మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునందను ప్రేమతో కౌగలించుకొని దమయంతి విప్రుడైన సుదేవుడు వెంటరాగా విదర్భ దేశానికి పయనమైంది.
దమయంతి కొద్దికాలంలోనే విదర్భ నగరానికి చేరింది. దమయంతి రాకను చూచి తల్లిదండ్రులు, బంధువులు అందరూ సంతోషించారు.
తల్లిదండ్రులను బంధుజనాన్ని కలిసిన దమయంతి సంతోషించింది. క్షేమంగా ఉన్న తన సంతానాన్ని చూచి ఆనందించింది. వేద పండితులైన బ్రాహ్మణులను పూజించింది. నమస్కరించి దీవెనలను పొందింది. విధివిధానంగా దేవతారాధనను చేసింది.
బంధువులవద్ద ఉన్నప్పటికినీ శరీరసౌఖ్యాలను త్యజించి మాసిన సగం చీరనే ధరించి దుమ్ము పేరుకొనిపోయి ఒప్పుతున్న శరీరంతోనే భర్తకోసమే దీక్షతో బ్రతికింది.
భీమరాజు కుమార్తెను చూచి సంతోషించాడు. తన కూతురును తీసికొని వచ్చిన విప్రుడు సుదేవునకు మాటప్రకారం వేయి మంచి గోవులను ఇచ్చాడు. ఒక గ్రామాన్ని, కొంత ధనాన్ని ఇచ్చి గౌరవించాడు. దమయంతి తండ్రి గారింట్లో విశ్రాంతితో రాత్రులు గడుపుచున్నది. ఒకనాడు తన తల్లినిచేరి దమయంతి
‘‘అమ్మా! నేను సత్యానే్న చెప్తున్నాను. నేను జీవించాలనే కోరిక నీకుంటే, నా దుఃఖాన్ని పోగొట్టాలని ఉంటే, పుణ్యచరిత్రుడైన నా భర్త నలుని వెదకటానికి మనుషులను పంపగలవు. అతనిని మరలా తీసికొని రావడానికై ప్రయత్నింపుము. నలుని చూడకుంటే నేను బహిరంగంగా ఈ లోకాన్ని వదలి పరలోకానికి వెళతాను’’ అని పలుకగా తల్లి చెప్పలేనంతగా దుఃఖించింది. కన్నీరుకారుస్తూ ఏమియు బదులుచెప్పలేకపోయింది.
మహారాణి దుస్థితిని చూచిన అంతఃపుర పరివారం దుఃఖంతో హాహాకారాలు చేస్తూ వెక్కివెక్కిపడ్డారు.
‘‘పుత్రిక దమయంతి తన భర్తను గుర్తించి దుఃఖిస్తున్నది. కూతురు తనకుతానై నోరువిడిచి అడిగింది. ఇప్పుడైనా పుణ్య శ్లోకుడైన నలుని వెదకటానికి మనవారిని పంపి ప్రయత్నించండి’’ అని మహారాణి భర్త భీమరాజుకు నివేదించింది. అందుకు భీమరాజు అంగీకరించాడు.
‘‘నలమహారాజును వెదకుటకు మీరందరూ ప్రయత్నించి అన్నిదిక్కులలో వెదకండి బ్రాహ్మణులారా! ఈ కార్యక్రమంలో మీరు కృతకృత్యులు కావాలి. మీకు తగిన బహుమానాన్ని ఇవ్వగలవాడను’’అన్న భీమరాజు విప్రవరులను పిలిపించి వారిని నలుని వెదికే కార్యక్రమానికి పురమాయించాడు.
బ్రాహ్మణులంతా దమయంతి చెంతకు వెళ్ళారు. వారు తమ ప్రస్థానాన్ని గురించి తెలియపరచారు. అప్పుడు దమయంతి వారితో
‘‘విప్రోత్తములారా! మీకు శత సహస్ర వందనాలు! మీరు పూజ్యులు. నా కష్టంలో కాస్త పాలుపంచుకొనండి. నాకు సహాయం చెయ్యండి.
నిషిధ దేశాధిపుడు అయిన నలమహారాజు ప్రస్తుతం అసమర్థుడు. పదవిని కోల్పోయినాడు కాబట్టి ఇతరులు తనను గుర్తించకుండా అజ్ఞాతవాసం చేస్తున్నాడు. అందువలన మీరు పరదేశాలకు వెళ్ళినప్పుడు జన సమూహమున్న ప్రదేశాలలో ఈవిధంగా పలకండి. అచటి సభలలో
‘‘నీవు నిత్య సత్యవ్రతుడివి. ప్రియుడా! అనురాగవతి అయిన నీ భార్యను మోసంచేసి ఆమె చీరను సగం చించుకొని నీవు కట్టుబట్టగాచేసికొని వెళ్ళిన జూదరివి. అట్లుపోవటం నీకు ధర్మమా? నీకు న్యాయమా? భరించబడేది భార్యఅని కదా ధర్మం? ఆ ధర్మం నీ పట్ల అసత్యమైంది గదా? నీవు ఎక్కడ ఉన్నావు? ఆ సగం చీర కట్టుకొని మిక్కిలి దుఃఖంతో దహింపబడుతూ ఆమె నీకోసం నిరీక్షిస్తున్నది. మహారాజా! ఆమె ఎల్లప్పుడూ నాకోసమే శోకిస్తున్నది. దుఃఖిస్తున్న ఆమెపై దయజూపుము. సత్కాలంలో పుట్టావనీ, దయగలవాడవనీ, అందరూ చెప్పుకొంటారు.’’
అని అన్నిచోట్ల చెప్పండి. ఎవరైనా ఆ మాటలు విని రోషంతో ఎదురు సమాధానం చెపుతాడో అటువంటివాడిని మీరు గుర్తించండి.
- ఇంకాఉంది