మెయిన్ ఫీచర్

అనుకూలానికి కారణం ధర్మమార్గమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మం గురించి చెప్పాలంటే మొట్టమొదట రాముని పేరే వస్తుంది. పితృవాక్య పరిపాలన గురించి చెప్పాలన్నా రాముని పేరే జ్ఞప్తికి వస్తుంది. ఆ రాముడు ఎవరంటే త్రేతాయుగంలో సుమారు అరవై ఏండ్లు పిల్లలు లేరని తపించిన వారికి అమూల్య సంతానంగా లభించిన రాముడు. రామునితోపాటుగా లక్ష్మణ భరత శత్రుఘు్నలు పుట్టారు.
రాముడు అత్యంత గారాబంగా పెరిగినా రాచకుమారుడిలా అహంకారాన్ని చూపలేదు. అయోధ్య పట్టణమంతా రాముడంటే అభిమా నాన్ని పెంచుకునేలా అందరికీ ఆప్యాయతను పంచాడు. అన్నదమ్ములమైత్రి గురించి చెప్పాలం టే రామలక్ష్మణుల దే. భార్యభర్త ల అనుబంధం అంటే సీతారాములదే. తల్లిదండ్రీ సేవాభాగ్యం చెప్పాలంటే రామాదులదే. స్నేహధర్మం గురించి చెప్పాలంటే గుహుడు,రాముడు, రాముడు, సుగ్రీవుడు, రాముడు విభీషణుడు ఇట్లాంటి వారిదే. ఆర్తత్రాణ పరాయణుడు తను నమ్మినవారిని కాపాడేవాడు ఎవరు అంటే రాముడే సేవాభాగ్యన్ని గురించి చెప్పాలంటే రామునికి తోడు నీడగా ఉన్న ఆంజనేయుడు, లక్ష్మణులథే.
ఇలా ఏ విషయానికి గురించి ఉపమానంగా చెప్పాలంటే రాముని గురించో, లేక రామపరివారం గురించో చెప్పాల్సి వస్తుంది. అటు వంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే దానికి కారణం ఒక్కటే రాముని ధర్మాచరణ.
ఎవరు ధర్మాచరణ చేస్తారో ఎవరు సత్యాన్ని మాత్రమేనమ్ముతారో సత్యాన్ని నిరంతరం పలుకు తారో వారు చిరస్మరణీయులు. వారికి కాలం ఎపుడూ అనుకూలంగానే ఉంటుంది.
‘చకార అస్మభ్యమ్- ఆత్మనే తప సంతుసః’ అంటే మాకోసం తన కోసం మేలు చేసేవాడే తపస్వి అని అధర్వ వేదపాఠం. సాటి మానవులపట్ల మేలు కలిగేలా ప్రవర్తించాలి. ఇతరులకు కీడు కలిగించే వాడు క్రూరుడు. మేలు చేయనివాడు వ్యర్థజీవి. గొప్పదైన ఈ తపఃస్వభావమే నిజమైన ప్రతాపం. ప్రతి వ్యక్తి తాను చేసే పనులు ఇతరులకు మేలు కలిగిస్తున్నాయా? లేక కేవలం తన సుఖం కోసం మాత్రమే జీవిస్తున్నానా అని పరిశీలించుకోవాలి. దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకొనడమే ఈ తపస్సు అర్థం.
కనుక రాముడిని చూసి రాముడి తత్వ్తాన్ని అర్థంచేసుకొని రామునిలాగా జీవించాలి అంటే అర్థం కేవలం రాముడు ఆచరించిన ధర్మాన్ని , సత్యాన్ని మనం కూడా పాటించాలనే. ఒకవేళ కాలాన్ని జయంచలేక , ఇంద్రియాలను నిగ్రహిం చు కోలేక ఎపుడైనా ధర్మాచరణ చేయలేకపోతే తిరిగి పునఃపరిశీలించుకుని తాము చేసేది ధర్మం కాదని తెలుసుకొని వెంటనే ధర్మాచరణకు పూనుకోవాలి. అపుడే వారు మనుష్యులుగా కీర్తించబడుతారు. ఎవరైనా పొరపాటు చేయవచ్చు. కానీ పొరపాటును సరిదిద్దుకొని నగుబాటు కాకుండా సరిగా వ్యవహరిస్తే చాలు ధర్మాచరణలో ఉన్నట్టే. ఇది కలియుగం అయనా రాముడిని ఆదర్శంగా తీసుకొని సత్యాన్ని ధారణ చేయాలి. ధర్మాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆచరించాలి. స్వార్థాన్ని విడిచి నలుగురు మంచికోసం ప్రయత్నించాలి. వ్యక్తి కుటుంబం కోసం కుటుంబం రాష్ట్రం కోసం రాష్ట్రం దేశం కోసం కలిసికట్టుగా పనిచేస్తే దేశ ఔన్నత్యం పెరుగుతుంది. అన్నివిధాల దేశకీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. దేశవైభవం పెరిగేలా చూడడానికే అందరూ కృషి చేయాలి.

-కూచిబొట్ల వెంకటలక్ష్మి