మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చాలా భయపడుచున్నాను! దర్శనభాగ్యాన్ని కల్గించుము! నా గురించి నేను దుఃఖించడం లేదు. ఒక్కరూ మీరేవిధంగా ఉండగలరో అని మీ గురించే విచారిస్తున్నాను.
నన్ను కానక మీరేలా ఉండగలరు?
అని అనేక విధాల పరితపిస్తూ, ఎలుగెత్తి పిలుస్తూ, నలుదిక్కులా పరుగెత్తుతూ దమయంతి విలపిస్తూ వెదుకసాగింది. భయం ఆవహించింది. కొంతసేపు అలా నిట్టూరుస్తూ, దుఃఖిస్తూ.
‘‘ఎవడు వేసిన నిష్కురణ నింద వలన నలుడు ఈ విధంగా దుఃఖార్తుడై బాధలననుభవిస్తున్నాడో అతనికి మేము అనుభవించే దుఃఖంకంటే వేయి రెట్లు అధిక దుఃఖం కలుగుగాక!’’
ఏ పాపం ఎరుగని నలుని విషయంలో ఇట్టి పాప కర్మనాచరించినవాడు ఇంతకంటే దుఃఖాన్ని పొంది కష్టాలల్లో జీవించుగాక!’’ అని శపించింది.
దారితప్పిన మృగంలాగ ఆక్రందనచేస్తూ అటూ ఇటూ పరుగులు తీసింది. ఈ విధంగా నడుస్తున్న దమయంతిని, అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక కొండచిలువ అతి శీఘ్రంగా సమీపానికి చేరి దమయంతిని పట్టుకోగా దమయంతి నడవలేకపోయింది. కొండ చిలువ తనను పట్టుకొన్ననూ దమయంతి మాత్రం నలుని గురించి మాత్రమే దుఃఖిస్తూ.
‘‘ఓ రాజా! ఓ నలమహారాజా! ఎక్కడున్నావయ్యా! నన్ను ఇంతదాకా ఉపేక్షించావు. ఈ నిర్జనారణ్యంలో ఇప్పుడు నన్ను సంరక్షించే వాడెవడు? అనాథగానున్న నన్ను ఒక పెద్ద పాము పట్టుకొన్నది. నన్ను తినబోతున్నది. ఈ స్థితిలోగూడా నీవు నావద్దకు రావేల? ఆకలి బాధతో బడలియున్న నిన్ను ఆదుకొని నీ శ్రమను ఎవరు పోగొట్టగలరు?’’అని ఆక్రందిస్తూ దమయంతి పెద్దగా అరిచింది.
అలా మొఱపెట్టుతున్న దమయంతి ఏడుపు, కేకలు విన్న ఒక కిరాతకుడు (బోయవాడు) వెంటనే దమయంతివద్దకు వచ్చాడు. దమయంతిని పట్టిన కొండచిలువను చూచాడు. తనవద్దనున్న ఒక చురకత్తితో ఆ కొండచిలువ ముఖంనుండి క్రిందివరకు చీల్చిపారేశాడు. ఆ కొండ చిలువ చేష్టలుడిగి మరణించింది. ఆ పెనుబాము ముఖంనుండి దమయంతి బయటపడింది.
వెంటనే ఆ సర్పముఖంనుండి బయటపడిన దమయంతి దగ్గరనున్న ఒక కొలనులో స్నానంచేసి బడలిక తీర్చుకొన్నది. ఆ కిరాతకుడు ఆమె ఆకలి తీర్చాడు. అడవిలో దొరికిన పండ్లను ఏరితెచ్చి ఆహారంగా పెట్టాడు. పిమ్మట దమయంతిని చూచి
‘‘ఓ హరిణ నయనా! నీవు ఎవరిదానవు? నీవిట్లు ఒంటరిగా ఈ కారడవిలోనికి వచ్చావు? ఇట్టి కష్టాల పాలవడానికి కారణమేమి?’’అని అడిగాడు.
వాడి మాటలు విన్న దమయంతి అంతవరకు జరిగినది జరిగినట్లుగా చెప్పింది. ఆ కిరాతుడు సగం చీర కట్టుకొన్న దమయంతిని ఆమె పిఱుదులను, స్తనాలను, తీర్చిదిద్దినట్లున్న కనుబొమలను, వంపు తిరిగిన కనురెప్పలతో కూడియున్న నేత్రాలను, పున్నమిచంద్రుని వంటి ముఖాన్ని, మధుర స్వరాన్ని చూచి కామపరవశుడయ్యాడు. చివరకు తన మనసులోని కోర్కెను వేడుకతో..
‘‘ఓ లతాంగి! నీ అందానికి నేను దాసుడనయ్యాను. నీలాంటి అందగత్తెను నేను ఇదివరలో చూడలేదు. ఇది కారడవి. ఇందు మనుష్య సంచారం ఉండదు. నేను వేటకై వచ్చాను. నేడు నాకు వేటలో జంతువులేగాక, అందమైన నిన్నుకూడా పొందగలిగాను. నా మాట మన్నించి నా కోర్కెను తీర్చుము’’అని అన్నాడు. ఆ కిరాతకుని మాటలను విన్న దమయంతి భయంతో
‘‘అన్నా! నేను నీకు ఉన్న విషయాన్ని చెప్పాను. నిస్సహాయను. ఒంటరి దానను. పరస్ర్తిని కామించటం అధర్మం. కోరి కష్టాలను తెచ్చుకొనకుము. దయతో నాకు దారిచూపి నన్ను క్షేమంగా ఈ అడవినుండి బయటకు చేర్చుము’’అని దీనంగా వేడుకొన్నది. కానీ ఆ కిరాతకుడు కామంతో కళ్లుమూసుకపోయి వదరడం ఆరంభించాడు.

- ఇంకాఉంది