మెయిన్ ఫీచర్

దమ్ము’రేపుతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రచారం బావుంటే
-ఎన్నికల్లో నెగ్గి ఎమ్మెల్యే కావొచ్చు. -రాజకీయం.
ప్రచారం బావుంటే
-పావలా వస్తువును పాతికకు అమ్మొచ్చు. -వ్యాపారం
ప్రచారం బావుంటే
-జోనరేదైనా.. జనంపై బలంగా రుద్దొచ్చు. -సినిమా
*
రాజకీయం, రాజకీయ వ్యాపారం, వ్యాపార రాజకీయం.. వీటిని కాసేపు పక్కన పెడితే, వాటిని తలదన్నుతోన్న సినిమా ప్రచారం గురించి కొంత మాట్లాడుకోవాలి. 80 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా ప్రచారం -కొత్త వేళ్లూనుతోంది. సరికొత్త కోణాలు వెతుకుతోంది. లుక్కులు, చాప్టర్లు, ఫెస్ట్‌లు, ఫీస్ట్‌లతో కొంగొత్త వెలుగులూ
విరజిమ్ముతోంది. ప్రచారం ‘పల్స్’
పట్టేందుకు ఇంకేవేవో చేస్తోంది కూడా. మొత్తంగా ప్రచారం మాత్రం -సినిమాను మించిపోతోంది. ‘మంగళ్‌యాన్ ప్రాజెక్టు కంటే -నా ‘మిషన్ మంగళ్’ ప్రాజెక్టు బడ్జెట్టెక్కువ’ అంటూ అక్షయ్ చేసిన ఫన్ కామెంట్ సైతం -ప్రచార సూత్రమంటే నమ్మగలమా? నమ్మాలంటే -‘డార్విన్- థియరీ ఆఫ్
ఎవెల్యూషన్’లాంటి ‘సినిమా ప్రచార పరిణామ కథ’ను పరిశీలించాలి.
*
రివర్స్ స్క్రీన్‌ప్లేలో కథను డిస్కస్ చేస్తే-
పెర్ఫెక్ట్ కెమిస్ట్రీ పెయిర్‌గా ‘గీత..’ గీసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న తాజా చిత్రం -డియర్ కామ్రేడ్. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అన్నది టాగ్ లైన్. ప్రచారం మాత్రం ‘ఫైట్ ఫర్ వాట్ యు వాంట్’ అన్న కానె్సప్ట్‌తో సాగుతోంది. అలవాటైన ఫస్ట్‌లుక్ టు ట్రైలర్ స్టయిల్‌ను కాస్త దాటుకెళ్లి -‘మ్యూజిక్ ఫెస్ట్’ స్ట్రాటజీని తీసుకొచ్చింది. ఏదైనా ప్రచారంలో భాగమేగా? అనుకోవచ్చు. కాకపోతే దానికో కొత్తపేరు పెట్టి, కొత్తగా జనానికి రుచిచూపిస్తే -ప్రమోషన్‌లో క్వాలిటీ కనిపిస్తుంది. ఇదే లెటెస్ట్ స్టయిల్. అందుకే -మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యాష్ రంగినేని.. ఈ నిర్మాతల టీం ‘స్టయిలిష్’ ప్రమోషన్‌కు పదును పెట్టింది. నాలుగు భాషల్లో సినిమాను నిర్మిస్తూనే.. ఆయా భాషల ప్రధాన ప్రాంతాల్లో ఈ తరహా కాంపైన్‌తో ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ను స్పెషల్ అట్రాక్షన్ చేసేశారు. జూలై 26న థియేటర్లకు వస్తున్న ‘డియర్’కొండ ఎంత స్టామినా చూపించనున్నాడన్న విషయాన్ని పక్కనపెడితే, ‘శత దినోత్సవ సక్సెస్’ను చేస్తోన్న ప్రచారం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకూ మ్యూజిఫ్ ఫెస్ట్‌లో జరిగిన హంగామా ఏంటంటే -సినిమాలోని పాటల్ని లైవ్‌లో ప్రదర్శించటం. అంతేకాదు నాయికా నాయకలు జనంతో కలిసి స్టెప్పులేయటం. అదేంటి.. ఇలాంటివి గతంలోనూ జరిగాయిగా? అన్న డౌట్లు ఇక్కడ అప్రస్తుతం. జరగలేదని ఎవ్వరూ అనరు. కాకపోతే దీన్ని నిర్వహించిన విధానం వెరైటీ అన్న ఆన్సర్ వస్తుంది. కొత్తకోణమేంటంటే -సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌ను సైతం సినిమా స్థాయిలో ప్రచారం చేయాల్సి రావడం. ఇదీ ‘డియర్ కామ్రేడ్’ స్టయిల్. ‘మనందరిలో చాలా భయాలుంటాయి. అయితే వాటిని వదిలేస్తేనే మనం గెలుస్తాం. నేను కూడా నటుడు కావాలనుకున్నప్పుడు భయమేసింది. మనకు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే అదిన మనకు దక్కుతుంది. ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నమే డియర్ కామ్రేడ్ సినిమా’ అన్నది మ్యూజిక్ ఫెస్ట్‌లో దేవరకొండ మాట. ఇది చెప్పడానికి ఇంతహంగామా అవసరమా? అనుకోవచ్చు. అలాంటి సినిమా చూడమని చెప్పడానికి నిర్వహించిన ‘ఫెస్ట్-్ఫస్ట్’ అనుకోవాలి.
ద లయన్ కింగ్. తాజాగా థియేటర్లలో గర్జిస్తున్న సింబా సినిమా. ఆ గర్జన వెనక -పతాకస్థాయి ప్రమోషన్ ప్రేక్షకుడికి కనిపించదు. కాని -ఆ మాయలోనే థియేటర్లకు పరుగులెడతాడు. ఇది డిస్నీవాళ్ల సినిమా అన్న ముద్ర దగ్గర్నుంచి ప్రమోషన్ మొదలవుతుంది. పాతికేళ్ల క్రితం చెప్పిన కథనే మోషన్ పిక్చర్ టెక్నాలజీతో చెప్పామన్న మరో మాట వినిపిస్తుంది. సింహాలు మాట్లాడతాయి... ఆ సింహాలకు గొంతు అరువిచ్చింది నాని, జగపతిబాబు, రవిశంకర్.. ఇలా చాలాచాలానే ప్రమోషన్‌లో భాగంగా వినిపిస్తాయి. ఆడియన్స్‌లో ఉత్సుకత నిద్రలేస్తుంది. థియేటర్లవైపు పరుగులెత్తిస్తుంది. ప్రమోషన్‌తో -సినిమా హిట్టు ఫట్టుకు సంబంధం లేదు. కానీ, ఆ సినిమావైపు దృష్టిని మరల్చాలంటే బలమైన ప్రచారం ఒక్కటే మార్గం. తప్పదు.
నినువీడని నీడను నేనే -అనే సినిమా విడుదలకు ముందు ఎంత ప్రచారం జరిగిందో, విడుదలైన తరువాతా సినిమావైపు దృష్టి మరల్చడానికి అంతే ప్రయత్నం జరుగుతోంది. చిత్రబృందం ఊరూవాడా తిరుగుతోంది. జనంలో ‘సెలబ్రిటీ షో’ చేస్తూనే -్థయేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇది ఇప్పుడే మొదలైన ప్రమోషన్ స్టయిల్ కాదు. కాకపోతే -గతంలో ఏడాది విజయాలు, శత దినోత్సవ సక్సెస్‌లకు జరిపే హంగామా అంతా ఇప్పుడు వారం, పదిరోజుల విజయానికే నిర్వహించాల్సి వస్తోంది. అంతే తేడా.
ప్రచార పరిణామక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే-
అరవయ్యో దశకం సినిమా ప్రచారం ఇప్పటి జనరేషన్‌కు అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పక్కా నాటు’ అంటే సరిపోతుందేమో. జట్కా బండికో, జోడెద్దుల గూడుబండికో పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచుతూ సినిమా ప్రమోషన్ సాగేది. పల్లెల్లో జరిపే ప్రచారంతో పాటు తెరలపై సినిమాలూ ప్రదర్శించేవారు. 70వ దశకం వచ్చేసరికి ప్రమోషన్ కాస్త మారింది. పూర్తిగా వాల్‌పోస్టర్లు వచ్చేశాయి. రిక్షాలు ప్రచార సాధనాలయ్యాయి. ప్రత్యేక సినిమా పోస్టర్ల విడుదల, పాటల వేడుకలు, విజయోత్సవ సభలు, యాభై రోజుల వేడుక, శతదినోత్సవ పండుగ, వన్‌ఫిఫ్టీ డేస్, వన్ సెవెంటీఫైవ్ డేస్ అన్న కొలమానాలు ప్రమోషన్‌లో భాగమయ్యాయి. 80వ దశకం వచ్చేసరికి -సినిమా ప్రెస్‌మీట్ల వ్యవహారం వచ్చింది. ఇంటర్వ్యూలు, లొకేషన్ షూటింగ్ కవరేజ్‌లు.. ఆడియో వేడుక, ప్లాటినం డిస్క్ వేడుకలు, సినిమా విడుదలకు ముందు టూర్లులాంటి పరిణామాలు వచ్చాయి. 90వ దశకం వచ్చేసరికి -పోస్టర్లలో అధునాతన పోకడ వచ్చింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ అంటూ ఒకటి బయటికి వదిలేవారు. లొకేషన్ షూటింగ్ కవరేజ్‌లు బలోపేతమయ్యాయి. ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకల బలం పెరిగింది. మిలీనియం ముగింపునకు వచ్చేసరికి -సినిమాపై సాంకేతిక ప్రభావం పెరిగింది. అప్పుడే అందుబాటులోకి వచ్చే టెక్నాలజీని ప్రధాన ప్రచార సాధనం చేసుకుంటూ -సంప్రదాయబద్ధంగా వస్తోన్న ప్రచార విధి విధానాలను అమలు చేసేవి చిత్రబృందాలు. మిలీనియం దాటి దశాబ్దం గడిచేసరికి -సాంకేతికత పూర్తిగా విస్తరించేసింది. గోడ పోస్టర్లు కాస్తా స్క్రీన్ పోస్టర్లైన దశ మొదలైంది. అంతేకాకుండా -సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను ప్రమోషన్‌కు ఉపయోగించే మ్యాజిక్ మొదలైంది. టీజర్ లాంచ్.. పోస్టర్ లాంచ్.. ప్రీ లుక్, ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్, సక్సెస్ మీట్, టీం థియేటర్ విజిట్స్.. ఇలా రకరకాల పేర్లతో సినిమాను ప్రమోట్ చేయడం మొదలైంది. ఈ దశలోనే సినిమా ఎక్కువ రోజులు థియేటర్‌లో నిలబడే పరిస్థితి క్రమంగా తగ్గడం మొదలైంది. లెటెస్ట్ ప్రమోషన్స్ స్టయిల్ అనేక రూపాలు తీసుకుంటోంది. విస్తరించిన టెక్నాలజీతో ప్రపంచం పూర్తిగా అరచేతిలోకి ఇమిడిపోతున్న ఈ రోజుల్లో -సినిమాకు ప్రధాన గ్లామరైన హీరో హీరోయిన్ల హంగామాను విడుదలకు ముందే ‘లైవ్’ షోస్‌తో చూపించటం మొదలైంది. ఇలా సినిమా ప్రమోషన్‌ను చర్చించుకోడానికి సవాలక్ష కోణాలు. కాకపోతే -ప్రచారమంతా సినిమాను ఆడియన్స్ వద్దకు తీసుకెళ్లడానికే. థియేటర్‌లో బొమ్మపడిన తరువాత -జడ్జిమెంట్ మాత్రం ఆడియన్స్ చేతుల్లోనే. సో, ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా ప్రచారాన్ని దుమ్ము’రేపుతున్నారన్న మాట.
*
చిత్రాలు.. డియర్ కామ్రేడ్ కోసం విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఫెస్ట్ హడావుడి
*నినువీడని నీడను నేనే టూర్ హంగామా

-‘వి’