మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు దమయంతి దుఃఖంతో శోకతప్తమైన మనస్సుతో, కన్నీటితో గద్గదస్వరంతో నైషధునితో
‘‘మహారాజా! పురజనులు అందరూ మంత్రులతో కలిసి రాజభక్తితో తమ దర్శనార్థమై వచ్చి ద్వారంవద్ద వేచి ఉన్నారు. వారిని మీరు చూడాలి’’ అని పలుమార్లు చెప్పింది.
అయితే కలి ఆవహించిన నలమహారాజు అలా పలుమార్లు చెప్పి విలపిస్తున్న దమయంతితో మాటలాడక ఊరకున్నాడు.
అప్పుడు మంత్రులు, పురజనులు, సేవకులు అందరూ ‘‘ఈ మహారాజు ఇక మనకు దక్కడు. వ్యసనపరుడై జూదం మీదే మనసు నిలిపి సర్వసంపదలనూ కోల్పోతున్నాడు. ఇలా వ్యసనపరుడైన రాజు ఎవరి మాటలను లెక్కజేయడు. విధివైపరీత్యం ఇలా ఉన్నది. ఇంకా మనం చేయగలిగింది ఏమియూ లేదు.’’అని పరిపరి విధాల అంటూ దుఃఖితులై సిగ్గుతో తలవంచుకొని తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.
కలి పట్టిన నల మహారాజు ఎవరి మాటలను, చివరకు తన ప్రియమైన దమయంతి మాటలను సహితం లెక్కజేయక ఎన్నో నెలల పర్యంతం ఆపకుండా పాచికలను ఆడాడు. చివరకు పుష్కరుని చేతిలో ఓడిపోయాడు.
జూదంలో పిచ్చిపట్టిన వాడిలా ఉన్న నల మహారాజును చూచి భయమూ, శోకమూ కలిగినా పైకి కనపడనీయకుండా ఉన్నది దమయంతి. ముందు ఏమిచేయాలో అని తన కర్తవ్యాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించింది. నలుడు సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడని తెలిసికొని తనకు హితురాలు, అన్ని విషయాలలోనూ నేర్పరి, తమపట్ల ఎనలేని అనురాగం కలది, మాటకారి అయిన తన పరిచారిక ‘బృహత్సేనను’ పిలిచింది. పరిచారికతో
‘‘బృహత్సేనా! మంత్రులను శ్రీఘ్రమే పిలిపించుము. మహారాజు జూదంలో అంతా పోగొట్టుకొన్నదిగాక ఇంకనూ మిగిలియున్న ధనం ఎంతో తెలియపరచమని రాజాజ్ఞగా చెప్పుము’’ అని కోరింది.
బృహత్సేన వెంటనే పోయి విషయాన్ని మంత్రులకు తెలియపరచింది. మంత్రులందరూ కలిసి నలుని వద్దకు వెళ్ళారు. ఫలితం లేక వెనుదిరిగి దమయంతి చెంతకు వచ్చారు. మహారాజు వినటం లేదని విన్నవించారు. దమయంతి కూడా మరొకమారు నలునివద్దకు వచ్చి పరిస్థితిని వివరించింది. జూదాన్ని ఆపమని ప్రాధేయపడింది. ప్రార్థించింది. అయినా నలుడు జూద వ్యసనంలో దమయంతి మాటలను వినలేదు. చేయునది లేక దమయంతి సిగ్గుతో తన అంతఃపురానికి చేరుకొన్నది. జూదం నలునికి ప్రతికూలంగా ఉన్నదని గ్రహించింది. రాజు సర్వస్వం పోగొట్టుకొన్నాడని తెలుసుకొన్నది. వెంటనే తన పరిచారిక అయిన బృహత్సేనను పిలిచింది.
‘‘బృహత్సేనా! రాజాజ్ఞగా తెలిపిన రథసారథి అయిన ‘‘వార్‌ష్ణేయుని’’ వెంటనే తోలుకొని రమ్ము. వెంటనే వెళ్ళుము’’అని ఆజ్ఞాపించింది.
బృహత్సేన పరుగున వెళ్ళింది. వార్‌ష్ణేయుని చూచి ‘‘వార్‌ష్ణేయా! రాజాజ్ఞ ప్రకారం నీవు వెంటనే నాతో రాణివద్దకు రమ్ము!’’అని తెలిపింది.
వార్‌ష్ణేయుని తన వెంట నిడుకొని దమయంతి వద్దకు వచ్చింది. అప్పుడు దమయంతి దేశ కాల పరిస్థితులను, ప్రాప్తకాలాన్ని గుర్తించింది. వార్‌ష్ణేయుని చూచి
‘‘వార్‌ష్ణేయా! నలమహరాజు మంచిస్థితిలో ఉన్నప్పుడు నీ విషయంలో ఎలా ఉండేవారో నీకు తెలుసునుగదా! ఇప్పుడు రాజుగారు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అతనికి తగిన సహాయం చేయడానికి నీవే తగిన వాడవు! పుష్కరుని చేతిలో ఓడిపోయినప్పుడల్లా మహారాజుకు పాచికలపైన ఆసక్తి పెరుగుచున్నది. పుష్కరుని పాచికలు ఆతనికి ఆధీనాలై ప్రవర్తిస్తున్నాయి. నలుని పాచికలు నలుని అభీష్టానికి వ్యతిరేకంగా పడుతున్నాయి. జూదంపై వ్యామోహంతో మహారాజు తనవారి మాటలను, మిత్రుల మాటలను, సలహాలను చివరకు నా మాటలను కూడా పెడచెవిని పెడుతున్నాడు.
- ఇంకాఉంది