మెయన్ ఫీచర్

కార్గిల్‌లో భంగపడినా తీరు మారని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా 20 ఏళ్ల క్రితం కార్గిల్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య పరిమితంగా యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సేనలు తీవ్రవాద ముసుగులో రహస్యంగా నియంత్రణ రేఖను దాటు కొంటూ చొరబడి, వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తయన ప్రదేశాలను ఆక్రమించుకోగా, భారత సైనికులు నిరయంత్రణరేఖ లోపలనే పోరాటం జరుపవలసి వచ్చింది. తీవ్రమైన కష్టతరమైన పరిస్థితులలో, ప్రతికూలమైన వాతావరణంలో, అనుకూలంగా లేని భూభాగంలో జరుపవలసి వచ్చిన యుద్ధం అది.
దుర్భరమైన ప్రతికూల పరిస్థితులలో కూడా భారత సేనలు వాయుసేన సహకారంతో విజయం సాధించాయి. చాలామంది అసాధ్యమని భావించిన ఎత్తయన ప్రదేశాలను తిరిగి భారత సైనికులు స్వాధీనం చేసుకోగలిగారు. ఎత్తయన ప్రదేశం నుండి, దొంగచాటుగా అగ్నికణాల వలే కాల్పులు ఎదురవుతున్నా, కఠినమైన పరిస్థితులు నెలకొన్నా వీరోచితంగా పోరాడిన మన సైనిక అధికారులు, జవాన్లు నిజమైన హీరోలు. చాలామందికి ఎదురుగా మృతువు కనబడుతున్నా పోరాడుతూనే ఉన్నారు.
ప్రతికూలమైన పరిస్థితులలో ఈ యుద్ధంలో పోరాడి, దేశానికి విజయం తీసుకొచ్చిన వారందరికీ ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. వారికి కృతజ్ఞులై ఉంటారు. కార్గిల్‌లో సాధించిన విజయాన్ని ఇప్పుడు ప్రతి ఏటా జులై 26న ‘విజయ్ దివస్’గా జరుపుకొంటున్నాము. ఇది అద్భుతమైన విజయం. 527 మంది సాహసవంతులైన సైనికుల ఆత్మత్యాగంతో లభించిన విజయం.
అయితే ఈ యుద్ధంలో తోకముడిచినప్పటికీ పాకిస్థాన్ వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. దొంగచాటుగా సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూనే ఉంది. కార్గిల్ యుద్ధం నేర్పిన నిజమైన గుణపాఠం పాకిస్థాన్‌లో అసలు అధికారం రావల్పిండిలోని సైనిక నాయకత్వం చేతిలో ఉంది. పాక్ సైన్యం అండదండలతోనే ఆ దేశం ప్రాతిపదికగా గల ఉగ్రవాద సంస్థలు మనదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు దిగుతున్నాయి. అక్కడి రాజకీయ నాయకత్వం స్వతంత్రించి భారత్‌తో సంబంధాలు మెరుగు పరచుకొనే దిశలో ఏమీ చేయలేని పరిస్థితి ఉందని స్పష్టమైంది. 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో ఘోర పరాజయం అవమానంతో భారత్ పై ప్రతీకార చర్యకు రెండు దశాబ్దాలుగా వేస్తున్న ఎత్తుగడలకు పరాకాష్ఠగా నాటి పాకిస్థాన్ సైన్యాధిపతి పేర్వేజ్ ముషారఫ్ భారత్ భూభాగంలోని సేనలను ఎత్తయన కార్గిల్ ప్రాంతంవైపు తరలించి దురాక్రమణకు పాల్పడ్డారు.
లాహోర్ కు బస్సు యాత్ర జరిపి, పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ను ఆలింగనం చేసుకొని, రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ వివాదాలను పరిష్కరించుకొందామని అప్పటి ప్రధాని వాజపేయ ప్రకటన చేసిన మూడు నెలలకే ఈ దురాక్రమణ జరగడం గమనార్హం. ఒక వంక పాకిస్థాన్ రాజకీయ నాయకత్వం వాజపేయితో శాంతికోసం సమాలోచనలు జరుపుతున్న సమయంలోనే ఈ దురాక్రమణకు సన్నాహాలు చేయడం గమనార్హం.
ఇది జరిగిన 15 ఏళ్ళ తర్వాత అకస్మాత్తుగా 2015 డిసెంబర్ 25న లాహోర్‌లో దిగి ఆ దేశాధినేత నవాజ్ షరీఫ్ ను కలసి శాంతికోసం అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించిన వారం రోజులకే పాకిస్థాన్ సైన్యం ప్రోద్భలంతో ఉగ్రవాద కార్యకలాపాలు చేబడుతున్న జైష్ ఇ మొహమ్మద్ పఠాన్‌కోట్ వద్దగల భారత్ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి పాల్పడింది. మోదీ లాహోర్‌లో దిగిన రోజునే ఈ దాడికి పథకం వేసిన్నట్లు ఉగ్రవాదులు ఉపయోగించిన వాహనంలో లభించిన నోట్ వెల్లడి చేసింది. పైగా ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేరుగా రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయం అండతోనే అధికారంలోకి వచ్చినవాడు కావడంతో అక్కడ ఉగ్రవాదులకు సైన్యం అండగా ఉన్నంతకాలం రెండు దేశాల మధ్య శాంతి సాధ్యం కాదని స్పష్టం అవుతుంది.
ఒక విధంగా కార్గిల్ యుద్ధం భారత్‌కు చాలా ప్రతికూల సమయంలో ఎదురైనది. మనసేనలు సుమారు రెండు దశాబ్దాలుగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మునిగి సరిహద్దు భద్రతను ఒక విధంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మరోవంక అవసరమైన ఆయుధ సామగ్రి వారివద్ద లేవు. పదేళ్ల యూపీఏ పాలనలో విధానపరమైన అలసత్వం కారణంగా మందుగుండు సామాగ్రిని కూడా తగినంతగా సమకూర్చుకోలేకపోయాం. స్వదేశీ ఆయుధ ఉత్పత్తుల పట్ల దృష్టి సారించకపోయాం.
లేజర్ బాంబులతో పాటు పలు విధాలుగా ఇజ్రాయిల్ సాంకేతిక మద్దతు అందించని పక్షంలో కార్గిల్ యుద్ధంలో ఏకపక్షంగా పాకిస్థాన్ వెన్నుచూపి పారిపోవలసి వచ్చేది కాదు. పైగా ఆ సమయంలో ప్రధాని వాజపేయి ప్రదర్శించిన అసామాన్యమైన దౌత్యనీతి, ధృడ నిర్ణయాలు సహితం కలసి వచ్చాయి. ఎన్ని వత్తిడులు ఎదురైనా మన సేనలను సరిహద్దు దాటి వెళ్లవద్దని కట్టడి చేయడంతో మొత్తం ప్రపంచం పాకిస్థాన్ కుట్రపూరిత దురాక్రమణకు గుర్తించింది. దాంతో అంతర్జాతీయంగా పాకిస్థాన్ మొదటిసారిగా ఒంటరిదయినది.
చివరకు పాకిస్థాన్ మిత్రపక్షమైన చైనా సహితం ఈ విషయంలో మద్దతు ఇవ్వలేక పోయింది. కార్గిల్ యుద్ధం రెండు దేశాలు అణుపరీక్షలు జరిపిన ఏడాదికే జరగడంతో ఒక విధంగా ప్రపంచం కంగారు పడింది. ప్రపంచ చరిత్రలో రెండు అణ్వాయుధాలు గల దేశాల మధ్య జరిగిన యుద్ధం ఇది రెండోవది మాత్రమే కావడం గమనార్హం. గతంలో చైనా, రష్యాల మధ్య ఒక సారి యుద్ధం జరిగింది.
కార్గిల్ పోరు నుండి నేర్చుకున్న మరో గుణపాఠం కేవలం- అణ్వాయుధాలు ఉన్నంతమాత్రం చేత యుద్దాన్ని నివారింపలేమని తేలింది. తమ వద్ద అణ్వాయుధం ఉండడంతో ప్రపంచం కంగారు పడి, రెండు దేశాల మధ్య రాజీకి వస్తాయని పాకిస్థాన్ ఆశించింది. అయితే వాజపేయి దౌత్యనీతి కారణంగా పాకిస్థాన్‌నే తప్పుపట్టాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అయితే నవాజ్ షరీఫ్‌ను పిలిచి వెంటనే, బేషరతుగా కార్గిల్ నుండి పాక్ సేనలను ఉపసంహరించుకోమని పరోక్షంగా ఆదేశించారు. భారత్ గనుక తన భూభాగంలోకి ప్రవేశిస్తే అణ్వాయుధాలను ప్రయోగించాలని పాకిస్థాన్ పథకం వేసుకున్నట్లు ఆ తర్వాత వెల్లడైనది. ఈ సందర్భంగా అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ స్పష్టమైన హెచ్చరిక చేసారు. పాకిస్థాన్ ముందుగా ఒక అణ్వాయుధం భారత్‌పై ప్రకటిస్తే ఆ దేశం తేరుకొనే లోపు భారత్ ప్రతిఘటిస్తుందని, అప్పుడు పాకిస్థాన్ ప్రపంచ పటంలోనే లేకుండా పోతుందని స్పష్టం చేశారు.
కార్గిల్ యుద్ధం తర్వాతనే భారత్, అమెరికా సంబంధాలు బలపడడానికి గట్టి పునాది ఏర్పడింది. అప్పటి వరకు ఒక విధంగా అమెరికా పాకిస్థాన్ అనుకూల ధోరణులు అనుసరిస్తున్నది. నిఘా వైఫల్యం, మన సైన్యం సిద్ధంగా లేకపోవడం, అవసరమైన రక్షణ , ఆయుధ పరికరాలు వారి వద్ద లేవని వెల్లడి కావడంతో యుద్ధం పూర్తి కాగానే వాజపేయి కార్గిల్ సమీక్ష కమిటీని ప్రముఖ రక్షణ నిపుణుడు సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటు చేసి, మొత్తం పరిష్టితులను సింహావలోకనం చేశారు.
ఆ కమిటీ సిఫార్సుల అమలుకు వెంటనే మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం విస్తృత అధ్యయనాల అనంతరం ఇచ్చిన సిఫార్సుల అమలును ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పటిష్టమైన సైనిక నిఘా విభాగం ఏర్పాటు చేసి, ఎవరూ ఊహించని నిధులు కేటాయించారు. రక్షణ బడ్జెట్‌ను కూడా గణనీయంగా పెంచారు. సైన్యం, ప్రభుత్వం మధ్య సంబంధాలు మెరుగు పరచడానికి పలు చర్యలు చేపట్టారు. అయితే వాజపేయి తర్వాత ఈ దిశలో ప్రయత్నాలు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. విధానపరమైన చర్యలు తీసుకోవడంలో, రక్షణ సామగ్రి సమకూర్చు కోవడానికి అవసరమైన నిధుల కేటాయింపులో, స్వదేశీ ఆయుధాలు ఉత్పత్తిలో చెప్పుకోదగిన పురోగతి సాధించలేక పోతున్నాము.
‘్భరత్‌లో తయారీ’లో భాగంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రయత్నం చేస్తున్నా ఒక వంక ప్రభుత్వ రంగ సంస్థలు తమ గుత్త్ధాపత్యాన్ని వదులు కోవడానికి సిద్దపడక పోవడంతో ప్రైవేట్ పెట్టుబడులు చెప్పుకోదగినంతగా రావడం లేదు. 2019 ఎన్నికలలో జాతీయ భద్రతను కీలక ప్రచార అస్త్రంగా ఉప యోగించుకున్న ప్రధాని మోదీ తన మొదటి బడ్జెట్‌లో రక్షణ రంగాలకు జీడీపీతో పోల్చుకొంటే అతి తక్కువ నిధులు- కేవలం 1.5 మాత్రమే కేటాయించడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికీ కీలకమైన కార్గిల్ సమీక్ష కమిటీ సిఫార్సులు పలు అమలుకు నోచుకోవడం లేదు. సైన్యం అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడంలో వెనుకబడి ఉంది. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సరిపోవడం లేదు. సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా సైన్యాన్ని ఆధునీకరించడానికి అత్యాధునిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని కార్గిల్ 20వ వార్షిక సంస్మరణ సందర్భంగా అయినా ప్రభుత్వం గుర్తించాల్సి ఉన్నా అలా జరగడం లేదు.

-చలసాని నరేంద్ర 98495 69050