మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకుదుఃఖభారంతో కన్నీరుకారుస్తూ జాలిగొలిపే మాటలతో దమయంతి నలునితో
‘‘మహారాజా! మీ సంకల్పం విన్న నా హృదయం దహించుకపోతున్నది. నాథా! అన్ని రోగాలలో గొప్ప రోగం దుఃఖం. గొప్ప దుఃఖమనే రోగంతో పీడించబడిన వానికి మంచి మందు ఏదో కాదు. భార్యయే సుమా! ఎవడు భార్యతో కూడి ఉంటాడో అతడికి ఎన్ని కష్టాలైనా అనుభవిస్తున్నట్లు అనిపించదు.
‘‘ఓ రాజా! విసిగి ఉన్న సమయంలో, బడలిన సమయంలో, ఆకలిగొన్న వేళలో, దాహం వేసినపుడు, భర్తకు ప్రీతితో తోడ్పడి అతడి మనస్సులోని పరితాపాలను పోగొట్టుతుంది.
‘‘రాజ్యాన్ని, సర్వసంపదలను కోల్పోయి, ఆకలితో శ్రమపడుతూ వివస్తల్రైన మిమ్ము విడిచి నేనెలా వెళ్ళగలను. ఈ ఘోరారణ్యంలో బాధను పోగొట్టగలదానను నేనుమాత్రమే. కాబట్టి ఈమె నాపై ఆధారపడి బ్రతికేదనీ, నన్ను అన్నింటా అనురించేదనీ, దయచూపదగినదనీ తలంచి నన్ను విడవక నేను నీతోనే ఉండటానికి సమ్మతించుము.’’అని నలుని పాదాలనంటి ప్రార్థించింది.
‘‘దమయంతీ! నిన్ను విడచి వెళ్ళాలనే కోరిక నాకున్నట్లుగా నీవు అనుమానపడుచున్నావు. నన్నైనా నేను విడుస్తానుగానీ నిన్ను మాత్రం విడిచి పెట్టను. నీవు నాకు ప్రాణసమానురాలవు. భయపడకుము’’ అని దమయంతిని ఓదార్చాడు నలుడు.
‘‘మహారాజా! నన్ను విడచివెళ్ళాలనే మీకు లేనట్లయితే విదర్భ దేశానికి వెళ్ళే మార్గం గురించి నాకెందుకు చెప్పారు? నన్ను విడిచి వెళ్ళరని నేనెరుంగుదును గానీ, బుద్ధి పెడదారిపట్టి నన్ను ఏకాకిని చేసి విడిచి వెళ్ళకండి!
‘‘రాజా! విదర్భ, కోసల రాజ్యాలకు దారులను నాకు చెప్పడంవలన నాకు మరింత దుఃఖాన్ని పెంచుతున్నారు. విదర్భలో మావారివద్ద ఉండాలనుకుంటే మనమిద్దరం కలిసే వెళదాం! నా తండ్రి మిమ్ములను గౌరవిస్తారు. వారిచే పూజింపబడుచూ సుఖంగా ఉండవచ్చును’’అని అన్నది దమయంతి.
‘‘దమయంతీ! మీ తండ్రిగారి రాజ్యం నీకెంతో నాకూ అంతే! సందేహం లేదు! అయితే ఇప్పుడున్న విషమ పరిస్థితులలో నేనక్కడికి వెళ్ళలేను. రాజ్యభ్రష్ఠుడనై ఉన్న ఈ స్థితిలో వెళ్తే నీకు దుఃఖాన్ని మరింత వృద్ధిచేసిన వాడిని కాగలను.
‘‘చెడి చెల్లెలింటికి’’వెళ్ళినట్లే అవుతుంది. గౌరవం అనేది నేను కొన్నాళ్ళే పొందగలను. మంచి హితాలను పెడచెవినిబెట్టి వినకుండా సంపదలను, రాజ్యాన్ని పోగొట్టుకొని వచ్చిపడి తింటున్నాడు అనే అపవాదును నేను పొందకూడదు. నేను రాజును! తోటిరాజుయొక్క గౌరవాన్ని ఎంతవరకు పొందాలో నాకు తెలుసు! ఏదైనా అతి పనికిరాదు. అందువలన నేను నిన్ను మీ తండ్రివద్దకు వెళ్ళి సుఖింపుము అని అన్నాను. విధి అనుకూలిస్తే మరలా నేను పోగొట్టుకొన్నదానినంతా పొంది నీవద్దకు రాగలను’’అని అన్నాడు నలుడు.
సగం చీరతో ఉన్న దమయంతిని నలుడు పలుమార్లు ఊరడించాడు.
అలావారు అడవిలో ఏకాంతంగా పయనించారు. కొంతదడవుకు ఒకచోట ఒక గృహాన్ని (మండపాన్ని పూర్వం రాజులు కారడవులలో కూడా విశ్రాంతి గృహాలను కట్టించేవారు. పాదచారుల, వనచరుల విశ్రాంతికొరకు) చూచారు. నిర్మానుష్యమైన ఆ ఘోర వనంలో ఆ స్థలంలో ఆకలిదప్పులతో అలసిపోయి నేలపై కూర్చున్నారు. దుమ్ముధూళితో ఉన్న ఈ నేలపై పడుకొన్నారు. వివస్త్రుడై ధూళితో కప్పబడిన నలుడు అలసిపోయి దమయంతితోపాటు నిద్రించాడు. కానీ నలునికి నిద్రపట్టలేదు. సుకుమారి అయిన దమయంతి దుఃఖిస్తూనే నిద్రలోనికి జారుకొంది. శోకసంతప్త హృదయుడైన నలునికి మాత్రం పూర్వంవలె నిదురపట్టుటలేదు. రాజ్యం అపహరింపబడటం, మంత్రులను వినవడం, వనంలో జరిగిన అవమానం అన్నీ గుర్తుకువచ్చి చింతాక్రాంతుడయ్యాడు. ఏమీ అంతుపట్టడంలేదు. ఏదీ తెలియడంలేదు. స్వజనాన్ని విడచిపెట్టడమా? లేక మరణించడమా? ఏది శ్రేయస్కరమో తెలియడం లేదు. దమయంతిని తదేకంగా ఒకసారి చూచాడు. ఆమె తన పాదాల చెంతనే అలసిపోయి నిద్రలో ఉన్నది.