మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు నలుడు ఆ రథానికి తన గుర్రాలను పూన్చి తెచ్చాడు. అవి మనోవేగం, వాయువేగంగల గుర్రాలు. సమస్త శుభ లక్షణాలుగలవి. రథాన్నితెచ్చి ఋతుపర్ణుడివద్ద నిలిచాడు. ఆ గుర్రాలను చూచిన ఋతుపర్ణుడు కొంచెం కోపంతో
‘‘బాహుకా! మేము నిన్ను కోరింది ఇదియా? వీటితో మేము గమ్యాన్ని చేరగలమా? చేరలేము. ఈ గుర్రాలు బక్కచిక్కి బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి కృశించిన గుర్రాలతో మనం అంతదూరానికి ఎలావెళ్ళగలము? అని అనగా
‘‘మహారాజా! ఈ గుర్రాలు వాయువేగంతో పరుగెత్తుతాయి. ఒకటి నుదుటియందు, రెండవ తలపై, రెండేసి పార్శ్వ ఉపపార్శ్వాలలో రెండు వక్షస్థలమందు సుడులుకల అశ్వాలు వేగంగా ప్రయాణించేవిగా తెలిసికోతగింది. ఈ గుర్రాలు ఒక్కరోజులో ప్రొద్దుక్రుంకే లోపలే విదర్భ నగరానికి చేరగలవు. సందేహం లేదు. అయితే మహారాజా! మీరు ఇతర అశ్వాలేమయినా మంచివనుకుంటే ఆ అశ్వాలనే రథానికి కడతాను’’ అని అనగా ఋతుపర్ణుడు
‘‘బాహుకా! గుర్రాల శారీరక మానసిక తత్త్వాలను బాగాతెలిసిన నేర్పరివి నీవు. నీవు సమర్థాలని తలచిన గుర్రాలనే రథాన్ని పూన్పుము. ఆవిధంగా నేడే ప్రొద్దుక్రుంకే లోపలే విదర్భ చేరగలిగితే, నీకు గుర్రాల స్వభావం తెలిసికొనటంలో వాటికి శిక్షణ ఇవ్వటంలో ఉండే నైపుణ్యాన్ని తెలిసికొని నీవుకోరిన అభీష్టాన్ని ఇవ్వగలవాడివి.’’
అని అన్నాడు. ఋతుపర్ణుడు బాహుకుడితో, వార్‌ష్ఠేయుడితో కలిసి రథాన్ని అధిరోహించాడు.
ఋతుపర్ణుడు రథాన్ని అధిరోహించాడు. ఆ అశ్వాలు మోకాళ్ళతో భూమిని తాకాయి. బాహుకుడు అశ్వాలను ఊరడించాడు. పగ్గాలను పట్టాడు.. బయలుదేరాలని తలంచి వాటిని అదలింపగా ఆ ఉత్తమాశ్వాలు ఆకాశంపైకి ఎగిరి పరుగులు తీశాయి. వాటి పరుగులు చూచిన ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. రథం, ధ్వనిని విన్న వార్‌ష్ణేయుడు బాహుకుని గుర్రాల ఎన్నికను అశ్వహృదయ తత్త్వజ్ఞతను గురించి ఆలోచించాడు.
‘‘ఈ బాహుకుడు ఇంద్రుని రథసారథి మాతలి కాదుగదా? అతని లక్షణాలు బాహుకుని యందు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గుర్రాల జాతిని, వాని తత్త్వాన్ని తెలిసిన శాలిహోత్రుడు కాదుగదా? అతడే మానవాకారాన్ని పొందాడేమో? లేదా అరివీర భయంకరుడైన నలమహారాజు ఏమో? ఆ నలమహారాజే ఈ రూపంలో వచ్చాడేమో?
భూలోకంలో అశ్వశాస్త్రం తెలిసినవాడు నల మహారాజు. బాహుకునికి ఆ విద్య తెలియదు. ఈ విషయంలో నలునికి బాహుకునికి సామ్యం కనిపిస్తున్నది. నలుడు బాహుకుడు కూడా సమవయస్కులు. అయితే మహా పరాక్రమవంతుడైన నలుడు మాత్రం ఆ బాహుకుడు కాదు.
అయితే విద్య మాత్రం అదే. విధివశం చేతగానీ, దైవ ప్రేరణ చేతగానీ మహాత్ములైనవారు కొందరు ఇలా ప్రచ్ఛన్న రూపంలో భూమిపై సంచరిస్తు తారసలాడుతుంటారు. అలా అని శాస్తవ్రాక్యాలు నిరూపిస్తున్నాయి. ఏమయినా బాహుకుడే నలుడనిపిస్తున్నాడు. ‘‘అలా ఆలోచించిన వార్‌ష్ణేయుడు బాహుకుని హయతత్త్వజ్ఞతను గూర్చి బాగా యోచించి సంతోషించాడు. ఋతుపర్ణుడు కూడా సంతోషించాడు.
బాహుకుడు రథాన్ని నడుపుతుంటే ఆకాశంలో పయనిస్తున్నట్లున్నది.. అది నదులను, పర్వతాలను, అరణ్యాలను, సరస్సులను శీఘ్రంగా అధిగమించింది.
రథం మహావేగంగా పరుగులిడుచున్నది. మరలా వార్‌ష్ణేయుడు రథాన్ని నడుపుతున్న విధానాన్ని చూచి
‘‘ఈ బాహుకుని వయస్సుకు, చదువుకు సంబంధించిన గొప్పదనంలో నలుడితో సమానుడే. అయితే ఆకారంలో పోలిక లేదుగదా? రూపం మారటానికి కారణమేమైనా ఉన్నదా? మహాపురుషులు కారణాంతరాల చేత మారు రూపంలో ఇతరులకు తెలియరాకుండా ఉండటం కద్దు.
- ఇంకాఉంది