మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాతమైన యైశ్వర్యముగల భూలోక స్వర్గము. ఈతని వరింపుము. ఇంద్రుని భార్య శచీదేవి యంతటి భాగ్యశాలివగుదువు. మంచినీళ్ళచేత చల్లని నేలగల మఱ్ఱిచెటుట చాలులో విహరించవచ్చును.
ఏలయన ఆ మఱ్ఱిచెట్టుఎఱ్ఱని కాయలయొక్క ఆకుల యొక్క నానావర్ణములైన కాంతులయొక్క ప్రసారముచేత ఆ దీవికి గొడుగువలె పొందియున్నది. (గొడుగువలెనున్న అంతపెద్ద చెట్టని)’’అని అనగా దమయంతి యూరకుండెను. ఆమె వికారమును చూచి అతనిని నొల్లమియని యెఱింగి వాగ్దేవి ముందుకు సాగిపోగా ఆ పుష్కర ద్వీపనాథుని ముఖము దుఃఖముచే నల్లబడింది. తదుపరి ఆ నలవరాణి దమయంతితో.
శాకద్వీపాధిపతి
‘‘ఓ చంద్రవదనా! పావనమైన యశస్సు గలవాడైన ఇదిగో ఈతడు, ఈ రాజు ‘‘శాకద్వీప వల్లభుడు’’ ఆ శాక ద్వీపమంతయు ఇతని ఆధీనంలో నున్నది. ఈ ద్వీపమునకు గుర్తుగా ఒక మహా‘‘శాకవృక్షము’(టేకు చెట్టు) కలదు. యశోవ్యాప్తిగల వాడును, నారాయణుని పోలిన ఈతని సంతోషముతో వరింపుము.
ఈతడు గొప్ప సేవగలవాడు. శాక ద్వీపమునకు క్షీరసాగరము దక్షిణ దిక్కునగలదు. ఆ క్షీరసాగరములో శేష తల్పమున శయనించిన నారాయణుని ప్రత్యక్ష సేవాభాగ్యము ఈతని వరించిన నీకునూ కలుగును.
మరియు శాకద్వీపమునగల ‘ఉదయ పర్వతము’పై పుష్యమి రేయి యందు విహరించి వెనె్నల పండుగ గావించుకొను భాగ్యము లభించును. కావున నీవు ఈతని వరించి అటకు ద్వీపమునకు బొమ్ము’’ అని పల్కెను.
పద్మముఖి అయిన దమయంతి మారుమాటాడక ఆ శాకల ద్వీపాధిపతిని దాటి ముందుకుపోవగా ఆ వాఙ్మయదేవత మరల దమయంతితో
క్రౌంచ ద్వీపాధిపతి
‘‘ఓ తరుణీమ తల్లికా! ఓ మహిళా లలామ! బాహువులచేత పలుమాఱు తొలగింపబడిన వైరిరాజులు కలవాడైన ఈ క్రౌంచద్వీపనాథుని వరించుము.
క్రౌంచమనే ఈ దీవి ఈ రాజుచేత పాలింపబడుచున్నది. ఈ క్రౌంచద్వీపము చుట్టూ దధి(పెరుగు) సముద్రమున్నది.
ఓ పొలతీ! కమలలోచనా! ఈ రాజుయొక్క విమల యశస్సు సాగరంబులు దాటి దశదిశల వ్యాపించి యున్నది. అట్టి ఈతని నీవు వరింపదగును.’’
అని వాగ్దేవి పలుకగా విన్న దమయంతి తన మనసును ఆ వసుంధరాధిపు యందు సంధింపలేదు. అప్పుడు ఆ పలుకుంజెలి
క్రౌంచ నామక పర్వతముచే క్రౌంచద్వీపమని పేరువచ్చినదని శ్రీ భాగవతములో చెప్పబడినది. వేరొకచోట క్రౌంచపక్షులు విరివిగా ఉన్నందున, వాటికి ఆ దీవి నిలయమయినందున క్రౌంచదీవి అనే పేరువచ్చిందని.
ఈ క్రౌంచ పర్వతము ‘‘బాణాసురు’నికి నివాస స్థానము. కుమారస్వామి ఈ పర్వతాన్ని చీలుస్తాడు. అప్పుడు ఆ పర్వతానికి తూటుపడగా, ఆ తూటు దారిని హంసలు ‘మేరుపర్వతానికి’పోవునని పురాణ కథనం.
కుశద్వీపాధిపతి : పద్మముఖీ! దమయంతీ! ఈ భూపతి ‘‘కుశద్వీపాధిపతి’’. (కుశము=దర్భ) ఈతని వరించి ‘నేతి’సముద్రము యొక్క తీరమునందలి చిట్టడవులయందు విహరింపుము. దొండపండు వంటి మోవికలదానా! దమయంతీ! ఆ కుశద్వీపములో దర్భగుల్మములు నీకు కనువిందు చేయగలవు. (గుల్మము=బోదెలేని చెట్టు)’’ అని పలుకగాదమయంతి ఆ రాజును సేవింప నొల్లక (మనసుపడదయ్యెను) యుండిన ఆ చతుర్భుజుని కోడలైన వాణి ముందుకు సాగి దమయంతిని కనుంగొని
శాల్మలద్వీపము: ఓ లలనా! ఈ విభుడు ‘‘శాల్మలద్వీప నాథుడు’. ఈ దీవి బూరుగుచెట్లు విరివిగాకలది. ఈ ద్వీపమునకు చుట్టూ ‘సురాసముద్రము’కలదు.