మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా తల్లిదండ్రుల పూజాఫలం నాకు ఈ గొప్ప అదృష్టాన్ని ప్రసాదించింది’’ అని పాదాభివందనం కావించింది. ఇద్దరూ ఒకటయ్యారు.
వివాహానంతరం నల మహారాజు కొంతకాలం విదర్భలోనే ఉన్నాడు. భీమరాజు అనుమతితో తన నిషధ నగరానికి పయనమయ్యాడు. రాజ్యాన్ని చేరాడు.
దమయంతిని పొందిన నలుడు ‘శచీదేవి’ తోనున్న దేవేంద్రుని వలె ఆనందించాడు. వీరుడై ధర్మమార్గాన పరిపాలనను చేస్తున్నాడు. ప్రజలను రంజింప చేస్తున్నాడు. యయాతి మహారాజువలె నలుడు భూరి దక్షిణలతో, ఇతర క్రతువులతోపాటు అశ్వమేధ యాగాన్ని చేశాడు. దేవతలు నలుని దీవించారు.
దమయంతితో రమణీయమైన ఉద్యాన వనాలలో విహరించారు.
దమయంతి యందు నలమహారాజు ‘ఇంద్రసేనుడు’ అనే ఒక కుమారుని, ‘‘ఇంద్రసేన’’ అనే ఒక కుమార్తెను పొందాడు. సిరిసంపదలతో భూమండలాన్ని పాలిస్తున్నాడు. (12)
దమయంతి నలమహారాజును వరించింది. భీమ మహారాజు నల దమయంతుల వివాహం మహావైభవోపేతంగా జరిపించాడు. కొంతకాలం తరువాత నలుడు భార్య సమేతుడై నిషధ దేశానికి వచ్చాడు.
దమయంతి వివాహానంతరం ఇంద్రాది దేవతలు నలునకు అనేక వరాలను ప్రసాదించి స్వర్గానికి పయనమై వెళ్ళుచుండగా మార్గమధ్యంలో ద్వాపర పురుషుడితో కలిసి వస్తున్న ‘‘కలిపురుషుడి’’ని చూచారు. అప్పుడు ఇంద్రుడు కలిని చూచి
‘‘కలీ! ద్వాపరునితో కలిసి ఎచ్చటికి ఎందుకు వెళ్తున్నావో తెలిసికొనవచ్చునా?’’ అని అన్నాడు.
ఇంద్రదేవా! భూలోకంలో విదర్భ దేశపు రాజకుమారి దమయంతి స్వయంవరం జరుగుచున్నదని విన్నాను. నా మనస్సు ఆ దమయంతి యందు లగ్నమై ఉన్నది. ఆ కన్య అతిలోక సుందరియట. ఆమెను భార్యగా పొందటానికి ఆశపడని వారెవరైనా ఉంటారా?
ఆ స్వయంవరంలో నేను దమయంతి చేత వరింపబడతాననే సంబరంతో, ఆవతో అమితమైన కోరికతో వెళుచున్నాను’’ అని పలికాడు.
జరిగేది దమయంతి స్వయంవరం. దమయంతి అతిలోక సౌందర్యవతి. జగదేక సుందరి అన్న సంగతి లోక విదితమే. అందుకే ఆమె కొరకై భూమండలంలోని రాజులేగాక ఇంద్రాగ్ని వరుణయామాది దేవతలు సైతం ఆశపడి పరుగెత్తుకొని దమయంతిని ఆశించి వచ్చారు.
అయితే దమయంతి ఇంద్రాది దేవతలతో సహా భూమండలంలోని రాజులందరినీ తిరస్కరించింది. నలుని ఒక్కడినే వరించింది. అలాంటప్పుడు కలిపురుషుడి ఆశ ఎంతటి హాస్యాస్పదమైనదో గదా? శృంగార ప్రకృతి మిక్కిలి గహనమైనది. గంభీరమైనది కూడా! తాను ఎంతటి కురూపి అయినను జగదేకసుందరిని కాంక్షించ వచ్చునుగదా?
‘‘బ్రహ్మకైన బుట్టు రిమ్మ తెగులు’’ అనే నానుడి సమంజసమైనదే
దేవతలు కూడా మానవులను వరించడం ఒక ఆశ్చర్యకరమైన విషయమేగదా?
కలపురుషుని మాటలకు దేవతలందరూ పెద్దగా నవ్వారు. అంత ఇంద్రుడు అన్నాడు
‘‘ఓ కలీ! దమయంతి స్వయంవరం జరిగిపోయింది. ఆ సుకుమారి దమయంతి మా సమక్షంలోనే ఒరుల నెవ్వరినీ మెచ్చక ‘నిషధ దేశాధీశుడైన’ ఆ నలమహారాజునే వరించింది. ఇంక నీ ప్రయాణం నికర్థకం’’ అని అన్నాడు.
ఇంద్రుడీ విధంగా పలుకగా కలి క్రోధంతో దేవతలను దగ్గరకు పిలిచాడు. వారితో
‘‘దేవతల మధ్య ఒక మానవుని పతిగా స్వీకరించడమా? అందువలన ఆ దమయంతి పెద్దశిక్షను పొందడమే న్యాయం’’ అని అన్నాడు. అందుకు లోక పాలురు
‘‘మేము అనుమతిస్తేనే దమయంతి నలుని వరించింది. సకల సద్గుణోపేతుడైన నవ మహారాజును ఏ స్ర్తి వరించకుండా ఉంటుంది.
- ఇంకాఉంది