మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు మాకు యక్షరాజైన ‘మణిభద్రుడు’ ప్రసన్నుడౌగాక!’’అని పలికాడు. అలా అన్న అతనితో దమయంతి
‘‘వ్యాపారులారా! మీరంతా ఇపుడు ఎచటకు పయనమైపోతున్నారు.? దయచేసి చెప్పండి!’’ అని ఆ సార్థవాహన సమూహ నాయకుడిని అడిగింది.
‘‘మేమంతా’’ చేధి దేశ భూపాలుడైన ‘‘సుబాహు మహారాజు రాజధాని నగరానికి వెళ్ళుచున్నాము’’అని ఆ శుచి తెలియపరచాడు.
‘‘అలా అయితే నేనూ మీతో వస్తాను! దయచేసి మీతో నన్నూ రానివ్వండి!’’అని ఆ సార్థవాహన సమూహంతో పయనించింది.
మిక్కిలి ప్రొద్దుపోయేవరకూ ఆ చనుప (సార్థం) పయనించి, చల్లని జలంతో, ఆహ్లాదకరంగా కనిపించే ఒక పెద్దతటాకం వద్దకు దాహం తీర్చుకొని విశ్రమించటానికై విడిదిచేసింది. వారంతా ఆ చెరువు పడమటి ఒడ్డునకుచేరి అచట విశ్రమించారు. అలసిపోయిన వారంతా గాఢ నిద్రలోనికిపోయారు.
అర్థరాత్రివేళ ఏనుగుల గుంపొకటి ఆ చెరువులోని నీరుత్రాగటానికై వచ్చింది.
ఏనుగుల మదస్రావంతో కలుషితమైన జలాన్నిచూచి, ఆ సమీపంలోనే ఉన్న ఆ వ్యాపారులకు సంబంధించిన ఏనుగుల గుంపును చూసింది. మదించిన ఆ అడవి ఏనుగులు, వ్యాపారుల ఏనుగులపైకి లంఘించాయి.
అతివేగంగా విరుచుకపడ్డ ఆ అడవి ఏనుగుల గుంపు ఎదురు తిరగటానికి స్పందించిన వ్యాపారుల ఏనుగులకు దారిలేకుండా చేశాయి. దారికడ్డంగా చెరువుదగ్గర పరుండి నిద్రిస్తున్న వ్యాపారులు మేల్కొనే లోపలే ఆ ఏనుగులు త్రొక్కివేస్తుంటే వారంతా హాహాకారాలు చేశారు. నిద్ర మత్తులో పరుగెడుతున్న కొందరు వ్యాపారులు ఆ ఏనుగుల కాళ్ళక్రింద పడి నలిగి మరణించారు. మరికొందరు ఏనుగుల తొండాలకు చిక్కి చనిపోయారు. ఇంకొందరు ఆ ఏనుగుల దంతాల పోట్లకు ప్రాణాలు కోల్పోయారు. ఆ అడవి ఏనుగుల విజృంభణవలన ఆ వ్యాపారుల ఒంటెలు, గుఱ్ఱాలు, పదాతి జనాలు భయంతో పరుగులు తీస్తూ ఒకరికొకరు తగిలి మరణించారు. ప్రాణాల రక్షణకై చెట్లెక్కిన వారిలో తొందరలో కొందరు ఎగుడుదిగుడుగా ఉన్న వృక్షాలమీద నుండి పడిపోయారు.
అడవి ఏనుగుల ఆక్రమణతో వస్తు సమృద్ధమైన ఆ వ్యాపారుల సమూహమంతా సర్వనాశనమైంది. భయపడిన సార్థవాహులు పెడబొబ్బలు పెట్టారు.
జరుగుచున్న దారుణ మారణకాండకు భయభ్రాంత అయిన దమయంతి లేచి విషయాన్నంతా గ్రహించింది. అక్కడినుండి లేచింది. అదిచూచిన అందులోని కొందరు
‘‘ఈ విధంగా ఎందుకు జరిగింది? ఏ కర్మ ఫలమిది? యక్షాధిపుడైన ‘మణిభద్రుని’ మనం పూజించలేదు.! విఘ్నకారకులైన దేవతలను కూడా మనం పూజించలేదు! ఈ విపరీతాలన్నీ శకునాల ఫలితాలేమో? గ్రహాల విపరీత గమనమే లేకుంటే ఈ విధంగా జరుగదు’’ అని అన్నారు.
మరికొందరు ‘‘ఉన్మాదివలె కనిపిస్తూ వికృతరూపమూ, అమానుషమైన రూపమూగల ఈ వనిత మనలను చేరింది. ఇంత దారుణం జరగటానికి ఈ స్ర్తియే కారణమేమో? ఈమె నిజంగా రాక్షసాయేమో? లేక భయంకరమైన యక్షిణి పిశాచమా? ఇప్పుడు జరిగిన కీడు అంతా ఆమె పనియే! ఇందులో సందేహము లేదు.! సార్థవాహ సర్వస్వాన్నీ నాశనంచేసిన ఆమెను కర్రలతో, రాళ్ళతోకొట్టి చంపాలి!’’అని అనటం మొదలుపెట్టారు.
అలా పరిపరివిధాల మాట్లాడుచున్న వారి మాటలు విన్న దమయంతి విలపించింది.
‘‘ఈ సంఘటన చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది! నాపైన విధి దారుణంగా ఉన్నది. ఎక్కడా మంచి జరగటంలేదు! ఇలా జరగటానికి ఏ కర్మ ఫలమో? నేను మనస్సులోగానీ, చేతలలో గానీ, మాటలలోగానీ ఎవ్వరికినీ కొద్దిపాటి కీడు తలపెట్టలేదు.
- ఇంకాఉంది