మెయిన్ ఫీచర్

గుడ్‌బై గోరా! (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యంగ్య రచయిత మంచిని వర్ణించి ప్రజల మనస్సులను మార్చాలని చూడడం కంటే చెడును మన కళ్ల ఎదుట నిలిపి దాన్ని అపహాస్యం చేయడమే లక్ష్యంగా
సాగుతాడు. ఆ క్రమంలో దానికి ఆలంబనమైన వ్యక్తులను గానీ, సంస్థలను గానీ, అభిప్రాయాలను గానీ
మూలచ్ఛేదం చేస్తాడు. అయితే దానిలో హాస్యం లేకపోతే అది కేవలం తిట్టులా వినిపిస్తుంది. కావ్యశిల్పం లేకపోతే కేవలం వెక్కిరింతలా అనిపిస్తుంది. అధర్మాన్ని అపహాస్యం చేసి, దాని క్షుద్రత్వాన్ని చూపించడం, అధర్మం ధరించిన గంభీర వస్త్రాలను విప్పి పారేసి దాని పేలవత్వాన్ని,
దాని నిజ స్వరూపాన్ని ప్రదర్శించి నవ్వించడం ఆయా రచయితల ప్రతిభా సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి రచనలు మేథాశక్తికి సంబంధించినవి. ఇవి హృదయ సంబంధి కావు. సంఘ చైతన్యంగల మేధావిగా గోరాశాస్ర్తీ సమకాలీనులను చైతన్యవంతం చెయ్యగలిగినంత మేరకు ఇట్లా తన రచనా వ్యాసంగంతో చేశాడు.

జీవితంలో ఏదీ ఆశ్చర్యకరమైన విషయం కాదనీ, దేనికీ గొప్పగా ఆశ్చర్యార్థకాలు వార్చి వడ్డించనక్కరలేదని చెవి పిండి పాఠం చెప్పి, నన్నిలా నేల విడిచి సాము చేయనిదానిలా ఊహల్లో తేలియాడలేని సాదా
సాధారణ రచయితగా తయారుచేశారు.
జ్ఞాపకాల యిసెళ్ళు ముసురుతున్నాయి. కళ్ళు నీటి పొర కమ్మి బరువెక్కి వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. గుండెలమీద ఏదో తెలియని బరువు. ఊపిరి ఆడడం లేదు. ఏమిటిది? ఎందుకిలా ఉంది? గోరా నువ్వు నాతో మాట్లాడకుండా అలా కళ్ళు మూసుకు పడుకోవడం ఏమిటి? నేనెంత మంది స్నేహితులతో వచ్చినా- నేను నీతోనే తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదని హూంకరించే నువ్వు ఎందుకిలా వౌనంగా, చలనం లేకుండా నేను వచ్చినట్టేనా గుర్తించకుండా పడుకున్నావు? ఎంత అన్యాయం ఇది.
నాకు తెలుసు నా మీద నీకెంత కోపమోననీ ‘ఆడాళ్ళతో స్నేహం చేసి చెడిపోతున్నావు రామలక్ష్మీ. ఇన్నాళ్ళు ఇనే్నళ్ళు మగవాళ్ళతో మాట్లాడినా నీకు చెడ్డ పేరు రాలేదు. ఇపుడు చూడు. ఈ ఆడగుంపు వదులు అంటూ హెచ్చరించావు. హెచ్చరించడమేమిటి? తంతానన్నావు. నిజం. నువ్వన్నది నిజం గోరా. ఆడవాళ్ళమధ్య తిరిగి ఆడతనం అబ్బలేదు సరికదా, వాళ్ళ నైజం కూడా చాలా లేటుగా కాటేశాక గానీ గుర్తించలేదు. నీ కోపం నామీద కాదనీ నా బాగోగులమీదననీ తెలుసుకుని నీకు చెప్పాలని ఉవ్విళ్ళూరేనే. సరిగా అదను చూసి ఇప్పుడా ఊపిరి పీల్చడం ఆపేస్తావా? అన్యాయం గోరా. ఇది చాలా అన్యాయం.
జీవితంలో ఎందరో రకరకాల అనుభూతులను పొందినవాళ్ళు ఉంటారు. కానీ గురుభీతి అనే అనుభూతి చాలా మందికి ఉండదు. ఎందుకో తెలుసా? అవి కాలేజీలు. వాళ్ళు కాలేజీ గురువులు- వారి అనుబంధం అనుభూతి అంతా కాలేజీ పూర్తికాగానే సరి. కానీ నాదీ నీదీ అలాంటి అనుబంధం కాదు. కాలేజీ దాటాక నీ గురుపీఠంలో నా కింత చోటిచ్చావు. పాతకాలపు గురువుల కన్నా అన్యాయం గోరా నువ్వు! చావకొట్టి చెవులు మూసి మార్గం ధ్యేయం గమ్యం గోచరింపజేసిన వాడివి. అందుకే నువ్వు నేర్పిన పాఠాలు నా రక్తంలో జీర్ణించుకుపోయాయి. ఏదైనా ఆషామాషీగా రాయాలన్నా రాయలేనిదానిగా తయారైపోయాను. ఎందువల్ల? నీవల్లే. తక్కువ మాటలు ఎక్కువ పొందిక నేర్పినవాడివి. జీవితంలో ఏదీ ఆశ్చర్యకరమైన విషయం కాదనీ, దేనికీ గొప్పగా ఆశ్చర్యార్థకాలు వార్చి వడ్డించనక్కరలేదని చెవి పిండి పాఠం చెప్పి, నన్నిలా నేల విడిచి సాము చేయనిదానిలా ఊహల్లో తేలియాడలేని సాదా సాధారణ రచయితగా తయారుచేశారు. వాస్తవంలోనే కలలు కనడం అవి నిజపరచడం నేర్పించారు. కలల్లో వాస్తవం నాస్తి నాస్తి అని చెప్పి చెప్పి ఇంద్రధనుస్సు చివర వుంటుందన్న ‘కాస్‌కున్’ (బంగారుబిందె) మిథ్య అని నమ్మించేశావు. అందుకే, నాకెక్కడా ఏదీ వింతగా లేదు. ఈ సమాజం పురోభివృద్ధి వెర్రితలలు వేస్తున్నా కుక్కమూతి పింజెలు కాస్తున్నా- అభ్యుదయం వెనక్కి తిరోగమనం ముందుకే నడుస్తున్నా నాకేం ఆశ్చర్యంగా లేదు. నువ్వు చెప్పేవుగా కాలు నేలమీద ఆలోచనలు ఆకాశంలోనూ వుండేలా చూసుకున్నప్పుడే- మంచి రచయితవి అవుతావని గోరా, నేను తీర్చిదిద్దిన రచయితని.. జ్ఞాపకం వుందా? ననె్నలా ఏడిపించేవాడివో, ఓ కథరాస్తే అది పదిమంది ముందు చదివి చీల్చి చెండాడి కళ్ళంట నీళ్ళు పెట్టించలేదూ? ఓ భాస్కరభట్లు, ఓ శ్రీవాత్సవ, ఓ బైరాగి.. ఎవరైనా మెచ్చినా- కోప్పడేవాడివి. ‘‘అలా పొగిడేయకండి గొప్ప రచయిత్రిననుకుని నన్ను కూడా తోసిరాజంటుంది’’ అంటూ వాళ్ళనే కోప్పడేవాడివి.
స్వతంత్రలో మనం పంచుకున్నవి బంగారు రోజులు. నా ఎదుట నన్ను తిట్టి నా వెనుక నన్ను కాచి, నువ్వు నాకు ఊతమిచ్చావు. ‘‘బాగోలేని కథ అచ్చువేయరు. అది ఎక్కడపడ్డా నీ పేరనే పడుతుంది. నీ పరువే పోతుంది’’ అన్న నగ్నసత్యాన్ని బాగోలేని కథ చింపి బుట్టదాఖలు చేసి తెలియజెప్పిన కఠినుడివి. కానీ ఆ కాఠిన్యం వెనుక నా పట్ల రచయితగా నా భవిష్యత్తుపట్ల నీకెంత అక్కర! గోరా, నువ్వు లేవంటే నేను నమ్మలేను, ఎందుకో తెలుసా? నేను కాగితంపై కలం పెట్టగానే నా పెదవులపై చిన్న నవ్వు తలెత్తుతుంది. రాయబోయేది ఒళ్లుదగ్గర పెట్టుకుని రాయి. నంగిరి రాతలంటే నాకు ఒళ్లుమంట. క్షుణ్ణంగా మాట్లాడాలి. క్షుణ్ణంగా రాయాలి. అంతేగాని గోడమీది పిల్లిలా ఒక్క పిరికివాళ్ళే రాస్తారు. పేరు లేకుండా కూడా పిరికివాళ్ళే రాస్తారు. కాకిమీదా పిల్లిమీదా పెట్టి కూడా పిరికివాళ్ళే రాస్తారు. అది జన్మలో చెయ్యకు అని నువ్వు అన్నమాటలు జ్ఞాపకం వచ్చే ఆ చిరునవ్వు మొలకెత్తుతుంది.
జీవితం ఎంత విచిత్రమైనది. సముద్రపు ఉప్పూ, అడవి ఉసిరీ- నువ్వూ నేనూ - నాకు తెలుగు రాదని ఎంత సతాయించావు? జ్ఞాపకం వుందా! ‘గోవుమీద కాంపోజిషన్ రాయి’ అని నాలుగు తెల్ల కాగితాలిచ్చి తలుపు వేసి కూర్చోబెడితే ఆడాళ్ళు కాగితాలు నింపలేరు అని ఛాలెంజీలు పారేసేవాడివి కానీ ఆ ఛాలెంజి వెనుక నీకు రాసే ఆడవాళ్ళపై వున్న అవ్యాజ్యమైన ప్రేమ వుండేది. మంచి రచన దేన్ని చదివినా అది అందరితో పంచుకోవాలన్న నీ తహతహ- ఏదీ యింకెవరు చూపిస్తారు?
గోరా, ఈ అల్విదా రాస్తూంటే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా? బుధవారం మధ్యాహ్నానికల్లా స్వతంత్రకు నీవు రాయవలసిన సంపాదకీయం? అబ్బ! నేను కూడా మరిచిపోలేను. ఆ రోజు నీకు రాని నొప్పి వుండేది కాదు కదూ, గోరా! జ్ఞాపకం వుంది. ‘‘ముత్యాల సరాల్లాగా.. పేజీలకు పేజీలు ప్రేమలేఖలు రాసిన నీ చేయి సంపాదకీయం దగ్గిర కొచ్చేసరికెందుకంత మొరాయిస్తుంది అని నేనంటే నవ్వి సంపాదకీయం ప్రేమలేఖ కాదు అనేవాడివి. నీమాట అక్షరాలా నిలబెట్టుకున్నావు. సంపాదకీయాల కోసమే పత్రికలు చదివే పాఠకలోకాన్ని సృష్టించి నీ దారిన నువ్వు వెళ్లిపోయావు. ఆంధ్రభూమి సంపాదకీయాలు భాషకోసం విషయ వివరణ కోసం- జర్నలిజం, రాజకీయ విద్యార్థులు చదివి తీరవలసిన పాఠాల్లాగా రూపొందాయి నీ చేతిలో.
జీవిత వసంతంలో నీ పట్నంలో అమోఘంగా కూసింది. ఆశ అణా పెరిగింది. కానీ నీ జీవిత కోకిల కూసి కూసి ఆయాసపడి అలసి సొలసింది గోరా, ఇప్పుడు విశ్రాంతి కోరింది. కాకపోతే మేం ఎవరం?

- కె.రామలక్ష్మి