మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నిరోజులు గడచిన తరువాత నా భర్త నా చీరలో సగం చింపుకొని ఏ తప్పూచేయని నన్ను నిద్రిస్తుండగా వదిలేసి వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళిన భర్తను వెదుక్కుంటూ రాత్రింబవళ్ళు దుఃఖంతో దహించుకపోతున్నాను. నా ప్రాణేశ్వరుని పొందలేకపోయాను’’అని విలపిస్తూ చెప్పింది దమయంతి. అలా విలపిస్తున్న దమయంతిని ఊరడించిన రాజమాత
‘‘కళ్యాణీ! నీవు నాదగ్గరనే ఉండుము. నీవంటే నాకెంతో ప్రీతి కలిగింది. నీ భర్తను వెదకటానికై నేను బ్రాహ్మణోత్తములను పంపగలను. నా మనుష్యులు నీ భర్తను వెదకి గుర్తించటానికై అన్ని ప్రయత్నాలు చేస్తాను. లేదా అతడే అటూనిటూ తిరుగుతూ ఇచ్చటకు రావచ్చును. ఇక్కడే ఉండి నీ భర్తను నీవు పొందవచ్చును.’’అని అనగా దమయంతి ఎంతో సంతోషించి
‘‘అమ్మా! రాజమాతా! ఒక ఒప్పందంతో నేను మీదగ్గర ఉంటాను... నేను సైరంధ్రి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంగిలి తినను. కాళ్ళు పిసకటం వంటి పనులుచేయను. నా భర్తను అనే్వషించటానికై వెళ్ళే బ్రాహ్మణులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడే పనులకు నన్ను నియోగించగూడదు. పరపురుషుడెవడైనా నన్ను కోరినట్లయితే వానిని మీరు కఠినంగా శిక్షించాలి. కొన్ని సమయాల్లో అతడు మరణశిక్షను కూడా పొందాలి. ఇది నా వ్రతం. ఇవి మీకు ఇష్టమైతే మీదగ్గర ఉండటానికి నాకు సందేహం లేదు. మరొక విధంగానైతే నేనిచట ఉండను’’అని చెప్పింది దమయంతి.
రాజమాత ఎంతగానో సంతోషించింది. దమయంతిని చూచి
‘‘కళ్యాణీ! నీ ప్రతి నియమాలను అనుసరించి నీవు కోరినట్లుగానే అన్నీ చేస్తాను. నీ ఇష్టంవచ్చిన తీరున ఉండవచ్చును’’అని తన కూతురైన ‘సునందను’చూచి
‘‘సునందా! ఈమె సైరంధ్రి. దేవరూపిణె. ఈమె నీతో సమాన వయస్కురాలు. సఖి అవుతుంది. ఈమెతో కలిసి నీవు సంతోషంగా ఉండుము. అవసరమైన న్యాయంకూడా చేయవచ్చును’’అని అన్నది.
తదుపరి సునంద తన సఖీ సమేతంగా దమయంతిని తోడ్కొని పరమానందంతో తన గృహానికి వచ్చింది. దమయంతిగూడా సునంద గృహంలో గౌరవభావంతో మెలగుచున్నది. కోరినవన్నీ లభించటంతో దమయంతి అలయకుండా పుణ్యప్రదమైన నోములునోస్తూ భర్తనే హృదయంలో సదా ధ్యానిస్తూ భరించలేని వియోగ దుఃఖంతో బాధపడుతూ సైరంద్రిగా చేది భూపతిపురంలో కాలం గడుపుచున్నది. చేది రాజు అప్పుడు ‘సుబాహుడు.’
(20)
దమయంతిని విడిచి వెళ్ళిన తదుపరి నలుడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళుచున్నాడు. అంతట ఒకచోట పెనుమంటలతో విజృంభిస్తున్న కారుచిచ్చును తను ముందు చూచాడు. ఆ మంటలోనుండి ఎడతెగని నిప్పురవ్వల దొంతరలు ఆకాశమార్గాన్ని అంటుతూ పెద్దపెద్ద చెట్లను సైతం దహించి వేస్తున్నది. ఆ మంటల మధ్యలోనుండి ఒక ప్రాణి అరుస్తుండటం విన్నాడు నలుడు.
‘‘ఓ మహారాజా! నన్ను మన్ననతో రక్షించటానికై ఇచటకు వేవేగ రాగలవు నన్ను రక్షింపుము’’అని ఆర్తనాదంచేస్తున్న వైపునకు చూచాడు.
‘‘్భయపడవద్దు.’’ అని నలుడు సందేహించక వేగంగా ఆ దావాగ్ని మధ్యలోనికి ఉరికాడు. మంటలు చుట్టుముట్టుకొనియున్న ఒక నాగరాజును చూశాడు. ఆ అగ్నిమధ్యంలో నిరాశతో కృంగిన మొగంగలవాడు, చుట్టలుచుట్టలుగా శరీరాన్ని ముడుచుకొని ఉన్న నాగరాజు భయపడుతుండటాన్ని చూశాడు. అప్పుడు ఆ నాగరాజు గజగజ వణకిపోతూ నలునకు చేతులు జోడించి
‘‘నలమహారాజా! నేను నాగరాజైన ‘కర్కోటకుడిని’. మహా తపస్వియైన బ్రహ్మర్షి నారదుని నేను కాటువేశాను. ఆయన నాపైన కోపించి కదలకుండా ఉండమని శపించాడు.
- ఇంకాఉంది