మెయిన్ ఫీచర్

బతుకుమ్మ బతుకుమ్మ ఉయ్యాలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లెలు వలసబోతున్నాయి. కాలం మారుతుంది. కాలానుగుణంగా మనుష్యుల మనస్తత్వాలూ మారుతున్నాయి. ఆధునీకత్వం ప్రపంచీకరణ, స్వేచ్ఛ్భారతంలో రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి. అయినప్పటికినీ సమాజంలో మార్పులు, చేర్పులు చేరుతున్నప్పటికీ నవతరం నేటి తరం వారు తమదైన శైలిలో పూర్వపు మూలాలను స్మృతి తెచ్చుకుంటూ నవ సమాజంలో జరుగుతున్న సంస్కరణలు, ప్రగతి పథంలో పయనిస్తూన్నా జన జాగరణకై ఈనాటి మహిళా శక్తి పండుగలు, పబ్బాలలోను తమ ఆట, పాటలతో సరదాగా గడుపుకునే పండుగలను ఆధునీకరిస్తూ ఆచరిస్తూన్న పండుగలలో సాటిలేని మేటియైన నేటి పడతుల పండుగ ఆధునిక బతుకమ్మ.
భాగ్యనగరంలో బతుకుమ్మ
ఇక నగరంలో బతుకుమ్మ గురించి తెలుసుకుందాం. భాగ్యనగరం భాగ్యమైన సంపన్నుల నిలయమైన వీధిలో ‘‘దుర్గా, ఈ రోజునుండి బతుకమ్మ పండుగ మొదలవుతుంది గదే. ఓ గంట తరువాత రైతు బజారు వైపు పోయి బతుకమ్మను పేర్చే పూలు, పట్రా’’ అంది రమణీమణి.
‘‘మా వాడకట్టుకు అప్పుడే వచ్చినయ్. నే ఇప్పుడే తీసుకవస్త, మా పిల్లకు కూడా చెబుతా’’ అంది దుర్గ.
‘‘ఈ నూరు రూపాయలు తీసుకొని అన్నీ పట్రా, మళ్లీ మళ్లీ ఏం తిరుగుతావ్’’ అంది రమణి.
‘‘ఏదో శాస్త్రానికి బతుకమ్మ పండుగ. ఎవరు ఆడుతారే ఈరోజుల్లో. ఇదేం మన వూరా? ఎక్కడివాళ్ళ అక్కడే ఆఫీసులకు పోయి రాత్రి ఏడు గంటలకు ఇళ్ళకు అలసీ సొలసి వచ్చేసరికి వారికదే బతకమ్మ పండగ అవుతుంది’’ అన్నాడు మూర్తి రమణి భర్త.
‘‘ఏదో ఆడపిల్లలున్న ఇళ్ళు కదండీ. గౌరి పూజ బతుకమ్మ పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన తరం వరకు చేసుకుందాం. ఆ తరువాత ‘నందో రాజా భవిష్యతి’ వేదాంత ధోరణిలో రమణి.
ఉరుకుల పరుగులతో ఉదయం గడిచింది. ఇప్పటికిగాని పని తీరింది. కొంచెం నడుం వాల్చిన తరువాత బతుకమ్మను పేర్చితే ఓ పెద్ద పని అవుతుంది.
‘‘అమ్మగారూ, మీరు చెప్పినవన్నీ పట్టుకొచ్చా. నేను కూడా బతుకమ్మ పేర్చడం నేర్చుకుంటాను. తానం చేసి అరగంటలో వస్తా’’నంటూ

వెళ్లిపోయింది దుర్గ.
అరగంటలో ఠంచనుగా వచ్చి చాపపరచి తాను తెచ్చిన పూలు అన్నీ రాశిగా పోసి ‘‘అమ్మగారు వస్తారా’’.
‘‘అప్పుడే వచ్చినావా, వస్తున్నా’’.
‘‘ఆ పెద్ద పళ్ళెం తీసుకో. దాన్ని శుబ్బరంగా తుడిచి అడుగున గుమ్మడాకు ఉంటే అది, లేకుంటే తామరాకు, అదీ లేకుంటే తంగేడు ఆకులు ఒక వరుసగా, గుండ్రంగా పేర్చు. ఆ తరువాత తంగేడు ఆకు లేకుండా పూలు మంచివి చూసి రెండు వరుసలు పేర్చు. తరువాత ఊదా పూలు ఒక వరుస, ఎర్రపూలు వరుస, నీకు ఎంత ఎత్తు కావాలనుకుంటే అంతెత్తుగా జాగ్రత్తగా పేర్చు. ఎత్తేటప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి సుమా. చివరిగా పైన పసుపు ముద్ద ను త్రిభుజం

అంటే గోపురంగా చేసిపెట్టి కొంచెం కుంకుమ కూడా చల్లు’’. అట్టాగే అమ్మగారు. అమ్మగారూ, ఈ బతుకమ్మ పాటలు మీకాడ నేర్చుకోవాలమ్మా. మా బస్తీలోళ్ళు ఎంత మంచిగ పాత పాటలు పాడుతారమ్మా’’ అంది. నాకేమో కొత్త పాటలు కాలం తగినవి నేర్చుకోవాలని వుంది. ఇపుడు కాలం మారిపోయింది. పాత పాటలు ఎందుకే, నేను నీకు కొత్త పాటలే నేర్పుతాను, నేర్చుకో.
ఒక్కొక్క పూవేసి చందమామ
పలకా బలపం పడదాం చందమామ
ఓనమాలు దిద్దుకుందాం చందమామ
ఒంట్లు నేర్చుకుందాం చందమామా
బాగుందమ్మగారు, చదువు నేర్చుకుందామంటున్నా ఇంగ చెప్పండి.
వేలి ముద్రలు మానుదాం చందమామ
సంతకాలు చక్కగా చేద్దాం
మన తల రాతలే మార్చుకుందాం చందమామ
*******
ఉయ్యాల, ఉయ్యాల, ఉయ్యాలో
పల్లెలోన బెల్టు షాపులొచ్చె ఉయ్యాలో
తాళిబొట్టులు తాకట్టుకుపోయె ఉ
తాగి తందనాలడసాగిరి
మొగడి పెళ్ళాల జగడం పెరిగె ఉ
కొంపలు కూలే కాలం వచ్చే
తన్నులాటలు గుద్దులాటలొచ్చె ఉ
ఇంకా ఎన్నాళ్ళు ఈ రక్కసితో బాధలు
అందరు నడుము కట్టి ఉయ్యాలో
సారా రక్కసిని తరిమి తరిమికొడదాం
మన బతుకులను బంగారుమయం చేసుకుందాం ఉయ్యాలో ఉ
అమ్మగారు, మా బస్తీలో తాగని మొగాడే లేడు. పొద్దుగల్ల సంపాదించినదంతా తాగుడుకే. మీరు బాగా చెప్పారు. ఆడోళ్ళు ఏకమైతే ఎంత బావుండు.
‘‘ఇంకొకటి కూడా వినుమా
వేషభాషలు మారాయి కోలో
మోసాలు, దగాలు పెరిగాయి కోలో
బొట్టు కాటుక మోటు ఆమె
బొట్టు బిళ్ళలు చోటు చేసుకునే కోలో
అమ్మా, నాన్న కమ్మని పదాలు పోయి
మమీ, డాడీ ముద్దు ముద్దు పదాలొచ్చె కోలో
సెల్లు ఫోన్లు చేతికొచ్చె
సొల్లు కబుర్లు ఎక్కువాయె కోలో
ఆమ్లాల దాడి వచ్చె కోలో
ముసురు మొఖాలతో కోలో
అత్యాచారాలు పెరిగే
ఎయిడ్స్ రాకాసిని తరిమికొడదాం కోలో
నిర్భయ చట్టాలొచ్చె
‘షీ’ టీంలు అభయమిచ్చే కోలో
సామాజిక భద్రత పెరిగే కోలో
అందరం కల్సి అవినీతితో పోరాడి
బంగారు బతుకును సాధిద్దాం కోలో
ఇవన్నీ మా వూరు పోయినసారి వెళ్లినప్పుడు అక్కడి స్ర్తి జనశక్తి పాడిన పాటాలు. అవి నీకు వినిపించాను. అమ్మా చాలా బాగున్నాయి. మా బస్తీ వాళ్ళకు నేను వినిపించి వాళ్ల కళ్ళు తెరిపిస్తాను. ఇంకా సద్దుల నాటి వివరాలు కూడా చెప్పండి. అయితే చివరి రోజులు కనుల పండుగగా సాయంకాలం ముతె్తైదువలు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు.
వాయనాలు అంటే?
నానబెట్టిన శెనగలు, తమలపాకులు దోసిట్లో పెట్టుకొని ఇంకొక చేతుల్లో ‘ఇచ్చుకుంటున్నా వాయనం’, ‘పుచ్చుకుంటున్నా వాయనం’’ అంటూ ఒకరినొకరు అభినందించుకుంటారు. వాయనంలో పచ్చి నానబెట్టిన శనగలు, తమలపాకులు, రెండు వక్కలు ఉంటాయి. తరువాత ఇంటి గుమ్మం పైభాగంలో చల్లతో మూడుసార్లు తట్టి బతుకమ్మను అతి జాగ్రత్తగా తలపై పెట్టుకొని వయ్యారంగా నడుస్తూ ఒకరినొకరు హస్యోక్తులతో తటాం లేదా చెరువు ప్రాంతాలకు వెళ్లి అక్కడి మైదానంలో ఆ బతుకమ్మలను పెట్టి వలయాకారంగా తిరుగుతూ చప్పట్లతో

పైన చెప్పిన పాటలను పాడుతూ తదనంతరం మంగళహారతిని ఈ విధంగా పాడతారు.
సద్దుల బతుకమ్మ నీకు మంగళం
ముద్దుల బతుకమ్మ నీకు మంగళం
తెలంగాణ తల్లి బతుకమ్మా మంగళం
చల్లగా చూసే మా బంగారు బతుకమ్మ మంగళం...
పోయి రావమ్మా మా బంగా రు బతుకుమ్మా.. అంటూ వీడ్కోలు పాటతో హారతులిచ్చి మెలమెల్లగా నీటిలో దిగి పళ్ళెరాలలోకి నీళ్ళు రాగా, బతుకమ్మలను నీళ్ళలో వదలగా, అవి వయ్యారం సాగిపోతూంటే తమ కళ్ళకద్దుకొని ఆనందబాష్పములతో ఇంటికి తిరుగుముఖం పడతారు. ఇదీ బస్తీలో బతుకమ్మ కథ.

- కొలనుపాక మురళీధరరావు