మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓ తాపసోత్తములారా! ఓ మహానుభావులారా! మీ అగ్నికార్యాలు, పశుపక్షాదుల ఎడల ధర్మాన్ని సక్రమంగా నెరవేరుతున్నాయా? మీకు కుశలమేగదా?’’అని వారితో అన్నది. అందుకు
‘యశస్వినీ! మాకెల్లరకూ కుశలమే! ఇంతకూ నీవెవ్వరవు? ఏమిచేయదలచితివి? తేజస్సుతో వెలుగొందుచున్న నీ రూపం మాకెల్లరకూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది! నీవెందుకు ఇలా దుఃఖిస్తున్నావు? నీవేమయినా వనదేవతవా? లేక ఈ పర్వతరాజుకు పత్నివా? కాక ఒక దేవకాంతవా? అప్సరసవా? యక్షకన్యవా? గంధర్వ వనితవా? ఎవ్వరివో మాకు సవివరంగా తెలియపరచుము.
‘‘కళ్యాణీ! నీవు ఈ నదీ దేవతవా? యదార్థాన్ని తెలుపుము! భయపడవలసిన అవసరం లేదు. మేము తాపసులము!’’అని అడిగారు ఆ తపోధనులు. ఆ మాటలు విన్న దమయంతి
‘‘ఓ తపోధనులారా! నేను వనదేవతను కాను! మీరు అనుకొంటున్నట్లు నదీదేవతను కాను! అప్సరసను కాను! గంధర్వ కన్యనూ కాను! ఈ పర్వతరాజ పత్నిని అసలే కాను! కేవలం ఒక మనుజకాంతను మాత్రమే!’’
ఓ తపోధనులారా! నా వృత్తాంతాన్ని సవినయంగా విన్నవిస్తాను. దయతో అవధరించండి. పుణ్యచరితుడుగా కీర్తినార్జించిన వాడున్నూ, ఎల్లప్పుడూ యజ్ఞాలు చేయడంలో మిక్కిలి ప్రీతికలవాడున్నూ అయి ఈ భూమండలంపై పేరొందిన ‘నిషధ దేశాధిపతి’అయిన నలమహారాజుకు భార్యను! నా పేరు దమయంతి! విదర్భ దేశాన్ని పాలిస్తున్న పుణ్యచరితుడూ, పరమ పూజ్యుడూ అయిన భీమమహారాజు నా తండ్రి.
‘‘అట్టి నా నాథుని దుర్మార్గచరులై దుష్కృత్యాలు చేసే కొందరు పనిగట్టుకొని ఆహ్వానించి జూదంలో కుటిలమైన మార్గాలలో ఓడించి, సమస్తరాజ్యాన్నీ, ధనాన్నీ హరించారు. రాజ్యాన్ని కోల్పోయిన నా నాథుని వెదకుతూ ఈ నిర్జరారణ్యంలో ఒంటరిదాననై తిరుగాడుచున్నాను.
విధివిపరిపాకం చేత నా ప్రాణేశ్వరుడు నలుడు నన్ను విడచి ఎచటికో వెళ్ళిపోయాడు.
నేను ఒంటరి దాననయ్యాను. నా భర్తను వెదకుచూ వెదకుచూ ఇప్పుడు ఇక్కడికి చేరాను.
‘‘తపోధనులారా! నా భర్త నలుడు మీ తపోవనానికి వచ్చి మీ పాదాలకు నమస్కరించి ధన్యుడై ఎక్కడికైనా వెళ్ళిపోయాడా! నా భర్త వెళ్ళినవైపు మీకు తెలసియుంటే దయచేసి తెలియపరచండి! ఇంకొన్నినాళ్ళు నేను నా భర్తను చూడని పక్షంలో ప్రాణాలు విడిచి పెడతాను. నా భర్త లేకుండా నా ఈ జీవితం వ్యర్థం.’’అని దుఃఖిస్తూ తన వృత్తాంతాన్ని వివరించింది.
అలా అరణ్యంలో తపోవనంచేరి విలపిస్తున్న దమయంతిని చూచి సత్యద్రష్టలైన తాపసులు ఆమెతో
‘‘కళ్యాణీ! మేం తపోదృష్టితో చూశాం! త్వరలోనే నీవు నీ భర్త నలుని చూడగలవు. భవిష్యత్తు నీకు శుభాన్ని చేకూరుస్తుంది.
దమయంతీ! శత్రుంజయుడు, మిత్రుల శోకాన్ని నాశనం చేసేవాడు, ధార్మికులలో శ్రేష్టుడైన నిషాధాధిపతియైన నలమహారాజు త్వరలోనే పాపరహితునిగా దర్శించగలవు. నిషధ రాజ్యాన్ని పాలిస్తాడు. దుఃఖించవలదు’’అని చెప్పి ఆ తాపసులు అంతర్థానమయ్యారు.
అలా అంతర్థానమైన తాపసులను చూచి మహదాశ్చర్యాన్ని పొందింది దమయంతి, పూలు పండ్లతో కూడిన చెట్లు, రమ్యమైన ఆ నదీ తీరంలోని ఋష్యాశ్రమాలన్నీ మాయమయ్యాయి. విస్మయంతో దమయంతి నవ్వుకొని
‘‘ఏమీ! నేనేమయినా కలగన్నానా? నేను చూచినదంతా స్వప్నమేనా? ఆ ఆశ్రమాలెక్కడ? ఆ తాపసులేమయ్యారు? పుణ్య జలాలతో ప్రవహించే అందమైన ఆ నది ఎక్కడ? వివిధ పక్షిగణాలతో సేవింపబడుతూ, ఫల పుష్పాలతో శోభిల్లుచున్న ఆ పర్వతాలు ఏమయ్యాయి?’’అని విలపించింది.
తదుపరి దమయంతి ఆ ప్రదేశంనుండి మరొక ప్రదేశానికి చేరింది. కన్నీరు మున్నీరుకాగా ఒక అశోక వనాన్ని చూచి విలపించింది. ఆ వనంలోని పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి.
- ఇంకాఉంది