మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివురుటాకులతో, పుష్పాలతో అనేక శిఖరాలతో పర్వతరాజంవలె ఆకాశాన్నంటుచున్న ఆ అశోక వనాన్ని చూచి
‘‘ఓ అశోక వృక్షమా! నా ప్రియుడూ, పతి, నిషధదేశాధీశుడు, శత్రు భయంకరుడు, బాధారహితుడూ అయిన నలుడు అనే మహారాజును నీవేమైనా చూచావా?
జూదం అనే ఆటలో వ్యసనపరుడై రాజ్యాన్ని సర్వసంపదలనూ పోగొట్టుకున్నాడు. ఒక చీరముక్కతో దేహాన్ని కప్పుకొన్నవాడిని ఈ అరణ్యంలో చూశానా?
నీవు అశోక వృక్షానివి! శోకాన్నిపోగొట్టే దానివి! అందుకే నీకాపేరు వచ్చింది! నలుని గురించి నాకు తెలియపరచి నీ పేరును సార్థకం చేసుకో!’’అని బాధాపరితప్త హృదయంతో ఆ అశోక వృక్షానికి ప్రదక్షిణ చేసి అచటినుండి అంతకన్నా అతి ఘోరమైన మరొక ప్రదేశానికి చేరింది. అలా పయనిస్తూ మార్గమధ్యంలో అనేక పర్వతాలనూ, నదులనూ, వివిధ మృగాలనూ, పక్షులనూ, కొండ చరియలనూ, సెలయేళ్ళనూ చూస్తూచూస్తు నడక సాగించింది.
అలా నడక సాగిస్తూ ప్రబలి తీగలతో నిండిన ఒక నదిని దాటుతూ రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైనవాటితో కూడిన వ్యాపారుల సమూహాన్ని చూచింది. మనసు లేచి వచ్చి సంతోషాన్ని పొందింది. క్రౌంచ పక్షులు అరుపులతో, చక్రవాక పక్షుల కూజితాలతో విశాలమైన ద్వీపంలా ఒప్పుచున్న ఆ సార్థవాహన సమూహాన్నిచూచి మెల్లగా వారిని సమీపించింది.
జన సమూహంలో ప్రవేశించింది.
శోక సంతప్తయై, సగం చీరతో శరీరాన్ని కప్పుకొని, తేజోహీనమై, రేగిన దుమ్ము నెత్తిపై పడటం చేత ఎర్రబారిన ముంగురులు కలదానిని, ఆకలి, దప్పిక, నిదుర అనేవాటికి దూరమై పిచ్చిదానివలె తిరుగుచున్న దానిని, దమయంతిని చూచి కొందరు ఆమె దయ్యము అనుకొని భీతి చెందారు. పారిపోయారు. కొందరు ఆమెను అపహాస్యం చేశారు. కొందరు ఆమె వద్దకువచ్చి ‘‘అవ్వా! ఈ అడవిలో నీవు దేనికొరకు వెదకుచున్నావు?’’ అని ప్రశ్నించారు.
కొందరు ఆమెను ‘‘దేవీ! నీవు సాక్షాత్తు భువికి దిగివచ్చిన దేవతలా ఉన్నావు’అని మ్రొక్కారు.
‘‘కళ్యాణీ! నిన్ను చూచి మేము చాలా బాధపడుచున్నాము. నీవు అసలు మానవకాంతవా? ఈ పర్వతాలకు గానీ, అరణ్యానికి గానీ సంబంధించిన దేవతవా? నిజం చెప్పుము! నిన్ను మేము శరణుపొందుచున్నాము! నీవు యక్ష జాతికి చెందినదానవా? లేక రాక్షస స్ర్తివా! మా అందరికీ చెడు జరుగకుండా రక్షించి సుఖంగా గమ్యాన్ని చేరేలా తగినవిధంగా సహకరించుము’’అని ఆ సార్థసమూహం వేడుకొన్నారు.
అలా వారు పరిపరివిధాల వేడుకొంటూ పలుకగా వారినిచూచి దమయంతి...
‘‘వ్యాపారులారా! ఈ ఘోరాటవిలో ఇంతమంది ఈ వర్తక సమూహం కనిపించటం ఎంతటి పుణ్యమోగదా! మీలో యువకులు, వృద్ధులు, బాలురు ఉన్నారు. మీరంతా నన్ను మానవ కాంతగానే భావించకండి. నేనొక మహారాజు కుమార్తెను. మరొక రాజుకు కోడలును. ఒకరాజ పట్టమహిషిని. కనిపించకుండాపోయిన నా భర్తను చూడాలనే ఆసక్తితో ఉన్నదానను.
నా తండ్రి విదర్భను పాలించే ‘్భమమహారాజు’. నిషధ దేశాధీశుడు, సకల సద్గుణ సంపన్నుడు, దయామయుడు అయిన నలమహారాజు నా భర్త. అట్టి నా భర్తను వెదకుచున్నాను. నా భర్త నలుని వీరేమైనా చూశారా? మీకేమైనా తెలుసా? తెలిస్తే దయచేసి నాకు చెప్పండి’’అని అడిగింది. అంత
ఆ సార్థవాహన సమూహానికి నాయకుడైన ‘శుచి’అనే పేరుగలవాడు దమయంతితో
‘‘అమ్మా! కళ్యాణీ! నామాట వినుము. నేను ఈ సార్థవాహన సమూహానికి నాయకుడను. నలుడు అనే పేరుగలవానిని నేను చూడలేదు. ఈ కారడవిలో ఏనుగులు, అడవి దున్నలు, పెద్దపులులు, భల్లూకాలను మాత్రం చూశాను. మానవకాంత అయిన నిన్నుదప్ప మరొక మనుష్యమాత్రుణ్ణి ఈ ఘోరాటవిలో చూడలేదు.
- ఇంకాఉంది