మెయిన్ ఫీచర్

గాసిప్స్ మంచివే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గాసిప్’ అంటే అందరూ ఏదో గాలి కబుర్లనీ, అవి ఎందుకూ పనికిరావని, పనికిమాలినవిగా భావిస్తారు. కానీ గాసిప్‌వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అస్తమానం పని.. పని.. అంటే విసుగే కదా!
బోర్‌కొడుతున్న వేళ బంధువులో, స్నేహితులో వచ్చినవేళ చక్కగా ఆరోగ్యకరమైన విషయం మాట్లాడుకుంటే అదే గాసిప్! క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్, రిలటీవ్స్, ఫిక్సర్స్, క్రికెట్, ఆఫీసు, బాసు, భార్య, భర్త, పిల్లలు, వంటలు, రైళ్ళు, బస్సులు, ప్రయాణాలు.. వంటి విషయాలతోపాటు మంచి చెడుల గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటే మనం ఫ్రెష్ అయిపోతాం! ఎంతో హాయినిస్తుంది. అప్పటిదాకా వున్న దిగులు, చింత, విసుగు అంతా మటుమాయమై నీరసం కాస్త హుష్ కాకయి మంచి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దటీజ్ గాసిప్! మరి గాసిప్ అంటే ఏమనుకుంటున్నారు! గాసిప్‌కున్న పవర్ అది!
గాసిప్ అంటే ఒకళ్ళ గురించి ఒకరు చెప్పుకోవడమంటారు. వాస్తవానికి ఒకరి గురించి మాట్లాడుకోకపోతే అసలు ప్రపంచంలో మాటలేముంటాయి. సీరియస్ మొహాలేసుకుని ఐన్‌స్టీన్‌లా, అరిస్టాటిల్‌లా మేధావుల ఫోజులు కొట్టి అస్తమానం సబ్జెక్టు మాట్లాడుకుంటే కొన్నాళ్ళకి పిచ్చిపట్టడం ఖాయం. ఎప్పుడూ సీరియస్ అయితే లైఫ్ థ్రిల్ ఉండదు. ఎంజాయ్ అంటూ మన లైఫ్‌లో కనపడదు.
కానీ, గమనిస్తే.. అలాంటి సీరియస్ ఫేస్ వాళ్ళంతా అసహనంతో, కోపంగా రగిలిపోతూ.. అసలు మాట్లాడితే కసిరేలా వుంటారు. కస్సుబుస్సులాడుతూ కనబడతారు మెట్టవేదాంతాలు మాట్లాడుతూ తామేదో పెద్ద వేదాంతులమని భ్రమిస్తూ మాట్లాడితే. అలాంటి వేదాంతం చెప్పేవాళ్ళుకూడా ఏడుపుకొట్టు మొహాలే.. మంచి గాసిప్‌ను స్వాగతించడం అటుంచి వ్యతిరేకించేవాళ్ళంతా ఓ జాతికి చెందినవారే! వీరెప్పుడూ విమర్శలను భరించలేరు. గాసిప్ మాట్లాడలేనివారు జీవితంలో సక్సెస్ కూడా కాలేరు. ఆరోగ్యకరమైన గాసిప్ స్నేహవర్షాన్ని, బంధాన్ని పెంచుతుంది. గాసిప్ ఎప్పుడూ హాస్యపూరితంగా ఉండాలి. ఇలాంటి గాసిప్‌వల్ల స్నేహాలు బలపడతా. మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. మన పైస్థాయిలోని వ్యక్తుల గురించి విమర్శిస్తూనో, మెచ్చుకుంటూనో కాసేపు కబుర్లు చెప్పుకున్నామనుకోండి. మనమూ వాళ్ళను విమర్శించేంత గొప్పవాళ్ళమయ్యామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళకంటే మనమెంత నయమో అర్థం చేసుకోగలుగుతాం. గాసిప్‌వల్ల ఇద్దరు వ్యక్తులమధ్య పరస్పర అవినాభావ సంబంధాలు బాగా బలపడతాయి. అయితే ఆ కబుర్లు ఇతరుల గురించో, సినిమాల గురించో, ఇంటింటి రామాయణం గురించో కాకుండా మీరు పంచుకోదగిన మంచి విషయాల గురించి మాట్లాడుకుంటే రిలాక్స్‌గా వుంటుంది. వ్యక్తిగతంగా ఇద్దరు వారి వారి సాధక బాధలు, మంచి చెడుల గురించి మాట్లాడుకుంటే సమస్యల పరిష్కారాలు, స్నేహబంధం మరింత పెనవేసుకోవడం జరుగుతుంది. పైగా ఓదార్పు లభిస్తుంది. మంచి సూచనలు, మార్గదర్శకాలు కూడా అందిపుచ్చుకోవచ్చు.
చాలామంది ఆడవాళ్ళే గాసిప్ ఎక్కువగా మాట్లాడతారని అంటారు. నిజానికి మగవాళ్ళకి కూడా బోలెడు గాసిప్ కావాలి. రాజకీయ, పరస్పర కక్షలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, క్రికెట్, సినిమాల వంటి కబుర్లుకూడా మగాళ్ళు గంటల తరబడి చెప్పుకుంటారు. బయట ప్రపంచం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే- ఆడవాళ్ళు ఇల్లు, భర్త, పిల్లలు, కుటుంబం గురించి మాట్లాడుకుంటారు. కొంతమంది ఆడవాళ్ళయితే అత్తమామల సంగతి పక్కన పెట్టి తన అమ్మా నాన్నల వైపు వాళ్ళ గురించే గొప్పలు చెప్పుకోవడంతోనే మెహర్బానీ పొందడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు ఇంట్లో జరుగుబాటు, పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తూ గాసిప్ మాటలతో మంచి సలహాలను పొందుతారు. ఏదిఏమైనా ఆడవాళ్ళు ఊహ, కల్పన, దూరాలోచనలముందు మగాళ్ళు దిగదుడుపే!
మీరు గమనించారో లేదోగాని మధ్యాహ్నం పూట సెల్‌ఫోన్స్, అరకొరా లాండ్ లైన్స్ ఎప్పుడూ ఎంగేజ్‌లో వుంటాయి. ఎందుకనుకుంటున్నారు..?
అప్పుడు ఆడవాళ్ళంతా స్నేహితులతోనో, బంధువులతోనో గంటలకొద్దీ మాట్లాడుతుంటారని ఒక సర్వేలో తేలింది.
ఎప్పుడో పొరపాటున క్రాస్ టాక్స్ వస్తే శ్రద్ధగా వినండి- వాళ్ళ కబుర్లలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, పట్టుచీరలు, పంటలు, కష్టాలు, కన్నీళ్ళు వగైరా.. వగైరా లాంటివి కబుర్లే ఉంటాయి. రోజువారి పనుల ఒత్తిడి, విసుగుల నుంచి బయటపడడానికి ఇలా గంటల తరబడి కబుర్లు చెపుతూనే వుంటారు.
ఎదుటివారిని అర్థం చేసుకోవడానికీ, వారిని అంచనా కట్టడానికి గాసిప్ ఎంతో పనికి వస్తుంది. వాళ్ళెందుకు అలా మాట్లాడారు? అలా చెప్పారు.. వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? వాటి ద్వారా వాళ్ళ వ్యక్తిత్వం, గుణదోషాలు, వారి అలవాట్లు మంచివా? చెడ్డవా? వాటి ఫలితాలు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి గాసిప్ ఎంతో దోహదపడుతుంది.
నెగెటివ్ గాసిప్స్ ప్రమాదకరం
ఏమండోయ్! నెగెటివ్ గాసిప్స్ మాత్రం చాలా ప్రమాదకరం కులం, మతం, జాతి, రంగు, లింగభేదాలు గాసిప్‌కు దూరంగా ఉంచాలి. మరీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదు. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడంవల్ల మనశ్శాంతి కరువై వ్యక్తిగత అభిప్రాయ భేదాలవైపు దారితీస్తుంది. స్నేహితులు కాస్త శత్రువులుగా మారిపోతారు. ఆచారాల గురించి, చాందస భావాల గురించి, కులాంతరాల గురించి మాట్లాడుకుంటూ పోతే అవి చివరికి ప్రమాదానికి దారితీస్తాయి. ఆడవాళ్ళయితే జుట్టు జుట్టు మెలేసుకునే స్థాయికి చేరుకుంటాయి. చివరికి మగాళ్ళ దగ్గరికికూడా చేరి కేసుల దాకా వస్తాయి, తస్మాత్ జాగ్రత్త!
మనం మాట్లాడుకునే గాసిప్ మాటలు ఇతరులకి ఏ విధంగానూ బాధగాని, హానిగాని కలిగించేవిగా ఉండకూడదు. నెగెటివ్ గాసిప్స్ మనుషులమద్య వున్న మంచి సంబంధాలను సైతం చెడగొడతాయి.
గాసిప్‌కు ఒక సేఫ్ జోన్ అంటూ ఉండితీరాలి. ఉదాహరణకు మీ పైఅధికారుల గురించో, స్నేహితులు, బంధువులు, ఇతరుల గురించో మాట్లాడుతుంటే ఆ విషయాలు సంబంధిత వ్యక్తులకు చేరిపోయే అవకాశం వుంటుంది. గాసిప్ కబుర్లకు పోయి కొరివితో తల గోక్కోవద్దు సుమా!
ప్రతివారిలో ఏవో కొన్ని లోపాలనేవి వుంటాయి. అలా అని దగ్గరివారి గురించి చెడుగా మాట్లాడకండి. స్నేహాలు, బంధుత్వాలు చెడిపోతాయి. అసలు ఎవరి గురించి చెడుగా మాట్లాడకపోవడమే అత్యుత్తమం. మంచి గాసిప్ అంటే అదే మరి! గాసిప్‌లో జోక్స్, మంచి విషయాలు చెప్పుకోవడంవల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మానసిక ఆందోళనలనుంచి బయటపడతాం. ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతంగా ఉంటాం. మంచి గాసిప్‌వల్ల ఓదార్పు, శాంతం, ఆనందం, మానసిక ఉల్లాసం, ప్రేరణ, కొన్ని సమస్యలకు పరిష్కారం, అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660