగును. కల్పవృక్షములు, ఇంటి తోటలు, వీరి వినోదములకు, విశ్రాంతి గొనుటకు స్థానములు’’ అని వివరించింది.
దమయంతి వారిని చూచి వారికి నమస్కరించి ఏమియు పల్కక ముందుకు సాగింది. అంత ఆ వాగ్దేవి దమయంతికి పన్నగాధ్యక్షుడైన ‘‘వాసుకి’’ని చూపి
‘‘ఓ పద్మముఖీ! వరాటరాజపుత్రీ! ఈతడు పన్నగశ్రేష్ఠుడైన ‘‘వాసుకి’’. మహనీయుడు. శివప్రియుడు. సదా శంభు సేవాసక్తుడు. గజగమనా! ఈ భుజగ విభుడు శివుని చేతికి కంకణము వంటివాడు. వరణీయుడు. ఈతని వరించు.’’
అని వాణి అనగా దమయంతి ఆ పన్నగ శ్రేష్ఠునికి నమస్కరించి మెల్లగా ముందుకు సాగింది. తదుపరి వాగ్దేవి బారులుదీరి ఆశీనులైయున్న సప్తద్వీపరాజులను చూపగా దమయంతి వారిని చూచింది. సరస్వతీదేవి వారిని చూపి
సప్తద్వీపరాజులు
దమయంతీ! వీరు సప్తద్వీప రాజులు. సూర్యచంద్ర వంశస్థులు. రూపవంతులైనవారు. ఉత్సాహంతో వచ్చారు.
పుష్కర ద్వీపాధిపతి
పద్మదళాయతాక్షీ! ఈ నృపుడు ఇంద్రుని వంటివాడు. ఇతడు పాలించు దీవి ‘పుష్కరద్వీపము’.
- ఇంకాఉంది