మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా కర్కోటకుడు అంతర్హితుడైన తదుపరి నలుడు ఆ కీకారణ్యంలోనుండి బయలుదేరాడు.
కర్కోటకుడి వచనానుసారం అయోధ్యవైపునకు పయనమైనాడు. పదిరోజులు ప్రయాణంచేసి, పదవరోజుకు అయోధ్యాపురానికి చేరాడు. ‘బాహుకుడు’అనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దర్శనం చేసుకొన్నాడు.
‘‘మహారాజా! నా పేరు బాహుకుడు అని అంటారు. అశ్వహృదయం నాకు బాగాతెలుసును. అలాగే అశ్వశ్రేష్టుతను నిర్ణయించటంలో నాకు సాటి అయినవాడు ఈ భూమండలంలోనే లేడు. అలాటివారు మరెవ్వరూ లేరు. కష్టసమయాల్లో, నిపుణత విషయంలో నన్ను అడిగితే నేను సాయం చేయగలను.
మహారాజా! నేను పాకంలోగూడా నిపుణుడిని. పాకశాస్త్ర విషయాలు ఇతరులకంటే విశేషంగా తెలిసినవాడిని.
మహారాజా! నన్ను పోషించిన ఎడల లోకంలో దుష్కరమైన శిల్పాది కళల్ని (శిల్పవిద్య) సైతం చేయటానికి ప్రయత్నం చేయగలను’’అని తెలియపరచాడు.
‘‘బాహుకా! నీవు నావద్ద ఉన్నట్లయితే నా రథాశ్వాల గమనాన్ని వేగంచేసి తీర్చిదిద్దుము. ముఖ్యంగా నా మనసులో శీఘ్రయాన రహస్యాన్ని తెలిసికోవాలనే ఆలోచన ఉన్నది. నా గుఱ్ఱాలను వేగంగా నడిచేటట్లు, బలం కలిగినవిగా ఉండేటట్లుచేయుము. అలా నీవు చేయగలిగేటట్లయితే నీవు నా అశ్వాధ్యక్షుడవు అవుతావు. నీకు వేతనము నూరునూర్లు (పదివేలు)
‘‘బాహుకా! అంతేకాదు నావద్ద ఉన్న ‘వార్‌ష్ణేయుడు’, జీవలుడు అనే అశ్వరక్షకులిద్దరూ నిన్ను సేవిస్తుంటారు. నీవు వారిరువురితో కలిసి సంతోషంగా నా ఆశ్రయంలో ఉండుము’’అని చెప్పి నలుణ్ణి గౌరవించాడు.
నలుడు ఋతుపర్ణుని నగరంలోనే వార్‌ష్ణేయజీవలులతో అశ్వాధ్యక్షుడుగా ఉన్నాడు. చెడు గుఱ్ఱాలను లొంగదీసేవాడు. రుచికరాలైన ఆహార పదార్థాలను వండి వడ్డించేవాడు.
నిత్యం దమయంతిని తలుచుకొంటూనే నలుడు ఋతుపర్ణుని నగరంలో ఉంటున్నాడు. ప్రతిరోజు సాయంసమయంలో ఒక శ్లోకాన్ని చదువుకొనేవాడు.
‘‘ఆకలి దప్పికలతో బాధపడుతూ దమయంతి ఎక్కడ ఉన్నదోగదా! ఆ సాధ్వి అలసిపోయి ఎచటపరున్నదో. ఈ మందభాగ్యుని తలపోస్తూ ఇప్పుడు ఎవని ఆశ్రయంలో ఉన్నదోగదా!’’అని రాత్రిపూట ఇలా అంటున్న నలుని చూచి జీవలుడు
‘‘బాహుకా! నీవు ఏ స్ర్తిని గురించి తలచుకొంటున్నావు? నీవు నీ బాధను గురించి చెపితే వింటాను.’’
బాహుకా! నీవు ఏ స్ర్తిని దుఃఖిస్తున్నావు? ఆమె ఎవరికి సంబంధించిన స్ర్తి? అని అడిగాడు.
‘‘జీవలుడా! ఆమె ఒక బుద్ధిహీనుని భార్య. అందరికి ఇష్టురాలు. మాట ధృడతరమైనది. ఏదోఒక కారణంచే ఆ మందబుద్ధి ఆమెనుండి విడిపోయాడు. ఆమెచే విడువబడిన అతడు దుఃఖంతో శోకసంతప్తుడై రాత్రింబవళ్ళు నిద్రకూడాలేకుండా తిరుగుచు రాత్రివేళలో ఆమెను తలచుకొని ఒక శ్లోకాన్ని పాడుతున్నాడు. ఈ భూమండలాన్నంతా వెతుకుతూ వేదనపడుచున్నాడు. అలా తిరుగుతూ ఎప్పుడోఎక్కడో చేరి ఆ మందబుద్ధి ఆమెను తలచుకొని ఈ శ్లోకం చదివాడు.
పాపం అతడు వియోగ దుఃఖాన్ని పిండదగినవాడే! కష్టసమయాల్లో ఆ తరుణి అతడితో కలసి అరణ్యాలలో కూడా అనుసరించింది.
అల్పుడైన అతడిచే ఆమె విడువబడింది. ఒంటరిది. లోకంపోకడ ఏమాత్రమూ తెలియనిది. అడవిదారులలో తిరగటం చేతగానిది. ఆమెకు అంతటి కష్టం రావడం తగదు. ఆకలిదప్పులతో క్రూరమృగాలుండే ఆ కీకారణ్యంలో తిరుగుతూ ఆమె జీవించటం కష్టం. మందభాగ్యుడైన అతనిచే విడువబడింది’’ అని చెప్పి దుఃఖించాడు.బాహుకుడి పలవరింతలు విని ఒకనాడు జీవలుడు తనలో ‘‘ఈ బాహుకుడి చేతులా పొట్టివి! ....

- ఇంకాఉంది