మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధంగా మా మాటలను వినకపోవడం మహారాజు దోషమని నేను తలంచడము లేదు. ఎందుకో మోహంతో మహారాజు నా మాటనుగూడా వినడం లేదు.
సారథీ! వార్‌ష్ణేయా! ఇపుడు నా మనసు నిర్మలంగా లేదు. నిన్నిప్పుడు శరణు వేడుచున్నాను. నా మాట పాలించి సహాయం చేయి! మహావేగంతో వెళ్ళే గుఱ్ఱాలను రథానికికట్టి, మా పిల్లలైన ‘‘ఇంద్రసేను’’ని, ఇంద్రసేనుని రథంపై కూర్చుండబెట్టుకొని వెంటనే ‘‘కుండిన నగరానికి’’ తీసికొని వెళ్ళాలి. వారిని నా తల్లిదండ్రులవద్ద క్షేమంగా చేర్చాలి! పిల్లలను వారివద్ద చేర్చి రథాశ్వాల సహితంగా నీవుగూడా యధేచ్ఛగా అక్కడనే ఉండుము. లేదా మరెక్కడికైనా వెళ్ళుము’’అని పలికింది.
అంత వార్‌ష్ణేయుడు దమయంతి చెప్పిన మాటలను విని నలమహారాజు మంత్రులవద్దకు వెళ్ళి విషయాన్ని వారికి నివేదించాడు. వారితో చర్చించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. మంత్రుల అనుమతిని పొంది వార్‌ష్ణేయుడు నలదమయంతుల పిల్లలను రథంపై ఎక్కించుకొని విదర్భ కుండిన నగరానికి చేరాడు. భీమమహారాజుకు నలుని విషయాన్ని విన్నవించాడు. ఇంద్రసేనుని, ఇంద్రసేనను భీమమహారాజుకు అప్పగించాడు.
గుఱ్ఱాలను, రథాన్ని కూడా కుండిన నగరంలోనే వదలివేశాడు. వార్‌ష్ణేయుడు. ఎక్కడెక్కడో తిరిగాడు. అలా తిరిగి తిరిగి చివరకు అయోధ్యానగరానికి చేరాడు. దుఃఖంతో ‘ఋతుపర్ణ’’ మహారాజును దర్శించాడు. విషయాన్ని విన్నవించాడు. రాజాజ్ఞతో ఋతువర్ణుని రథసారథియై జీవన భృతిని పొందాడు.
***
పుష్కరుడు నలుని రాజ్యమూ, ధనసంపదలు ఏ కొంచెంగూడా మిగల్చకుండా హరించాడు. సర్వస్వం కోల్పోయిన నలుని చూసి పుష్కరుడు
‘‘రాజా! నలమహారాజా! నీవు సర్వం కోల్పోయావు. ఇంకా పందెం పెట్టటానికి ఏమయినా ఉంటే జూదానికి రావచ్చును. ఇప్పుడు నీకు ఒక్క దమయంతి మాత్రమే మిగిలియున్నది. మిగిలినదంతా నాచే జయింపబడినది. దమయంతిని కూడా పణంగాపెట్టే తలంపు ఉంటే ఆట సాగించవచ్చును’’ అని అన్నాడు.
పుష్కరుని మాటలతో నలుని హృదయం కోపంతో కోసేసినట్లయింది. అయినా నీతిమాలిన మాట అన్న పుష్కరునితో ఏమీ అనలేదు. కోపం పెల్లుబకగా తన శరీరం మీద ఉన్న ఆభరణాలన్నింటినీ తొలగించాడు. ఒకే బట్ట చుట్టుకొని, దాసీజనం, మంత్రులు, పరివారం దుఃఖిస్తుండగా, చూస్తూ బయలుదేరాడు.
***
సకల జనాలచేత సత్కారాన్ని పొందటానికి యోగ్యతగలవాడైన నల మహారాజు విధి పరిపాకం చేత ఎవరిచేతనూ గౌరవింపబడలేదు. ఎవరూ పిలిచి తృప్తిగా భోజనం పెట్టలేదు. ప్రజలు ఈసడించుకొన్నారు. కలి ప్రభావం అంతటిది.
కేవలం నీరు మాత్రమే ఆహారంగా గైకొని నల దమయంతులిద్దరూ ఆ నగరం యొక్క సమీపంలో గడిపారు. అలా అక్కడ మూడు రాత్రులు గడిపారు. ఆకలి బాధతో నలుడు వృక్షాలనుండి ఫలాలను కోసుకొని తింటూ బయలుదేరాడు. దమయంతి నలుని అనుసరించింది.
బహుదినాలుగా ఆకలిగొన్న నలుడు ఒకనాడు వారిముందు బంగారు రెక్కలుగల పక్షులు తిరుగుతుండటం కనిపించింది. నలుడు ఆకలి బాధకు తాళలేక ఆ పక్షులు తగిన ఆహారంగా తనకు ఉపయోగిస్తాయని తలంచి.
‘‘ఈ పక్షులు నాకు ఆహారం అవుతాయి. బంగారం కూడా లభిస్తుంది’’ అని వాటిని పట్టుకొనడానికై ప్రయత్నించాడు. తాను కట్టుకొన్న వస్త్రాన్ని తీసి ఆ పక్షులపైకి విసిరాడు. ఆ పక్షులు నలమహారాజు విసరిన వస్త్రంతోపాటు ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. వాటిని చూచి ఆశ్చర్యపడుచూ విచారిస్తున్న నలుని చూచి ఆ పక్షులు‘‘ఓ! నలమహారాజా! బుద్ధిహీనుడా! మీరు కట్టుబట్టలతో వెళ్ళుతుంటే మాకు సంతోషంగాలేదు . అంటూ-