మెయన్ ఫీచర్

మోదీ ప్రతిపాదించిన పంచశీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షబ్‌నమ్‌లోనీ కాశ్మీరుకు చెందిన స్ర్తి. ఆమె న్యూఢిల్లీలో న్యాయవాదిగా పనిచేస్తున్నది. ఆమె మాట్లాడుతూ- ‘కాశ్మీ రు సుందర స్వప్నం. మా స్వర్గాన్ని నరకంగా మార్చారు’ అన్నది. ‘పాపం నిరుద్యోగులు ఐసిస్ జెండాలు పట్టుకొని తిరుగుతుంటే వారిని కాల్చి చంపటం అన్యాయం’ అన్నది. ఈ రెండు ప్రకటనలు విశే్లషించండి. కాశ్మీరంలో కుంకుమ పండుతుంది. కానీ ఇప్పుడు అక్కడ అరుణారుణ రుధిర వాహినులు ప్రవహిస్తున్నాయి. ఈ పాపం ఎవరిది? స్థూల దృష్టికి రాజాహరిసింగ్, షేక్ అబ్దుల్లా, జవహర్‌లాల్ నెహ్రూలది అనవచ్చు. కాశ్మీరులో ఇంతమంది సున్నీలు ఎలా వచ్చారు? హిందువులనందరినీ ముస్లింలుగా మూకుమ్మడిగా మార్చింది ఎవరు? మూడు లక్షల మంది కాశ్మీరీ పండిట్లను తరిమికొట్టింది ఎవరు?
కాశ్మీరీ తివాచీలు చాలా ప్రసిద్ధి. అక్కడి డ్రైఫ్రూట్లు అంతర్జాతీయ రంగంలో పేరుపొందాయి. ఈ వ్యాపారాలన్నీ ఏమైనాయి? పిల్లలు ఉద్యోగాలు లేక ఉగ్రవాదులుగా మారారని చెప్పటం సమంజసమేనా? టూరిజం మీద, ఫిలిం షూటింగుల మీద కాశ్మీరుకు భారీగా ఆదాయం వస్తుంది. అదంతా ఏమయింది? వైష్ణోదేవీ ఆలయం, అమరనాథ్ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇదంతా ఆదాయమే కదా? అమరనాథ్ యాత్రికులపై గ్రెనేడ్లతో దాడిచేస్తే నిరుద్యోగం తొలగిపోతుందా? అసలు సమస్య ఏమంటే కాశ్మీరు ప్రస్తుతం జీహాదీ ఉగ్రవాదుల కోరల్లో ఉంది.
కాశ్మీరును స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కోరే వర్గం పేరు హురియత్. జిలానీ వంటి వారి నాయకులకు పాకిస్తాన్ నుండి డబ్బు, ఆయుధాలు, మాదక ద్రవ్యాలు అందుతున్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన నిధులతో హురియత్ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నది. వారితో చర్చలు ఏం చేస్తారు? భారతదేశం చిన్నచిన్న దేశాలుగా విడిపోవాలని చైనా వాంఛిస్తున్నది. అస్సాంలో బోడో ఉగ్రవాదుల ఘాతుకాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో చొరబాట్లు ఇవన్నీ చైనా వ్యూహంలో అంతర్భాగాలే. నిజానికి పాకిస్తాన్ కన్నా చాలా పెద్ద మార్కెట్ చైనాకు ఇండియాలోనే ఉంది. అయినా చైనా పాకిస్తాన్‌తో ఎందుకు చెలిమి చేస్తున్నది? ఆగ్నేయ ఆసియాలో భారత్‌ను ఎదుగకుండా చేసి తాను నియంతగా వ్యవహరించాలనేది చైనా వ్యూహం. కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆ పార్టీ నేత మణిశంకర అయ్యర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీది రావణాసుర పాలన అన్నాడు. మణిశంకర అయ్యర్ లోగడ కరాచీ వెళ్లి అక్కడ ఉగ్రవాదులు, ఐసిస్ ఏజెంట్లు నిర్వహించే దునియా టి.వి.లో ఇంటర్వ్యూ ఇస్తూ ‘నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీరు తగినవారు’ అన్నాడు. అండమాన్ వెళ్లి వీరసావర్కార్ స్మృతి చిహ్నాన్ని ధ్వంసం చేసివచ్చి సోనియాగాంధీ మెప్పు పొందాడు. ‘నేను హిందువును కాను’ అని చెప్పుకున్నాడు. అలాంటివాడు ఇవ్వాళ భారతీయ పౌరుడుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని క్లిష్ట పరిస్థితులలో విమర్శించటం ఏమిటి? ముషారఫ్, భుట్టో, నవాజ్ షరీఫ్‌ల పరంపరలో చేర్చదగిన శత్రువులు దేశద్రోహులుగా ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తున్నారు.
పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలీ మాట్లాడుతూ, ఉగ్రవాదులను పాక్‌లోని రాజకీయ పార్టీలే పెంచి పోషిస్తున్నాయని చెప్పారు. పాక్ న్యాయవ్యవస్థ వార్షిక ప్రారంభ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని పఠాన్‌కోట్, నౌగాం, ఊరీ వంటి ప్రాంతాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో జమాలీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెప్టెంబరు 21న ఐరాసలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ‘కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా శాంతి అసాధ్యం’ అన్నారు. అంటే కాశ్మీరులో ప్లెబిసైట్ పెట్టకపోటం వల్లనే ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఈ మాటకు అర్థం. ఐరాసలో పాకిస్తాన్‌కు శృంగభంగమయింది. నవాజ్ షరీఫ్‌తో ద్వైపాక్షిక చర్చలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించలేదు. పాక్ ఉగ్రవాద దేశమేనని అమెరికన్ సభలో బిల్లును సభ్యులు ప్రవేశపెట్టారు. కాశ్మీర్ సమస్య అటుంచి నవాజ్‌షరీఫ్ తన పదవిని కోల్పోతాడన్న భయంతో ఇలా మాట్లాడుతున్నాడని విశే్లషకులు భావిస్తున్నారు. భుట్టో, బేనజిర్ భుట్టో, యాహ్యాఖాన్, ముషారఫ్‌లకు పట్టిన గతి నవాజ్ షరీఫ్‌కు ఐసిస్ చేతిలో పట్టబోతున్నది.
బుర్హన్‌వానీ ఉగ్రవాద సంస్థకు నాయకుడు. లోగడ హత్యలు చేసినవాడు. అతనిని ఐరాసలో ప్రపంచ దేశాలముందు నవాజ్‌షరీఫ్ శాంతి దూతగా స్వాతంత్య్ర సమరయోధునిగా వర్ణించటం ఏమిటి? దానిని షబ్‌నంలోనీ జాన్‌దయాల్ వంటివారు బలపరచటం ఏమిటి? వీళ్లదగ్గర ఇండియన్ పాస్‌పోర్టులున్నాయి. బహిరంగంగా పాక్‌పై ప్రేమ గీతాలు పాడుతున్నారు. బొంబాయిలో ఎవరిముఖం మీదనో ఎవరో ఇంక్ పోశారు. యుపిలో ఒక గ్రామంలో ఒకరిని గ్రామస్థులు కొట్టారు. అప్పుడు యాభై మంది మేధావులు, రచయితలు, రచయిత్రులు ఈ కారణాలు చూపించి తమ పురస్కారాలు తిరస్కరించారు. ఇప్పుడు పఠాన్‌కోట్, ఊరీ, నౌగాంగ్‌ల మీద పాకిస్తాన్ దాడిచేసి భారత సైనికులను వధిస్తుంటే ఈ అవార్డు వాపసీ బ్రిగేడ్ ఎక్కడ దాక్కున్నది? ముందే చెప్పినట్లు పాకిస్తాన్ మీద భారత్ ఆర్థిక ఆంక్షలు విధించటం కూడా యుద్ధంలో ఒక భాగమే. సింధూ నదీ జలాలు ఐదు పాయలుగా ప్రవహిస్తున్నాయి. అందులో మూడుపాయలు ఇండియా చేతిలో ఉన్నాయి. వెంటనే పాకిస్తాన్‌కు నీటిని ఆపివేయాలి. పాక్ విమానాలు భారత భూభాగంనుండి అవతల దేశాలకు పోకూడదనే ఆంక్ష విధించాలి. ఇస్లామాబాద్‌లో మన రాయబార కార్యాలయం మూసివేయాలి. న్యూఢిల్లీ నుండి అబ్దుల్ బాసిత్‌ను పాక్‌కు పంపించి పాక్ నుండి రావడానికి వెళ్లడానికి ఎవరికీ వీసాలు అనుమతించరాదు. 2016 సెప్టెంబరు 22వ తేదీ ఐరాసలో భారత ప్రతినిధి ఎం.జె. అక్బర్ మాట్లాడుతూ ‘ఉగ్రవాది బుర్హన్‌వానీని స్వతంత్ర సమరయోధునిగా, శాంతిదూతగా అంతర్జాతీయ వేదికపై నవాజ్ షరీఫ్ ప్రకటించటం ద్వారా పాక్ ఉగ్రవాద స్వభావం వెల్లడి అయింది’ అన్నారు.
తక్షణ చర్యలు..
1) 1996లో పాక్‌ను ‘ఆదరణీయ దేశం’ (మోస్ట్ ఫేవర్డ్‌నేషన్)గా గుర్తించారు. 2016లో ఇది రద్దుచేయవలసి ఉంటుంది.
2) ఫ్రాన్సుతో 7.8 బిలియన్ యూరోల ఒప్పందం ఇండియా కుదుర్చుకున్నది. ఫలితంగా 36 యుద్ధ జెట్ విమానాలు ఇండియాకు రాబోతున్నాయి.
3) బెలూచిస్థాన్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు బుగ్తీ ఇండియాలో ఆశ్రయం కోరాడు. దీనిని ఇండియా అంగీకరించింది. ఇప్పుడు స్వతంత్ర బెలూచీ ప్రవాస ప్రభుత్వాన్ని ముందుగా ఏర్పాటు చేయవచ్చు.
4) 1960లో పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల పంపకాల ఒప్పందాన్ని రద్దుచేయడం ద్వారా పాకిస్తాన్ జలవనరులను స్తంభింపజేయవచ్చు.
5) సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరిటస్ వంటి పాక్ అనుకూల దేశాలను ఇండియా పాక్‌కు వ్యతిరేకంగా మార్చగలిగింది. ఇది దౌత్యపరంగా విజయమే.
6) పాక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించటం ద్వారా ఆ దేశ ఆర్థికవ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. అప్పుడు కాశ్మీరులోని ఉగ్రవాద ముఠాలకు ఇప్పుడు పంపుతున్నట్లు పాక్ ఆర్థిక సహాయం అందించలేకపోవచ్చు.
7) ఐరాస నేతృత్వంతో అణ్వస్త్ర నిరోధక బృందాలను పాకిస్తాన్ ఉత్తర కొరియాలలోకి పంపి ఇక్కడ అణ్వస్త్ర స్థావరాలను ధ్వంసం చేయించాలి. లేకుంటే దక్షిణ ఆసియాకు శాంతి భద్రతలు ఉండవు.
8) ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. అక్కడ యూదులు జీవిస్తున్నారు. వారిని కబళించాలని చుట్టూ అరబ్బు ప్రపంచం ప్రయత్నిస్తున్నది. కాని ఇజ్రాయిల్ గోల్టా మేయర్ మోషేడయ్యడ్‌ల రోజులనుండి నిరంతర విజయాలు సాధించింది. కారణం అక్కడ ప్రతి పౌరుడూ ఒక సైనికుడే. సోమరిపోతుల దేశం ఎప్పటికీ విజయాలు సాధించలేదు.
గౌతమబుద్ధుడు ఆధ్యాత్మిక వికాసం కోసం ఐదు సూత్రాలను ప్రతిపాదించాడు. వీనికే ‘పంచశీలములు’అని పేరు. బౌద్ధులు వీటిని పాటిస్తారు. 1955నాటి భారత ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ గౌతముని స్ఫూర్తితో రాజకీయ పంచశీలను ప్రతిపాదించాడు. ఒక దేశపు ఆంతరంగిక వ్యవహారములలో మరొక దేశం జోక్యం చేసుకోకూడదు వంటి నీతి నియమాలు ఇందులో ఉన్నాయి. నెహ్రూ కన్నులముందే ఆయన ప్రతిపాదించిన పంచశీలను చైనా ఉల్లంఘించింది. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను శిక్షించే నిమిత్తం ఒక పంచశీలను విడుదల చేశాడు. అవి..
1) 1960 సింధూ జలాల ఒప్పందం రద్దు.
2) 1996నాటి పాక్ స్పెషల్ స్టేటస్ రద్దు.
3) ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరంగా పాక్‌ను ఏకాకి చేయటం
4) ఆర్థిక ఆంక్షలు విధించటం
5) రాయబార కార్యాలయం మూసివేత.
ఇవి తాత్కాలిక చర్యలు. సందర్భోచితంగా విమాన దాడులు చేసి పాక్ అణ్వస్త్ర స్థావరాలను ధ్వంసం చేయాలి.
బొంబాయిలో కొన్ని పార్టీలు బాలీవుడ్‌లోని పాక్ నటీనటులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించారు. షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించే పాక్ తార వంటి వారికి ఇవి వర్తిస్తాయి. సంగీతం అంతర్జాతీయ భాష. కవులు కళాకారులు ఒక దేశానికి, కాలానికి చెందరు. ఇది గొప్ప ఆదర్శం. కాని భారత సైనికుల శవాల మీద వీళ్లు ముషాయిరాలు నిర్వహిస్తారా?? వీర సైనికుల రక్తం మడుగులలో కలాలు ముంచి ప్రణయ గీతాలు వ్రాస్తారా?
షావద్‌ఖాన్, మహిరాఖాన్‌లు పాకిస్తాన్ నుండి వచ్చి షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటిస్తున్నారు. మరి ఈ కళాకారులు పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని ప్రకటన విడుదల చేయగలరా? తమ వసూళ్లను వీర జవాన్ల భార్యలకు ఇచ్చి ఆదుకోగలరా? అది లేనప్పుడు ఈ కళాకారులను ఎందుకు ఆదరించాలి?

- ముదిగొండ శివప్రసాద్