మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత సరస్వతీదేవి నా రాజసమూహంబును దాటి వచ్చిన భోజరాజకన్య అయిన దమయంతిని నిషధ రాజ పంచకంబు చెంతకు కొనిపోయెను. నలుని రూపములోనున్న లోకపాలురను చూపించెను.
అదే సమయంలో దమయంతి ‘ఒకే ఆకృతిగల ‘ఐదుగురు వ్యక్తులను నలమహారాజు రూపంలో చూచింది. ఆశ్చర్యపడింది. ఆ అయిదుగురిలో ఎవరిని చూచినా దమయంతికి నలుని లాగానే తోచింది. అపుడు దమయంతి తన మనసులో విచారించింది. బాగా ఆలోచించింది. తన బుద్ధితో ఇలా తర్కించుకొన్నది.
‘‘ఈ అయిదుగురిలో ఎవరు దేవతలో, ఎవరు నలమహారాజో ఎలా తెలిసికోవాలి? పెద్దవారు చెప్పగా దేవతలకు ఉండవలసిన లక్షణాల గురించి విన్నాను. ఆ లక్షణాలలో ఏ ఒక్కటిగూడా భూమిపైనున్న వీరిలో కనిపించడం లేదు. దేవతలను శరణువేటానికి ఇదే సమయం’’అని భావించి అంజలి ఘటించి మనసావాచా దేవతలకు నమస్కరించి అన్నది.
‘‘ఓ దేవతలారా! కలహంస మాటలను విన్నాను. ఆ మాటలను నమ్మాను. అందువలన నిషధ దేశాధీశుడైన నలమహారాజును మనసాక్షిగా భర్తగా స్వీకరించాను. ఈ దమయంతిపై దయజూపి నా మాటలను మన్నించి నా నలమహారాజును నాకు ప్రసాదించండి.
ఓ దేవతలారా! నేను యదార్థంగా మనస్సులోగానీ, వాక్కులోగానీ, మరొక పురుషుని భావింపననేది సత్యమయినచో, ఆ సత్యంతో నా నలుని నాకు ప్రసాదించెదరుగాక! దేవతల చేతనే ఆ నలమహారాజు నాకు భర్తగా కూర్చబడినాడు. ఇది సత్యమైనది కావున నలుని నాకు దయతో ప్రసాదించండి.! అంతేగాక ఆ నలుడే నాకు భర్తకావాలని నేనొక వ్రతాన్ని చేపట్టాను. నలుని ఆరాధించడం అనే ఆ వ్రతాన్ని ఆరంభించాను. ఇది సత్యమైనచో, ఓ దేవతలారా! నాకు నా నలుని ప్రాసాదింతురుగాక! పుణ్యాత్ముడైన ఆ నలమహారాజును నేను గుర్తించడానికి తగినట్లు లోకపాలురైన మీరలు మీమీ అసలు రూపాలను పొందెదరుగాక!’’ అని దమయంతి అనేక విధాల దేవతలను అర్థించింది.
దమయంతి అభ్యర్థనను వినిన లోకపాలురు, దమయంతికి నలుని పట్ల గల అనురాగంలోని నిజాన్ని, ఆమెకు నలునిపైగల భక్తిని, ప్రేమాభిమానాన్ని, సద్బుద్ధిని గ్రహించారు. ఆమె మొరనాలకించి తమతమ నిజరూపాలను ధరించారు. చెమటలు పట్టని దేహాలతో, రెప్పలు మూతపడని కన్నులతో (అనిమిషులు), వాడని పూలదండలు గలిగి, ధూళి రహితులై నేలను అంటక ఉపస్థితులయ్యారు. అలా నిలిచిన దేవతలను దమయంతి చూచింది. అప్పుడు నలమహారాజు ప్రక్కన ఆయన నీడపడి ఉండటాన్నికూడా చూచింది. నలుని దేహంపై ఉన్న పూలదండలు వాడియుండటాన్ని గ్రహించింది. దేహంపై చెమట కనిపిస్తున్నది. నలుని పాదాలుగూడా అందరివలెనే నేలను తాకి ఉన్నాయి. కనులయొక్క రెప్పపాటు తెలుస్తున్నది. అలాఉన్న నలమహారాజును దమయంతి ఆనందంతో గుర్తించింది.
దేవతలను మరొక్కమారు పరిశీలనగా చూచింది.
నలుని అనుమానం లేక గుర్తించింది.
సిగ్గుమొగ్గతొడగగా పైట చెంగును సవరించుకొన్నది.
చిరునవ్వు పెదాలపై తొణికిసలాడింది.
మోము చంద్రబింబంలా వికసించింది.
భూలోకంలోని రాజులందరూ ఆసక్తిగా దమయంతిని చూస్తున్నారు.
సభికులందరూ ఆత్రుతతో ఏమిజరుగనున్నదోయని తిలకిస్తున్నారు.
దాసదాసీ జనం తమతమ చేతులలో అలంకృతమైన వివాహ వస్తువులను పైకెత్తి ఉంచారు.
భేరి మృదంగాలు మ్రోగటానికి ఉద్యుక్తమై ఉన్నాయి.
- ఇంకాఉంది